Jump to content

Recommended Posts

Posted

టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాటలకు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఇరిటేట్‌ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కంటే హరీశ్‌రావు బెటర్‌ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ తీవ్రంగా స్పందించారు.

టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. హరీశ్‌ ఆరోపించారు. అవాస్తవాలు ప్రచారం చేయటం రేవంత్‌రెడ్డికి తగదని.. ఇలాంటి ప్రచారం ఎవరు చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేసీఆర్‌ తనకు మేనమామే కాదని.. తండ్రి లాంటి వారని.. ఈ రాజకీయాలు.. పదవులు ఆయన పెట్టిన భిక్షేనని హరీశ్‌రావు పేర్కొన్నారు.

కేసీఆర్‌ తనకు వేలు విడిచిన మేనమామ కాదని.. వేలు పట్టి నడిపించిన తండ్రిలాంటి వాడన్నారు. తనకు రాజకీయ జీవితం.. పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్షేనని చెప్పారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవాల్సిన అవసరం తనకు లేదన్నారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తానని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని.. ఇకపై రేవంత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌ తీవ్రంగానే ఇరిటేట్‌ అయినట్లున్నారే.

×
×
  • Create New...