Jump to content

Recommended Posts

Posted
రాజధాని భూముల అప్పగింతకు వ్యతిరేకంగా రైతుల సంతకాలు     04:50 PM
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సర్కారుకు తుళ్లూరు పరిసర రైతులు శనివారం షాకిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇవ్వబోమని వారు తేల్చి చెప్పారు. ఇందుకనుగుణంగా తమ వాదనను ప్రభుత్వానికి వినిపించేందుకు భూముల అప్పగింతకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. 150 రకాల పంటలు పండే తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చే పరిస్థితే లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాజధానికి కూరగాయాలు సరఫరా చేయడానికి తాము సిద్ధమని, భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు మాత్రం సిద్ధంగా లేమని ప్రకటించారు.

 

Posted
 
‘రాజధాని’ సబ్ కమిటీ ముందు రాయపూడి రైతుల ఆందోళన     05:17 PM
ఏపీ రాజధాని సబ్ కమిటీ ముందు తుళ్లూరు మండలం రాయపూడి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని కోసం భూములను అప్పగించేది లేదని తేల్చిచెప్పిన రైతులు సబ్ కమిటీ సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిటీతో పాటు సభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రైతులతో వాగ్వాదానికి దిగారు. 

అయినా శాంతించని రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సబ్ కమిటీ తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సబ్ కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని చెప్పబోమని కూడా రైతులు భీష్మించారు. నిన్నటిదాకా రైతుల నుంచి ఘన స్వాగతాన్ని ఎదుర్కొన్న కమిటీ, శనివారం రైతుల నుంచి నిరసనను ఎదుర్కొంది.

 

Posted

AP capital sub committee is touring various parts of proposed capital region to get feedback from farmers and to clarify their doubts over land pooling for capital construction. The committee has toured Rayapudi village in Thullur Mandal today and majority of the farmers skipped this meeting. They are vehemently expressing their opposition to give away their lands to the Government for the purpose of the capital on various issues

Posted

Can anyone explain Asalu raitulaki enduku mana govt I mean central and state eppudu choosina mondicheyyi enduku choopisthundi ?

×
×
  • Create New...