Jump to content

Gajam Biography By Namaste Telangana


Recommended Posts

Posted

రేవంత్ రెడ్డి! నువ్ మాట్లాడుతుంటే.. తాగినోని మాటలకు.. సాగినోని మాటలకు తేడా తెలుస్తలేదు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు సదివి.. అబద్ధాలాడుడు తప్ప.. ఏనాడన్న నువ్వు స్వతహాగా.. నిజాలు తెల్సుకునే ప్రయత్నం చేసినవా? అంటూ 12.44 నిమిషాలు... వరన్నా కోపంగా తిడతారు, బలంగా కొడతారు. కానీ ఈవిడేంటి చాలా శ్రద్ధగా మాట్లాడింది. గోడ కడుతున్నట్లు.. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. చాలా పద్ధతిగా కౌంటర్ ఇచ్చింది. అందుకే వేలల్లో వ్యూస్.. వందల్లో షేర్స్ వచ్చాయి. కానీ ఆంధ్రా వాళ్ల నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి?- అది తెలుసుకునేందుకు కాలిఫోర్నియాలో ఉంటున్న ఈ తెలంగాణవాదిని పలకరించాం.
 

సెప్టెంబర్ 11, 2013 యూట్యూబ్‌లో ఒక వీడియో..

నాయకుడివా.. నాయకుడివా.. పక్షపాతపు నాయకుడివా.. రాష్ట్రమేలేటీ నువ్వు సీమాంధ్రనాయకుడివా.. రూపాయి ఇవ్వనంటూ రంకెలేసిన నాయకుడివా.. అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది విజయ కేసరి.
అప్పటి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి కౌంటర్ సాంగ్ ఇది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తెలంగాణకు సంబంధించి రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. రెండు వారాల క్రితం రేవంత్ రెడ్డికి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఎవరీ డాక్టర్ విజయ కేసరి? ఆమెతో మాట్లాడాక తెలిసింది.. ఆమె డాక్టర్ మాత్రమే కాదు.. మంచి డాన్సర్.. సింగర్.. ఆర్‌జే కూడా అని. అమెరికన్ బిజీ లైఫ్‌లో తనకు దొరికిన కొద్ది సమయంలో తన తెలంగానం ఇలా పంచుకుంది.

ఇంటి ముందు కల్లాపి చల్లి వేసిన ముగ్గులు.. చిలుకవాగు నీళ్ళలో ఆటలు.. బతుకమ్మ కోసం కోసిన పూలు.. పండుగనాడు గుడి చుట్టూ తిరిగే బండ్లు.. ఇవన్నీ ఆమెకు గుర్తున్నాయి. తెలంగాణ పల్లెలో గడిపిన ఆ బాల్య స్మృతుల్ని ఎలా మర్చిపోగలను అంటూ తన గురించి చెప్పింది విజయ కేసరి. పుప్పాల భారతి.. 1969 తెలంగాణ ఉద్యమంలో రెండుసార్లు చంచల్ గూడ జైలుకు వెళ్లింది.

కేసరి యాదగిరిరావు కూడా అదే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ దంపతుల కూతురే విజయ కేసరి. హైదరాబాద్‌లో పుట్టి కరీంనగర్‌లోని హుజురాబాద్‌లో పెరిగింది. విజయ తల్లిదండ్రులే కాదు.. నాయనమ్మ కనకలక్ష్మి, మేనమామ పుప్పాల సుభాష్ చంద్రారెడ్డి కూడా తెలంగాణ కోసం జైలు జీవితం అనుభవించినవారే. అలా తెలంగాణ వాదం ఆమె బ్లడ్‌లోనే ఉంది.



ప్రస్తుతం...

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లోమాలిండా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎం.పి.టి) డాక్టరేట్ చేసిన విజయ తన పరిశోధనకుగాను ఎక్సలెన్సీ అవార్డు అందుకుంది. ఈమె కనిపెట్టిన ఒక ఛార్ట్ అమెరికాలో ఉన్న ప్రతి హాస్పిటల్, క్లినిక్‌లలో వాడుతున్నారు. అమెరికాలో ఇంతవరకూ ఎవరూ చేయని రీసెర్చ్ అది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కాంటిలో ఉంటూ వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. తెలంగాణ మలి దశ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లినప్పుడు యువకుల బలిదానాలు ఆమెను తట్టి లేపాయి. కేసీఆర్ ఉద్యమ పంథా ఒక గట్టి నాయకత్వ లక్షణంగా భరోసా కలిగించింది. ఆమె ప్రాంతం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించింది. మనసులోని ఆవేదన పాటల రూపంలో ప్రతిధ్వనించింది.



