Jump to content

First Time In India.. Only For Men


Recommended Posts

Posted

చెన్నై: ప్రపంచంలోనే  తొలిసారిగా పురుషుల కోసం ప్రత్యేక ఆస్పత్రిని బుధవారం చెన్నైలో ప్రారంభించనున్నట్లు ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ టి.కామరాజ్ తెలిపారు. చెన్నైలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  డాక్టర్ కామరాజ్ మాట్లాడుతూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషుల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా చెన్నైలోని వడపళని, జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డులో ఈ ఆస్పత్రి ఏర్పాటు చేశామన్నారు.

 పిల్లలకు, మహిళలకు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆస్పత్రులు ఉన్నాయని, పురుషుల కోసం ఇంతవరకు ఎక్కడా లేదన్నారు.  ఇక్కడ పురుషులకు సంబంధించిన అన్ని వ్యాధులకు పరిష్కారం లభిస్తుందన్నారు. పురుషులకు బాధ్యతలు ఎక్కువైనందున వారు ప్రత్యేకంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారని చెప్పారు. అందుచేత పురుషుల్లో అకాల మరణాలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. వారు తరచుగా వైద్య పరీక్షలు జరుపుకోవడం ద్వారా ఆయుర్ధాయాన్ని పెంచుకోవచ్చన్నారు.

×
×
  • Create New...