Jump to content

Copied From Gaja Kesari Page.


Recommended Posts

Posted

తూటాలు -ఆత్మ-ఉద్యోగం:
ఏమీ తెల్వని పోరగాన్ని, ఓయు కు వచ్చిన.....!!!
కొడకా మంచిగా సదువుకో, ఉద్యోగం రావాలే అని మాఅమ్మ చెవి కమ్మలమ్మి 4 వేలు జేబుల పెట్టింది..

అప్పటి వరకు నే సదివిన పుస్తకాలు,బట్టల సంచి తో ఓయుల దిగిన!!
కొత్త కొత్త గా, అంతా బాగుంది, కొత్త దోస్తులందరూ ..నా లాగ ఊళ్లకెల్లి వచ్చినోల్లె!!!
రెండో రోజు కాలేజీ కు వెళ్ళా...!! బంద్ బోర్డు పెట్టిన్రు..!!
తీరా ఆరా తీసే దాక తెల్వదు.. తెలంగాణా బంద్ అని.....
నిజంగా నిజం చెబుతున్న అప్పటి వరకు తెలంగాణా గొడవ నాకు తెల్వదు!!!
తెల్సుకోవాలని లైబ్రరీ మెట్లెక్కా ..... ఉద్యమానికి సంబంధించిన బుక్స్ అన్నీ తిరిగేసా!!!
నర నరాన ఉక్రోషం...!!! గింత అవమానం జరిగిందా అని లోలోపల కోపం...
పలితం వచ్చే దాక పోరాటం జరగాలి అని కోరుకున్న......
రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయ్ అన్న...మా సీనియర్ అన్న మాటలు విని రాళ్ళు పట్టుకున్నాం!!!
నినాదాలు చేసాం, భాష్ప వాయు గోలాల పొగను పీల్చాం...!!!
పోలీస్ లు వదిలిన షెల్ల్స్ డొక్కల తగిల్నయ్...!!! మరో సారి ఉల్లిగడ్డలు తెచ్చుకొని మరీ టియర్ గ్యాస్ కు ఎదురుగా నిలబడ్డం.. ఎందుకంటే మా పోరాటం లో నిబద్దత ఉందని.!!!
అరెస్టులు చేసారు, హాస్టల్లోకి వచ్చి కొట్టారు... భరించాం... నినదిన్చాం..!!
మా దోస్త్ తమ్ముడు ,ఆర్ట్స్ కాలేజీ ముందు ..చెట్టుకు.... ఉరేసుకున్నప్పుడు..మా చేతులతో శవాన్ని దించాం!!! వాడు రాసిన లెటర్ చదివి ఏడుస్తూనే జై తెలంగాణా అన్నాం...!!!!
అరేయ్ నా తమ్ముడు రా... అని ఏడుస్తూ అడిగిన మా దోస్త్ కు....సమాధానం చెప్పలేక సగం చచ్చాం...!!
వీరుల్లారా.. వీర వనితల్లారా అంటూ పాడుకుంటూ గుర్తుచేసుకున్నాం....!!
రబ్బరు బుల్లెట్లు, ముళ్ళ కంచెల మద్య మా పరీక్షలు ముగిసాయ్..
కాలం గిర్రున తిరిగింది .... సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది .... తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది...
జూన్ 2, ఆర్ట్స్ కాలేజీ వెలుగుల్లో అసైదూల ఆడుతున్న మా దోస్త్ తమ్ముడి ఆత్మను పలకరించాం!!
వాడి చివరి లెటర్ ను మరో సారి గట్టిగా చదివినం.. కాళ్ళ నుండి ధారలు కారుతున్నాయ్...
అక్షరాల్లో వాడి మోమును చూసి...!!!
కొత్త రాష్ట్ర సంబరాలు...ఆ ఆనంద క్షణాలు అలాగే సాగాయ్!!!
కొత్త రాష్ట్రం !!కొత్త ప్రభుత్వం !!! అది కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పార్టీ చేతిలో అధికారం !!
కమ్మలమ్మిన అమ్మ కళ్ళలో ఆనందం... అరేయ్ తెలంగాణా వచ్చిందంట ఉద్యోగం వచ్చినట్టేనా??అని
వచ్చినట్టే.... వచ్చినట్టే అని చెపుతూ ...చెపుతూ నెట్టుకొస్తున్నం....???
ఉద్యోగం సంగతి పక్కన పెడితే.. నోటిఫికేషన్ కు దిక్కు లేదు...
మన నుండి విడిపోయిన వాళ్ళు.. ఖాళీల లెక్క లేసి మరీ ఉద్యోగ ప్రకటన చేసారు....
మనోల్లేమో... ఓయు పిల్లలని అవహేళన చేస్తూ... ఐఏఎస్ ల కొరత ఉందని చెబుతూ
మా చెవిలో పువ్వు పెడుతున్నారు...!!!
కొత్త రాష్ట్రం మా బాగు కొరకే కదా???
మీరు సియం అయిర్రు, మంత్రులయ్యిర్రు,ఎంఎల్యేలయిర్రు!!!!
మా దోస్త్ తమ్ముడి పెద్ద దినం అయిపోయింది ,మా అమ్మ కమ్మలు తాకట్టు కొట్టోని సొంతమయ్యాయ్!!

Posted

Inko animutyam:

 

Ravi Lenkala TRS party has to be started in AP. and vishnu gaaru will win as MLA. he expressed openion of AP peoples...let the people of AP see the admin of both stated i am sure revelution start ahainst AP - TDP...

Posted

deeni gurinchi vinnappudu antha naaku maa oorlo jaathara kosam oori meedaki odilesina barre gurthostadi.

 

1yr full ga oorlo andaroo mepi jaathara roju bali ichestaru. deeniki kuda edo oka roju ostadi. 

Posted

deeni gurinchi vinnappudu antha naaku maa oorlo jaathara kosam oori meedaki odilesina barre gurthostadi.

1yr full ga oorlo andaroo mepi jaathara roju bali ichestaru. deeniki kuda edo oka roju ostadi.


Haha...suttaniki kuda ade size la vuntadi kada man...etu more than 1 yr aindi bali icheyandi
Posted

vaadu ipaatiki block ayipoyi undaaley vaadini TG drohi ani andharu thidatha undaaley brahmi16.gif?1369595063

Posted

She is an attention seeking **

 

yeah..chala desperate ga undi. Rooju social media lo evaru taluchukunnaro chooskoni murisipothundi anukunta..

×
×
  • Create New...