పాప్ స్టయిల్

సాధారణ ఉద్యమ గీతాలను తెలంగాణ గాయకులు జనాల్లో ఉత్తేజం కలిగించే స్టయిల్లో పాటలు పాడి ఉద్యమస్ఫూర్తిని కలిగించారు. యువతను ఉద్యమమార్గం వైపు మళ్ళించి వారిలో నూతన ఉత్సాహం కలిగించే దిశగా పాటలను రాసి.. వాటిని కాస్త వైవిధ్యంగా పాడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో పాప్ స్టయిల్‌ను ఎంచుకున్నారట విజయ. అవి జనాల్లోకి సూటిగా చొచ్చుకొనిపోయి అంతర్జాతీయంగా తెలంగాణ పాటలను పాడిన ప్రథమ గాయనిగా ఆమె ఘనత సాధించారు. సమైక్య పాలకుల వ్యాఖ్యానాలు విజయ హృదయాన్ని కలిచివేశాయి. శాసనసభలో హరీష్‌రావుపై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రిని చూసి కలత చెందింది. నిండు సభలో ఉన్న తెలంగాణ మంత్రులు, ఇతర శాసనసభ సభ్యులు హరీష్‌రావుకు మద్దతు పలకకపోవడం బాధ కలిగించింది. అప్పుడు పుట్టుకొచ్చిందే.. నాయకుడివా పాట. అప్పుడే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నెట్ ప్రాముఖ్యతను గుర్తించి నెటిజన్ల ద్వారా ప్రజల్లో నావంతు చైతన్యం కలిగించే దిశగా ఈ బాట ఎంచుకున్నాను అని చెబుతుంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా అభివృద్ధి విషయాలను చర్చించడానికి, బంగారు తెలంగాణ మీద అవగాహన కలిగించడం కోసం ఫేస్‌బుక్‌లో ఉద్యమస్ఫూర్తి నింపుతోంది.



అవమానమా?

సమస్యలపై స్పందించి ఫేస్‌బుక్‌లో ఘాటుగా స్పందించినప్పుడు తెలంగాణవారి నుంచి సానుకూల స్పందన వస్తే ఆంధ్రా నెటిజన్లు అసహ్యకరమైన వ్యాఖ్యలు రాసి ఆమెను రకరకాలుగా అవమానించారు. ఒక దశలో అమెరికాలోని ఆంధ్రావాళ్లు ఆమెపై హత్యాయత్నం కూడా చేశారట. మానసికంగానూ దెబ్బతీయాలని ఎన్నో కుయుక్తులు కూడా వేశారట. ఆంధ్రా నాయకులు కేసీఆర్‌కు చేసిన దానికంటే తనకు జరిగింది చాలా చిన్న అవమానం అని భావించింది. అలాగని నేను ఆంధ్రా ప్రజలను ద్వేషించడం లేదు. నాకు ఉన్న చాలా మంది మిత్రులు ఆంధ్రావారే కావడం విశేషం అని చెబుతుంది విజయ. వాస్తవాలను గుర్తించిన కొందరు ఆంధ్రా మిత్రులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారట.



తెలంగానం

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం దక్షిణ కాలిఫోర్నియా ఉమెన్ చైర్మెన్‌గా లాస్ ఎంజిల్స్, ఆస్ట్రేలియా పురవీధుల్లో బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని తెలంగాణ వాదం వినిపించారు విజయ. ఆరేండ్ల నుంచి దక్షిణ కాలిఫోర్నియా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. నాయకుడివా పాటకు మంచి స్పందన వచ్చిన తర్వాత.. తెలంగాణ ఆజాద్ హమారా అనే పాట రూపొందించారు. హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశామని చెప్పిన చంద్రబాబుకు సమాధానమే ఈ పాట. యువత ఆత్మబలిదానాలు చేసుకోవద్దని బంగారు తెలంగాణ సాధించడం కోసం తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని హితవు పలుకుతూ పాడిన పాట వద్దురా చావొద్దురా అనే పాట. ఐవిల్ నెవర్ లెట్‌యూ అనే ఇంగ్లీష్ పాట తెలంగాణ గురించి రాసిన తొలి ఇంగ్లీష్ పాట ఆమెదే.


సున్‌భాయి.. అన్నా ఓ ఆంధ్రన్న, రాజనీతి అంటూ సాగే పాటలు ఆంధ్ర రాష్ట్రంలో నాయకుల కుటిల రాజకీయాలకు దర్పణం పట్టాయి. పోలవరం ఆనకట్టు ముంపునకు గురయ్యే ఆదివాసీల స్థితిగతులు అడవుల్లో వన్యప్రాణులు ఘోషను ప్రతిబింబించే పాట ఆదివాసులమూ మేము అడవి ప్రాణులము అనే పాట. బాంగ్రా ైస్టెల్‌లో పాడిన తొలి బతుకమ్మ బాంగ్రా బతుకమ్మ.



మల్టీ డైమెన్షన్స్..

విజయ పదో తరగతి వరకు హుజూరాబాద్‌లోని సెయింట్ పాల్ స్కూల్‌లో చదువుకుంది. జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలో గీసిన శాంతి కపోతం చిత్రానికి ప్రథమ బహుమతి పొందింది. హన్మకొండలోని కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావుకు చెందిన గీతాంజలి కళాశాలలో ఇంటర్మీడియట్ బై.పి.సి చదివింది. ఆ తర్వాత కర్ణాటకలోని మంగళూరులో ఫిజియోథెరపిలో బ్యాచిలర్స్ డిగ్రీ సంపాదించింది. విజయకు చిన్ననాటి నుండే సంగీత, సాహిత్యాల్లో అభిరుచి ఉంది.

