CKRAVI Posted November 3, 2014 Report Posted November 3, 2014 ‘శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తికి ఉమాభారతి గ్రీన్ సిగ్నల్’ శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు చెప్పారు. ఢిల్లీ టూర్ లో ఉన్న ఆయన మాట్లాడుతూ, ఏపీతో ఏర్పడ్డ కరెంట్ గొడవపై, కృష్ణా బోర్డు నిర్ణయంపై కేంద్రమంత్రికి కంప్లైంట్ చేశామని చెప్పారు. రైతు సమస్యల నేపధ్యంలో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చని, నవంబర్ 2 తర్వాత ఉత్పత్తి నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఉత్తర్వుల్లో ఎక్కడా లేదని ఉమాభారతి చెప్పినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రానికి కొత్త పవర్ ప్లాంట్లను కేటాయించాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ని కోరామని అన్నారు. దీనికి, పియూష్ సానుకూలంగా స్పందించారని హరీష్ రావు చెప్పారు.
Recommended Posts