Jump to content

Recommended Posts

Posted
వ్యవసాయం దండగన్న పార్టీ మీది: ఎర్రబెల్లికి ఈటెల కౌంటర్      08:41 PM
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ సర్కారే కారణమన్న ఎర్రబెల్లి దయాకరరావుకు మంత్రి ఈటెల రాజేందర్ ఘాటుగా బదులిచ్చారు. 'వ్యవసాయం దండగన్న పార్టీ మీది' అని దెప్పిపొడిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో బిల్ గేట్స్, బిల్ క్లింటన్ మోజులో పడి రైతులను నిర్లక్ష్యం చేసిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. అప్పట్లో చంద్రబాబు విధానాలపై 'ఈనాడు'లో వేసిన కార్టూన్ ను ఈటెల ఈ సందర్భంగా ఉదహరించారు. భోజనం కోసం ఇంటికి వెళ్లిన చంద్రబాబుకు భార్య ప్లేట్లో కంప్యూటర్ తో ఎదురొస్తున్నట్టు కార్టూన్ వేశారని వివరించారు. 

వ్యవసాయాన్ని నిరాదరణకు గురిచేస్తూ, ఏది లాభసాటి అయితే దాన్నే చేయాలని సాఫ్ట్ వేర్ బాట పట్టింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మీరు డిమాండ్ చేయకముందే రైతులను ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించామని ఈటెల స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలేదన్న ఎర్రబెల్లి వ్యాఖ్యకు బదులిస్తూ, డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా దేనికైనా ధరలు నిర్ణయిస్తారని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమకు రూ.100 కోట్ల సాయం చేశామని ఈటెల చెప్పారు. 

 

×
×
  • Create New...