Jump to content

Recommended Posts

Posted

  ఆరుగురు భర్తలను వేసేసి... 53 కోట్లు సంపాదించింది      04:36 PM

పెళ్లి చేసుకోవడం, తరువాత భర్తను హతమార్చడం, వారి పేరిట ఉన్న బీమా సొమ్మును వసూలు చేసుకోవడం...ఇంకోడికి స్కెచ్ గీయడం ఇలా ఆరుగుర్ని హతమార్చి సుమారు 53 కోట్ల రూపాయలు వెనుకేసిందో మహిళ. ఇప్పుడు తనకో భర్తను చూడాలని చైనాలోని మ్యారేజీ బ్యూరోల్లో గాలిస్తోంది. వివరాల్లోకి వెళితే... కొన్ని రకాల సాలీళ్లు భాగస్వామితో సంభోగించిన తరువాత మగ భాగస్వామిని చంపేస్తాయి.

ఇలా భర్తలను చంపేసే వారిని సాలీళ్ల పేరిట 'బ్లాక్ విడో'లుగా పిలుస్తారు. చైనాలోని క్యోటోలో నివసించే చిసాకో కకెహి (67) అనే మహిళ, మనువాడిన ఆరుగురు భర్తలను చంపేసింది. వారిలో చివరి వ్యక్తి 2013 డిసెంబర్ నెలలో మృతి చెందాడు. వారంతా మరణించిన అనంతరం వారి పేరిట ఉన్న బీమాను వసూలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఇలా బీమా రూపంలో గత పదేళ్లలో ఆరుగురు భర్తల మృతి కారణంగా ఆమె సుమారు 53 కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఇప్పుడు మరో భాగస్వామి కోసం వెతుకులాట మొదలు పెట్టింది.

తనకు కావాల్సిన వాడు ముసలివాడై ఉండాలి. బాగా డబ్బున్న వ్యక్తై ఉండాలి. ఒక్కడే నివసిస్తూ ఉండాలని కూడా మ్యారేజి బ్యూరోలకు స్పష్టం చేస్తోంది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు క్యోటోలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో వారికి సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. కాగా, ఆమె తన భర్తలను చంపిన విషయాన్ని అంగీకరించకపోవడం విశేషం. కాగా, ఇటీవలే కనే కిజిర్నా అనే మధ్య వయసు మహిళ ముగ్గురు భర్తలను చంపి వాళ్ల ఆస్తులు చేజిక్కించుకుందని వార్తాపత్రికలు వెళ్లడించాయి.

×
×
  • Create New...