Jump to content

Recommended Posts

Posted
 
నేను ఫామ్ హౌస్ రైతును కాను: ఎర్రబెల్లి      07:50 PM
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. తీర్మానం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, టీటీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకరరావు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. తాను స్వయంగా రైతునని, అందుకే రైతుల బాధలు తెలుసని కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల వల్లే రైతులు ఇప్పుడు దుస్థితిలో చిక్కుకున్నారని ఆయన ఆరోపించారు. దీనికి, ఎర్రబెల్లి బదులిస్తూ, తాను ఫామ్ హౌస్ రైతును కానని అన్నారు. చంద్రబాబు హయాంలో 9 గంటల విద్యుత్ ఇచ్చారని, కాంగ్రెస్ కూడా 7 గంటల విద్యుత్ ఇచ్చిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కారు 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేకపోతోందని విమర్శించారు. కరెంటు కొరత వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణలో 499 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఒక్క మెదక్ జిల్లాలోనే 82 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రెండు నెలలుగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఎర్రబెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. 

 

×
×
  • Create New...