Jump to content

Recommended Posts

Posted

 

 

seemandhra-development.gifరైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అందుకు కేంద్రం నుంచి సహకారం పొందాలని ఎంతో ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి ఆ దిశగా సానుకూలత కనిపించింది… మోడీ, ఆర్థిక మంత్రి జైట్టీ… రాష్ట్రానికి చెందిన జాతీయ నేత, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగల సమర్థుడు అయిన వెంకయ్య నాయుడు కూడా కేంద్రం అండ ఉంటుందనే చెబుతూ వచ్చారు. కానీ, పరిస్థితులు చూస్తుంటే ఆ సహాయం ఇప్పట్లో అందే సూచనలు కనిపించడం లేదు. దాంతో ఏపీలోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తన ఏర్పాట్లు తాను చేసుకుంటోంది.
కేంద్రం నుంచి సహకారం అందదు అని ఏకంగా కొట్టిపడేయలేకపోయినా ఇప్పట్లో అందదు… ఇంకా ఆలస్యమవుతుంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు ఊతమిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో 20 శాతాన్ని ఇప్పుడు కోత పెట్టింది. గురువారం ఆర్దిక శాఖ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చాయి. అయిదో వంతు నిధులకు కోత పెట్టడానికి గల కారణాలను మాత్రం అందులో ఎక్కడా చెప్పలేదు. సాధారణంగా ఆర్థిక సంవత్సంర చివర్లో ఇలాంటి చర్యలుంటాయి.. కానీ, ఏపీ ప్రభుత్వం థర్డ్ క్వార్టర్ మధ్యలోనే కత్తెరకు పని చెప్పిందంటే అందుకు పెద్ద కారణమే కనిపిస్తోంది. రుణ మాఫీకి నిధులు సర్దుబాటు చేసేందుకే ఈ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది.
రైతుల రుణ విముక్తి కోసం ఏర్పాటు చేసిన సాధికార సంస్థలో జమ చేసిన రూ. 5 వేల కోట్లు…. ఎర్రచందనం ఆదాయం… ఇప్పుడు శాఖల బడ్జెట్ లోంచి మళ్లించబోతున్న అయిదో వంతు వాటా నిధులు అన్నీ కలిపితే రుణ మాఫీ భారం నుంచి ప్రభుత్వం బయటపడొచ్చని అంటున్నారు.  ముందు హామీ నెరవేర్చి.. ఆ తరువాత కేంద్రం నుంచో, రిజర్వు బ్యాంకు నుంచో కొంత సహకారం అందుకుని ఈ లోటును భర్తీ చేసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నమెంటు తాజా చర్యలతో ఇప్పటికైతే రుణ మాఫీ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నట్లే.
Posted

namesthe andhra ???

 

clone of namesthe telangana???

 

temp-320-42995141.gif?1347279483

Posted

namesthe andhra ???

 

clone of namesthe telangana???

 

temp-320-42995141.gif?1347279483

 

Yes. [url=http://www.desigifs.com/gifs/1067/brahmanandam]brahmam_buildup5.gif[/url]
 

Posted

Lol

 

[url=http://www.desigifs.com/gifs/2441/brahmanandam]GSB3.gif[/url]

Posted

lol

Modi and CBN aa?

Nayak130.gif?1368659864

 

lol..

 

modi evaru cbn evaru???

Posted

maa plan kaadu maa ppt maaku undhi anali

GSB3.gif

Posted

maa plan kaadu maa ppt maaku undhi anali

TOLLYGIFS_pkc11.gif?1379565102  konni roojulu break ivvandi..baa PPT's tattukoleka pothunnam

×
×
  • Create New...