పాటలు రాయడం, బాణీలు కట్టడం నేర్చుకుంది. నాలుగేళ్ల నుంచి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి వెంపటి నాగేశ్వరి వద్ద నృత్య శిక్షణ ప్రారంభించింది. ఆ తర్వాత శోభానాయుడు, శాలిని, మాధవీమాల, సుధామాలల వద్ద కూచిపూడి, భరతనాట్యాలలో శిక్షణ తీసుకుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన విజయ సాధించిన బంగారు పతకాల గురించి ఇక్కడ చెప్పాలంటే ప్లేస్ సరిపోదు. అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా ఆమె గుర్తింపు సంపాదించారు.

ప్రముఖ ఆన్‌లైన్ రేడియోలైన తెలంగాణ రేడియో రేడియో ఖుషిల్లో వారానికి రెండు సాయంకాలం ప్రోగ్రామ్స్‌లో రేడియో జాకీగా కూడా పనిచేస్తున్నారు విజయ. అమెరికాలో తెలంగాణ రాష్ట్ర వార్తలు, భర్తల నిరాదరణకు, మోసానికి గురైన వారికి రేడియో ద్వారా న్యాయ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవసరమైతే రెస్క్యూ హోమ్‌లలో ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. అవసరమున్న పేదలకు, రైతులకు తనకు చేతనైనంత ఆర్థిక సహాయం చేస్తున్నారు.



ఎవరూ ఊరుకోరిక్కడ!

గత 60 సంవత్సరాలుగా రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు చేసిన అభివృద్ధి కేవలం ఆరునెలల్లోనే సుసాధ్యం చేయాలంటే కేసీఆర్ చేతిలో మంత్రదండం ఏదీ లేదు.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలి. తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏమి చేయగలిగేవాడో ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎవరూ ఊరుకోరిక్కడ. కరెంటు సమస్యను అధిగమించడం కోసం సోలార్ విద్యుత్ అవశ్యకత గురించి నేను ఫేస్‌బుక్‌లో సవివరంగా వివరించాను. మా మేనమామ డాక్టర్ సుభాష్ చంద్రారెడ్డి ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి తాను చేసిన సోలార్ ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రమంత్రులకు డెమాన్‌స్ట్రేషన్ చేసి చూపారు.



men.jpg

దానిని ఆచరిస్తే నెలలోపే రాష్ట్రంలో కనురెప్ప పాటు కూడా కరెంటు సమస్య ఉండదు.
మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే ? కేసీఆర్‌గారు అవినీతిరహిత పాలన గురించి కలలు కంటుంటే, క్షేత్రస్థాయిలో మున్సిపల్, నగర పంచాయితీ సభ్యులు, ఇతర డిపార్ట్‌మెంట్‌లలో అవినీతి విశృంఖలంగా చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు చేసి నాసిరకం పనులతో డబ్బు స్వాహా చేసే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరివల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. వీరిని రీకాల్ చేయాల్సిన అవసరం ఉంది.

Posted

bratikinchadu full picture eyakunda.. leka pote ... amaraveerula counter la gajam counter ani okati maintain cheyalsi vachedi..

Posted

bratikinchadu full picture eyakunda.. leka pote ... amaraveerula counter la gajam counter ani okati maintain cheyalsi vachedi..

ante full pic eyyakunda just aa face close up pic eyyadam valla nee manasu ki anandam kaligindhi antav

Posted

ante full pic eyyakunda just aa face close up pic eyyadam valla nee manasu ki anandam kaligindhi antav

 

janam chachipovalsina avasaram tapindi anna anndam mastaru.. aa Halloween makeup chusinanduku kadu..

  • Upvote 1
Posted

Andhra valla nunchi elanti comments vachayi chudam anta...akka photo reality ki chala duram gaa undi annukunta...

Posted

ante full pic eyyakunda just aa face close up pic eyyadam valla nee manasu ki anandam kaligindhi antav

he likes her rey..

he wants to protect her body from culturless vulture eyes of db ids

Posted

janam chachipovalsina avasaram tapindi anna anndam mastaru.. aa Halloween makeup chusinanduku kadu..

ee madhya baaga maripoyav nuvvu.... kavitha akka ni vadhilesi gajam venta padthunnav..... 

Posted

he likes her rey..

he wants to protect her body from culturless vulture eyes of db ids

dhenni kooda vadhulthallera DB janam harish%2520rao.gif

Posted

dhenni kooda vadhulthallera DB janam 

neeku sweety etlanoo...verey vallaki gajam atla..

evari feelings vallavi ...#respect

Posted

neeku sweety etlanoo...verey vallaki gajam atla..

evari feelings vallavi ...#respect

mahesh7.gif

Posted

chi deeenemma bathuku deeni uthaganey publicity ichi eedidaaka theeskochinaru

 

yaakkk  thuuuuu mee bathukulu 

Posted

i understand ur bp :)

 

neeku sweety etlanoo...verey vallaki gajam atla..

evari feelings vallavi ...#respect

mahesh7.gif

 

 

×
×
  • Create New...