Jump to content

Munduku Poni Jagan Annayya Vadilina Banam


Recommended Posts

Posted

jagan_sharmila1415597373.jpg

 

వైకాపా అధినేత జగన్ బాణం బెట్టు చేస్తోందా.. ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే ఎందుకు షర్మిల బయటకు రావడం లేదు? ఇన్నాళ్లు తనను పట్టించుకోలేదని అలకబూనిన ఫలితమా ఇది. ఆమె ఎందుకు ఇంకా, ఇప్పటికీ పార్టీకి అన్నకు దూరంగా ఉంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. కష్ట కాలంలో బాధ్యతలు భుజాన వేసుకుని,  పార్టీని ఉరుకులు పెట్టించిన షర్మిల ఇప్పుడు ఇంటికే ఎందుకు పరిమితమవుతున్నారు. స్వయంగా అన్ననే ఆమెను పిలిచి తెలంగాణ రాష్ట్ర భాద్యతలు ఇచ్చినా ఊహూ అంటూ ఎందుకు మొండికేస్తోంది అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

ఏమయిందో తెలియదు కాని జగన్ జైలు నుంచి వచ్చినప్పటి నుంచి షర్మిల అజ్ఞాతవాసమే గడుపుతున్నారు. తాను కోరిన చోటినుంచి తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో పార్టీకి దూరమైంది అన్న ప్రచారం కొన్నాళ్లు జరిగితే జగనే తనకు ప్రత్యామ్నాయంగా పార్టీలో మరో కేంద్రం ఉండొద్దని భావించి చెల్లెలిని పక్కన బెట్టాడన్న ప్రచారమూ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎన్నికలకు పోవడం అదికారం దక్కకపోవడం జరిగిపోయింది. 

కళ్లు తెరిచిన జగన్ తిరిగి మొదట తల్లిని పార్టీకి మళ్లీ దగ్గర చేసారు. కొన్ని మీటింగులకు హాజరైన విజయమ్మ తర్వాత ఇప్పుడు మళ్లీ కన్పించడం లేదు. ఇంట్లో కూడా జగన్ వైఖరికి అంతా విముఖంగా ఉన్నారన్న ప్రచారం జరగడం, స్థానికంగా ఉండీ పార్టీలో కనిపించకపోతే అందరు తలో రకంగా అంటారని భావించి షర్మిల ఏకంగా అమెరికాకే మకాం మారుస్తున్నారన్న ప్రచారం జరిగింది. తన పిల్లల చదువుల కోసం అమెరికా వెళుతున్నట్లు షర్మిల కూడా తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

తిరిగి ఏమయిందో కాని ఇంటి పెద్దలు సముదాయించడంతో ఆమె అమెరికా ప్రయాణం రద్దయిందంటున్నారు. దీంతో జగన్ చెల్లెలికి మళ్లీ సముచిత స్థానం కల్పించడానికి తెలంగాణ బాద్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఆ రాష్ట్ర భాద్యతలు అప్పగిస్తూ చెల్లెలు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో  పాటు ఓదార్పుయాత్ర కూడా చేస్తుందని జగన్ ప్రకటించి నెలరోజులు దాటిపపోయింది. అయినా షర్మిల గడపదాటి బయటకు రాలేదు. 

తెలంగాణలో పార్టీ పెద్దలు ప్రతి జిల్లాలో సమీక్షా సమవేశాలు ఏర్పాటు చేసారు. అయినా ఏ జిల్లా సమావేశానికి కూడా షర్మిల హాజరుకాలేదు. పోనీ జిల్లాల మీటింగులకు రాలేదనుకుంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తే దానికి కూడా షర్మిల గైర్హాజరయ్యారు. ఈవిషయమై వైకాపా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి సుధాకర్ రెడ్డిని మీడియా ప్రశ్నిస్తే ఆయన నోరుమెదపక పోవడంలో షర్మిల వైఖరిపై మొదటి నుంచి వినిపిస్తున్న వాఖ్యలే మళ్లీ వినిపిస్తున్నాయి.

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఏపిలో తనకు స్థానం ఇవ్వకుండా కనుచూపు మేరలో కూడా పార్టీ గట్టెక్కడం కష్టంగా కనిపిస్తున్న తెలంగాణకు తనను పంపించడం ఏమిటన్న భావన దీని వెనుక దాగి వుందా అని అనుమానం. ఏమైనా కూడా జగన్ ముందు అత్యవసరంగా తల్లిని, చెల్లిని నమ్ముకోవడం పార్టీని బతికించడానికి ఎంత ప్రయోజనకారి అయిందో, ఇప్పుడు దూరం పెట్టడం అన్ని విమర్శలకు కారణం అయింది.

 

Posted

she is in US knw.. 

contact DB sharmila fans presidnt SAMURAI cvyJRT.gif

Posted

she is in US knw.. 

contact DB sharmila fans presidnt SAMURAI cvyJRT.gif

 

ade US lo emi chestundi.. any one knows?

 

akkada TG lo janam veyyi kallato waiting anta.. 

Posted

Calling Brother_Anil baa asap.. reason plzzzzzzzzzzzzz.. what your Shaaru darls doing..??? @3$%

Posted

ade US lo emi chestundi.. any one knows?

 

akkada TG lo janam veyyi kallato waiting anta.. 

oh my bala cvyJRT.gif

×
×
  • Create New...