Jump to content

Recommended Posts

Posted

  రూ.900 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు: మంత్రి మాణిక్యాలరావు     05:52 PM

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జులై 14 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు ఫుష్కరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్ల గురించి వెల్లడించారు. పుష్కరాలకు మొత్తం రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అందులో రూ.600 కోట్లు కేంద్రం నుంచి సహాయంగా అందుతాయని వివరించారు.

పుష్కరాల ఏర్పాట్లు డిసెంబర్ నుంచి ప్రారంభిస్తామన్నారు. 256 ఘాట్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు గోదావరి హారతుల కార్యక్రమం ఉంటుందని... రాజమండ్రి, కొవ్వూరులో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తామని మాణిక్యాలరావు పేర్కొన్నారు. అంతేగాక, గోదావరి పరిసరాల్లో 327 దేవాలయాలను ఆధునికీకరిస్తామని చెప్పారు.

Posted

900 crores is too much anipisthondhi. :3D_Smiles_38: :3D_Smiles_38: :3D_Smiles_38:

×
×
  • Create New...