Jump to content

Recommended Posts

Posted

ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ నేతలపై నోరు పారేసుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలు మాట్లాడేందుకు ఎందుకు భయపడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పదవి చేపట్టిన ఇంత కాలంలో కనీసం ఒక్క రైతు ఆత్మహత్యనైనా ఆపగలిగారా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు. హైదరాబాదుని అభివృద్ధి చేస్తామంటూ మాటలు చెబుతూ కనీసం జంటనగరాల్లో విద్యుత్ కోత లేకుండా చేయగలిగారా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు వచ్చిన విద్యుత్ వాటా, నిధులు ఎంత?... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న నిధులు, విద్యుత్ ఎంత? అని పరకాల సూటిగా అడిగారు. మిగులు నిధులు, అధిక విద్యుత్ కేటాయింపులతో ప్రయాణం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఎందుకు ఉడికిపోతోందని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం సభ్యత, సంస్కారం అలవరచుకోవాలని, ప్రజలకు వాస్తవాలు వివరించే ధైర్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెడితే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కి గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

Posted

Lafangi Pink Panther LK KCR wont listen to any one photo-thumb-47618.png?_r=1412767323

×
×
  • Create New...