Jump to content

Recommended Posts

Posted

మాటలతో బురిడీ కొట్టించటమే కాదు.. విపక్షాలపై మొగ్గు సాధించే పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ వైఖరితో ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రతిపక్షంగా అధికారపక్షంపై ఏ చిన్న విమర్శ చేసినా.. వెనువెంటనే.. తెలంగాణ ద్రోహి అనో.. అప్రజాస్వామికంగా మాట్లాడటం లేదనో.. లాంటి వ్యాఖ్యలు చేయటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికారపక్షం తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేయటం మామూలే అయినా.. ఈ స్థాయిలో విరుచుకుపడటం.. విపక్షం నోరు తెరవటమే మహా అపరాధం అన్నట్లుగా అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలకు అతీతంగా విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏ అధికారపక్షం సైతం ఇంత దూకుడుగా వ్యవహరించలేదని చెబుతున్నారు.

విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమ ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ నేతలు.. తాజాగా అధికారపక్షంగా చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. పలు సందర్భాల్లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ప్రస్తావించారు. 

అందులో ఒక అంశం.. శ్రీకృష్ణ కమిటీకి లేఖ రాసిన కేసీఆర్‌. 1956 నవంబరు నాటికి ఎలాంటి తెలంగాణ ఉందో అలాంటి తెలంగాణ ఇవ్వటం వల్లనే.. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు పోయాయని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా కేంద్రం ఏడు మండలాల్ని ఏపీకి ఇస్తే.. గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని.. రాసిన లేఖని మర్చిపోయి రెండుసార్లు బంద్‌కు పిలుపునిచ్చారన్నారు. 

ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే విద్యుత్తు సమస్యపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను అబద్ధాలకోరుగా అభివర్ణించారు. దీంతో మంత్రి మహేంద్రరెడ్డి స్పందిస్తూ.. షబ్బీర్‌ అలీ అప్రజాస్వామిక భాష మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. జరిగిన విషయాలను జరిగినట్లుగా కూడా ప్రస్తావించటం కూడా అప్రజాస్వామికమేనా? మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్నసమాచారాన్ని కోట్‌ చేసి విద్యుత్తుపై రేవంత్‌రెడ్డి మాట్లాడితే.. తెలంగాణకు బ్లాక్‌ డే అని.. తెలంగాణ ద్రోహి అంటూ అధికారపక్షం విరుచుకుపడటం తెలిసిందే. చూస్తుంటే.. అధికారపక్షాన్ని భజన చేయటం తప్ప మరోలా విపక్షం వ్యవహరించకూడదని కేసీఆర్‌ అండ్‌ కో భావిస్తున్నట్లున్నారేమో.
 

×
×
  • Create New...