Hitman Posted November 3, 2014 Report Posted November 3, 2014 న్యూఢిల్లీ, నవంబర్ 3 (టీ మీడియా): శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు. నవంబర్ 2 తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయవద్దంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వుల్లో చెప్పలేదని.. అందువల్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని ఆమె తెలిపారు. తెలంగాణకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
Recommended Posts