Jump to content

Recommended Posts

Posted
నోరా లేక మోరీనా...? నోరు అదుపులో పెట్టుకో!: ఎర్రబెల్లి, కేసీఆర్ మధ్య వాగ్యుద్ధం     videoview.png 04:08 PM
తెలంగాణ బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీటీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిందని సమాచారం. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఏసీ భేటీ జరిగింది. తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నాయి. టీడీపీ నుంచి ఎర్రబెల్లితో పాటు రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. దీనిపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

దీంతో, ఎర్రబెల్లి కల్పించుకుని గతంలో బీఏసీలో ఇద్దరు టీడీపీ నేతలకు అవకాశమిస్తామని కేసీఆర్ చెప్పిన మాటను గుర్తు చేశారు. సీఎం మాటపై నిలబడాలని, ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. దీనికి నిరాకరించిన కేసీఆర్, సభను సజావుగా ఎలా నడపాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సభలో ఎలా నడుచుకోవాలో మాకూ తెలుసంటూ రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో, 'బడ్జెట్ వినే ఓపిక లేని వారికి సభ ఎన్నిరోజులు నడిస్తే ఎందుకు?' అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

దీంతో, ఎర్రబెల్లి కల్పించుకుని "నీది నోరా, లేక, మోరీనా?" అంటూ వ్యాఖ్యానించారు. "మాటిస్తావు, దానిని ఉల్లంఘిస్తావు" అంటూ సీఎంపై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా "ఎర్రబెల్లీ... నోరు అదుపులో పెట్టుకో" అంటూ కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. నేతల మధ్య మాటల జోరు పెరుగుతుండడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్టు తెలుస్తోంది.

 

Posted

The BAC meeting on finalising the agenda of Telangana assembly session has witnessed a war of words between Chief Minister KCR and TS-TDP forum convener Errabelli Dayakar Rao. Errabelli alleged that KCR had earlier promised to allow two members of the party to speak in the meeting but has now changed his version permitting only one member to express his views. More details are expected after the completion of BAC meeting.

Posted
  కొత్త సీసాలో పాత సారాలా ఉంది: బడ్జెట్ పై బీజేపీ నేత లక్ష్మణ్      02:08 PM
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ పెదవి విరిచారు. అంకెల గారడీ తప్ప మరొకటి కాదని విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉందని పెదవి విరిచారు. లక్ష కోట్ల బడ్జెట్ అంటూ ఆడంబరాలకు పోయారేగానీ, రైతుల ఆత్మహత్యలకు పరిష్కారాన్ని మాత్రం చూపలేకపోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరవు గురించి బడ్జెట్ లో ప్రస్తావించకపోవడాన్ని లక్ష్మణ్ తప్పుబట్టారు. 

 

Posted

LOL revnath vaste emainid vadiki Brahmi-8.gif


Pichal pack ainai emo
Posted

LOL revnath vaste emainid vadiki Brahmi-8.gif

 

 

Pichal pack ainai emo

ali+venu+madhav+gif+%25282%2529.gif

×
×
  • Create New...