Jump to content

Recommended Posts

Posted

స్వామి ఆశ్రమంలో తుపాకులు, బాంబులే కాదు గర్భనిర్థారణ కిట్లు కూడా దొరికాయి      06:13 PM

స్వామిజీ ఆశ్రమంలో తుపాకులు, బాంబులు దొరకడం నేరం. అంతకంటే పెద్ద నేరమేమిటంటే గృహస్థ జీవితం వదిలేసి సన్యాసం స్వీకరించాక కూడా గర్భనిర్థారణ కిట్లు దొరకడం. హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ అరెస్టు సందర్భంగా అతని ఆశ్రమంపై దాడి చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు దర్శనమిచ్చాయి. ఆశ్రమం, పవిత్రత, భగవంతుడి పేరిటి బాబా రాంపాల్ ఓ చిన్న సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నారు. 1600 బాత్రూంలు, 1100 టాయ్ లెట్లలో సౌకర్యంతో వసతి గృహాలు, ఐదు అంతస్థుల భవనంలో ప్రత్యేకమైన లిఫ్టు సౌకర్యం, బుల్లెట్ ప్రూఫ్ చైర్, ఆయుధ గారం బయటపడింది.

అలాగే రివాల్వర్లు, మిరపకాయ బాంబులతో పాటు గర్భనిర్ధారణ కిట్లు బయటపడ్డాయి. దీంతో ఆశ్రమంలో జరిగేది, జరుగుతోంది ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. బాబా రాంపాల్ వ్యక్తిగత గదిలో కూడా కిట్ ఉండడం విశేషం. రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలం కింద సొరంగం లాంటి గది ఉంది. ఆ గదిలో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్గన్లు, రెండు .12 బోర్ రైఫిళ్లు, రెండు .315 బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు, భారీ మొత్తంలో ఇతర ఆయుధాలు, మందు గుండు సామగ్రి కూడా లభ్యమైందని వారు తెలిపారు.

ఆ గదిలోని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా స్వామి కుర్చీమీద అకస్మాత్తుగా భక్తులకు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు. బాబా రాంపాల్ అరెస్టు అనంతరం ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, జైల్ లో ఉన్న బాబా రాంపాల్ ఎవరితోనూ మాట్లాడటంలేదని జైలు సిబ్బంది చెబుతున్నారు.

×
×
  • Create New...