Jump to content

Recommended Posts

Posted
 
ఇకపై ఆన్ లైన్ లోనే విద్యుత్ పంపిణీ పరిశీలన: ఏపీ ట్రాన్స్ కో సీఎండీ     07:04 PM
విద్యుత్ పంపిణీ, సరఫరాలో తలెత్తే లోటుపాట్లను ఆన్ లైన్ లోనే పర్యవేక్షించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా చేపట్టిన కసరత్తు పూర్తి అయ్యిందని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ వెల్లడించారు. తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 75 పట్టణాల పరిధిలోని 50 వేల ట్రాన్స్ ఫార్మర్ల పరిధిలో జరుగుతున్న విద్యుత్ సరఫరాను పరిశీలించనున్నట్లు శనివారం జరిగిన విద్యుత్ పంపిణీ సమీక్షా సమావేశం సందర్భంగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.

 

×
×
  • Create New...