Jump to content

Recommended Posts

Posted
 
తెలంగాణ సర్కారుపై డీటెయిల్డ్ గా విరుచుకుపడ్డ దేవినేని ఉమా      04:46 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైన కృష్ణాజలాల అంశంపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరణాత్మకంగా స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నదీ జలాల బోర్డుల విభజన అంశం చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కోరుకున్నట్టే కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటైందని తెలిపారు. మిత్రుడు జగన్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడని, అందుకే, అతని తరపున కేసీఆర్ మాట్లాడుతున్నట్టుందని ఎద్దేవా చేశారు. ఈ అంశంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కావాలని సమస్యను కొనితెచ్చుకుంది తెలంగాణ సర్కారే అని దెప్పిపొడిచారు. ఏపీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కేసీఆర్ విజయవాడలో సభ పెడతాననడంపై మాట్లాడుతూ, విజయవాడలో కాదని, సొంత జిల్లా విజయనగరంలో పెట్టుకోవాలని ఉమా సవాల్ విసిరారు. 

కరవు ప్రాంతాల్లోని రైతులు బాగుండాలనే తాము కోరుకుంటున్నామని, అందుకే విద్యుదుత్పత్తి అంశంలో పంతాలకు పోవడంలేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో రాగి సంకటి ముద్ద పెడతాం, ఓ గ్లాసు నీళ్లివ్వండని అడుగుతుంటే, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు దీనిపై రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో నీటి సమస్యపై తామేమీ మాట్లాడడంలేదని, హరీశ్ రావు మంచినీటిపై మాట్లాడడం సరికాదని హితవు పలికారు. 

తెలంగాణ సర్కారు నెట్టెంపాడు నుంచి 2.63 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.62 టీఎంసీలు, భీమా నుంచి 2 టీఎంసీలు, కోయిల్ సాగర్ నుంచి 1.8 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 7.05 టీఎంసీలు, ఏఎంఆర్ ప్రాజెక్టు కెనాల్ కింద 13.15 టీఎంసీలు, హైదరాబాద్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు 4.72 టీఎంసీలు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి 60.96 టీఎంసీల నీటిని వాడుకుందని ఉమా వివరించారు. ఇక, జీవో నెంబర్ 107లో చెప్పకపోయినా శ్రీశైలం నుంచి 243 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తికి వాడుకుందని ఆరోపించారు. తద్వారా 1307 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారని వివరించారు. అటు, నాగార్జునసాగర్ లో 133 టీఎంసీల నీటితో 872 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారని తెలిపారు. మొత్తమ్మీద 2179 మిలియన్ యూనిట్ల మేర విద్యుదుత్పత్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం తమపైనే ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

 

Posted

కృష్ణా బోర్డు ఛైర్మన్ కృష్ణ పండిట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ కు బోర్డు ఛైర్మన్ ను దూషించడం తగదని సూచించారు. ఆయన భాషను సభ్యసమాజం ఒప్పుకుంటుందా? అని మంత్రి ప్రశ్నించారు. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. సమస్యను తాము సామరస్యంగా పరిష్కరించాలని కోరుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం కావాలని రాద్ధాంతం చేస్తుందన్నారు. 

కరవు పీడిత ప్రాంతాలను కాపాడాలని తాము కోరుకుంటామని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తమకు ముఖ్యమేనన్నారు. అయితే, విభజన చట్టం, బోర్డు తీర్పుననుసరించి వెళ్లానన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్ సాగర్ లోని నీళ్లు వాడుకుందని, సాగర్ నుంచి 80.65 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకుందని ఉమ వివరించారు. అటు శ్రీశైలం, సాగర్ లో 2,179 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారని చెప్పారు. అయినా ఇవాళ పంతానికి వెళ్లి మరీ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. మీరెన్ని తిట్లు తిట్టినా మేం ప్రజాస్వామ్యంగా ఉంటామని, చట్టాలను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.

Posted
 
తెలంగాణ విద్యుదుత్పత్తికి ఏపీ అడ్డు చెబుతోందని చెప్పాం: హరీశ్ రావు    videoview.png 04:22 PM
శ్రీశైలం జల విద్యుత్ విషయంలో తెలంగాణకు రావాల్సిన వాటాపై కేంద్ర మంత్రులు ఉమాభారతి, పీయూష్ గోయల్ ను మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. అధికారికంగా తమకు రావల్సిన వాటాను రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు హరీశ్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 2 తరువాత ఉత్పత్తి చేయవద్దని కృష్ణా బోర్డు తీర్పులో లేదని ఉమాభారతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. 

విద్యుదుత్పత్తి విషయంలో కృష్ణా బోర్డుకు మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. నీటి కేటాయింపులు లేని హంద్రీ నీవాకు కూడా ఇప్పటికీ సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశామని హరీశ్ వెల్లడించారు. దీనికి స్పందించిన ఉమాభారతి తెలంగాణ రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. అటు మంత్రి పీయూష్ గోయల్ ను కలసి, పవర్ విషయంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ఎలా ఉల్లంఘిస్తోందో వివరించామన్నారు.

 

Posted

Ee Post chadhavatam start chesaka complete ga chadavandi:

VINAYAKUNIKI 7 names

1-Ganapati

2-Gajanana

3-Lambodara

4-Gouri putra

5-Ganesha

6-Ekadanta

7-Vakratunda

ee 7 names 20 threads lo post cheyandi next monday lopu oka good news vintaru

Posted

Ee Post chadhavatam start chesaka complete ga chadavandi:

VINAYAKUNIKI 7 names

1-Ganapati

2-Gajanana

3-Lambodara

4-Gouri putra

5-Ganesha

6-Ekadanta

7-Vakratunda

ee 7 names 20 threads lo post cheyandi next monday lopu oka good news vintaru

nuuuv viinava ms2.gif

Posted

Ee Post chadhavatam start chesaka complete ga chadavandi:
VINAYAKUNIKI 7 names
1-Ganapati
2-Gajanana
3-Lambodara
4-Gouri putra
5-Ganesha
6-Ekadanta
7-Vakratunda
ee 7 names 20 threads lo post cheyandi next monday lopu oka good news vintaru

Posted

Ee Post chadhavatam start chesaka complete ga chadavandi:
VINAYAKUNIKI 7 names
1-Ganapati
2-Gajanana
3-Lambodara
4-Gouri putra
5-Ganesha
6-Ekadanta
7-Vakratunda
ee 7 names 20 threads lo post cheyandi next monday lopu oka good news vintaru

aapandi ee spaming. evaru  cheppadu 7 names lo post chesthe good news vintaru ani. blind gaa believe cheyyadamenaa 

×
×
  • Create New...