Jump to content

A Man Being Eaten Alive By Anaconda


Recommended Posts

Posted

వాషింగ్టన్: ఓ వ్యక్తి అత్యంత సాహసోపేతమైన కార్యానికి సిద్ధపడ్డాడు. పాల్ రోసాలి అనే వ్యక్తి తొలిసారిగా అనకొండ నోటి నుంచి కడుపులోకి చొరబడి తిరిగి రావడానికి సిద్ధపడ్డాడు. ‘నాపేరు పాల్‌ రొసోలీ. అనకొండ నోట్లోకి సజీవంగా వెళ్తున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే! త్వరలోనే ఈ దృశ్యాలు మీరు చూడొచ్చు'అంటూ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన ఈ ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పాల్‌ రొసోలీ అమెరికాకు చెందిన పర్యావరణ ప్రేమికుడు, సాహసి. అనకొండతో ఆడుకున్న అనుభవం ఆయన సొంతం. పైగా రొసోలీ అనకొండకు ఆహారమయ్యే కార్యక్రమం డిస్కవరీ చానల్‌ ప్రసారం చేస్తుందట. ట్విట్టర్‌లో రొసోలీ 30 క్షణాల వీడియో ప్రకటన చేయగా, ఈ కార్యక్రమం వచ్చేనెల 7న ప్రసారం చేస్తామని డిస్కవరీ చానల్‌ అధికార ప్రతినిధి యూట్యూబ్‌లో ధ్రువీకరించారు. ఈటెన్ అలైవ్ పేర డిస్కవరీ చానెల్ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతోంది.

 

అనకొండ నోట్లో రొసోలీ తల పెట్టడం ఖాయం గానీ ఆయనకు ప్రాణాలకు మాత్రం అపాయం ఉండదని చెబుతున్నారు. ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ సూట్‌లాగా, రాకాసిపాము మింగేసినా తనకు ఏమీకాని విధంగా ‘స్నేక్‌ ప్రూఫ్‌ సూట్‌' ధరిస్తాడు. సజీవంగా అనకొండ నోట్లోకి వెళ్లి, అది ఆహారాన్ని ఎలా మింగుతుందో చిత్రీకరిస్తాడు. సజీవంగానే తిరిగి వస్తాడు. ఈ విషయాన్ని అతను యూట్యూబ్‌లో పెట్టిన మరో వీడియోలో స్పష్టం చేశాడు.

ఈ వీడియోలో అతను స్నేక్‌ ప్రూఫ్‌ సూట్‌ ధరించాడు. ‘నీ ప్రాణాల సంగతి దేవుడెరుగు. ఇలాంటి సూట్‌ వేసుకున్న నిన్న మింగితే అనకొండా ప్రాణాలకు ముప్పు రావొచ్చు. ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయండి' అంటూ డిస్కవరీ చానల్‌ను జంతువుల హక్కుల కోసం పోరాడే ‘పెటా' డిమాండ్‌ చేసింది.

Posted

pull video undaaaa

pull video next month 7th na anta ba

Posted

pull video next month 7th na anta ba

denemmma next month release lu ennnunayo

×
×
  • Create New...