Jump to content

Recommended Posts

Posted

  హ్యూస్ అంత్యక్రియలు నేడే... శవపేటికను మోయనున్న కెప్టెన్ క్లార్క్     08:25 AM

మ్యాచ్ ఆడుతూ గాయపడి, దుర్మరణం పాలైన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. హ్యూస్ స్వస్థలం మాక్స్ విల్లేలో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. తన స్నేహితుడి అంత్యక్రియల్లో భాగంగా, శవపేటికను ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మోయనున్నాడు. అతనితో పాటు మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ కూడా శవపేటికను మోయబోతున్నాడు.

ఈ అంత్యక్రియలకు భారత్ తరపున రవిశాస్త్రి, విరాట్ కోహ్లి హాజరవుతున్నారు. వీరితో పాటు బ్రియాన్ లారా, రిచర్డ్ హాడ్లీ, మార్క్ టేలర్, షేన్ వార్న్, మైక్ హస్సి, బ్రెట్ లీ, రికీ పాంటింగ్, మెక్ గ్రాత్, ఆడం గిల్ క్రిస్ట్ తదితర క్రికెట్ దిగ్గజాలు హాజరవుతున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

legends

×
×
  • Create New...