Jump to content

Recommended Posts

Posted

పురుషులకు ప్రసవవేదన అనుభవంలోకి తెస్తారట!      04:52 PM

'జంబలకిడిపంబ' సినిమా చూశారా? అందులో, పురుషులు ప్రసవవేదన అనుభవించడం ఆసక్తిగొలుపుతుంది. స్త్రీ నింపాదిగా శిశువుకు జన్మనిస్తే, దాని తాలూకు నొప్పులు భర్త అనుభవిస్తాడు. అయితే, అది సినిమా... ఓ కల్పిత గాథ! ఇప్పుడు అదే తరహాలో తూర్పు చైనాలోని అయిమా మెటర్నిటీ ఆసుపత్రి పురుషులకు ప్రసవవేదన అనుభూతి కల్పిస్తామని చెబుతోంది. అందుకు కారణం ఉందండోయ్. కొత్తగా తల్లయిన కొందరు మహిళలు, ప్రసవానంతరం తమ భర్తలు పెద్దగా సానుభూతి చూపడంలేదని ఫిర్యాదు చేశారట. మొత్తమ్మీద 100 మంది పురుషులు ఈ వినూత్న అనుభవానికి సంతకాలు చేశారు. వారిలో అత్యధికలు కొత్తగా తండ్రి కాబోతున్నవారేనట.

కొంత మంది థ్రిల్ కోసం, మరికొందరు వలంటీర్లు ఈ నొప్పులను రుచిచూసేందుకు సంతకాలు చేశారట. ఉదరం పైభాగంలో ప్యాడ్లు ఉంచి, వాటికి విద్యుత్ ను సరఫరా చేయడం ద్వారా సిమ్యులేషన్లను సృష్టిస్తారు. దీంతో, నొప్పి కలుగుతుంది. పురుషులకు గనుక ఈ నొప్పులు అనుభవంలోకి వస్తే, వారు తమ భార్యలను మరింత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారిన లౌ దెఝూ అనే మహిళ చెబుతోంది.

×
×
  • Create New...