Jump to content

Court orders balayya to attend court on 22nd


Recommended Posts

Posted

హైదరాబాద్: సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణపై కడప జిల్లా కోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆయనను కోర్టు ఆదేశించింది. కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై బాలయ్యపైన, మరో ఐదుగురిపైన కేసు నమోదైంది.

ఆ కోడ్ ఉల్లంఘన కేసులో బాలయ్యతో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదు. ముందస్తు బెయిల్ ఉందనే సాకుతో వారు కోర్టుకు హాజరు కావడాన్ని దాటవేస్తూ వస్తున్నారు. దీంతో కోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22వ తేదీన హాజరు కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు బాలయ్యను హెచ్చరించింది. ఈ కేసు నమోదైనవారిలో తెలుగుదేశం నాయకులు సతీష్ రెడ్డి, పాలెం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

×
×
  • Create New...