Jump to content

Vizag Jaffa Yuvatha


Recommended Posts

Posted

మాట(లు) తప్పుతున్న వెన్నుపోటు చంద్రబాబుని నిలదీద్దాం!

మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా డిసెంబర్ అయిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో పాల్గొంటారు. అధికారంలోకి వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత వారిని మోసం చేశారని, పింఛన్ల, రేషన్‌కార్డుల తొలగింపు, ఊరూరా లెసైన్సు పొందిన మద్యం దుకాణాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో టీడీపీ ప్రభుత్వం వంచన పరాకాష్టకు చేరుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఐదు నెలలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది!

Posted

beach kelli sand lopala face petti nirahara deeksha cheyamanu, daridram vadilipodhi

×
×
  • Create New...