Jump to content

Sachin Tendulkar Inaugurates Pylon In His Adopted Village In Nllr Dist


Recommended Posts

Posted
పుట్టంరాజువారి కండ్రిగలో వంద ఇళ్లు... 600 జనాభా!     09:38 AM
భారతరత్న సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో ఉన్న ఇళ్ల సంఖ్య కేవలం వంద మాత్రమే. జనాభా కూడా 600లకు మించదు. ఈ గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దత్తత తీసుకున్న సచిన్, ఏడాదిలో దాదాపుగా రూ.3.5 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేబడతారు. 

గ్రామానికి చేరుకున్న సచిన్, గ్రామస్థులతో నేరుగా భేటీ అవుతున్నారు. అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న విషయంపై ఆయన, గ్రామస్థుల అభిప్రాయాలకే ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గ్రామస్థులతో చర్చిస్తున్నారు.

 

Posted
పుట్టంరాజువారి కండ్రిగ పైలాన్ ఆవిష్కరించిన సచిన్     09:28 AM
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు కొద్ది నిమిషాల క్రితం నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగ చేరుకున్నారు. గ్రామంలో పైలాన్ ను ఆవిష్కరించిన సచిన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపస చేశారు. నేటి మధ్యాహ్నం దాకా గ్రామంలోనే ఉండే సచిన్ గ్రామస్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. గ్రామ యువతతో సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడనున్న సచిన్ గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా సందర్శించనున్నట్లు సమాచారం. సచిన్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

 

Posted
   కండ్రిగ యువతతో సచిన్ సరదా క్రికెట్ మ్యాచ్     09:12 AM
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోమారు క్రికెట్ మైదానంలోకి దిగుతున్నారు. అదేంటీ, ఆయన రిటైర్ మెంట్ ప్రకటించేశారనేగా మీ సందేహం. నిజమైన మ్యాచ్ కాదులెండి. పుట్టంరాజువారి కండ్రిగ పర్యటనలో భాగంగా గ్రామ యువతతో ఆయన సరదా మ్యాచ్ ఆడేందుకు అంగీకరించారట. ఇందుకోసం పిచ్ కూడా సిద్ధమైంది. సచిన్ తో సరదా క్రికెట్ ఆడే అవకాశం రావడంతో గ్రామ యువత ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఇదిలా ఉంటే, కొద్దిసేపటి క్రితం కృష్ణపట్నం పోర్టు నుంచి కండ్రిగకు బయలుదేరిన ఆయన మరికొద్ది సేపట్లో గ్రామానికి చేరుకోనున్నారు. గ్రామంలో మధ్యాహ్నం 1 గంట దాకా పర్యటించే సచిన్, గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతారని సమాచారం. దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

 

Posted

sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4

×
×
  • Create New...