Jump to content

L O L.. Naidu Bavalu


Recommended Posts

Posted

  -:: జస్ట్ సరదాగా నవ్వుకోవడానికి ::- 

ఇద్దరు "నాయుడు బావలు", హైవే లో కాకా హోటల్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు..!!

>> చిత్తూరు బావ : అవును బావా, నేనే గనక లేకపోయి ఉంటే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమయ్యోదో కదా ? అసలు ఊహించడానికే భయంగా ఉంది..
>> నెల్లూరు బావ : అవును బావా, నేను కూడా అదే ఆలోచిస్తున్నా, నేను గనక లేకపోయి ఉంటే, ఈ దేశ ప్రజల పరిస్థితి ఏమయ్యోదో కదా ? అసలు ఊహించడానికే భయంగా ఉంది.
>> చిత్తూరు బావ : అవును బావా, ఇక్కడ తిరుమల కొండల్ని నేనే కట్టించా. లేకపోయి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత కష్టమయ్యేదో కదా ?
>> నెల్లూరు బావ : అవును బావా, అక్కడ హిమాలయ పర్వతాలను కూడా నేనే కట్టించా. లేకపోయి ఉంటే ఆ పరమేశ్వరుడికి ఎంత కష్టమయ్యేదో కదా ?
>>చిత్తూరు బావ : అవును బావో, ఏదో మనమున్నాం కాబట్టి ఈలోకం ఇంతమాత్రం నడుస్తోంది బావా, లేకపోతేనా.!!
>> నెల్లూరు బావ : అందుకే బావా నేనన్నది నాయకులంటే మనమే అని..

***** ఇలా పిచ్చాపాటీ మాట్లాడుకొంటుండగా, హోటల్ అబ్బాయి వచ్చి, సార్ "ఆర్డర్ చెప్పండి" అన్నాడు..!! *****

>> చిత్తూరు బావ : ఏం తమ్ముడూ, పిచ్చపిచ్చగా ఉందా ??? నేను ఎక్కడ పడితే అక్కడ తినను. నేను చాలా స్ట్రిక్ట్. నాకో క్లియర్ విజన్ ఉంది. నేనెప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు చాలా అనుభవం ఉంది. నాముందు నువ్వు చాలా చిన్నవాడివి. నేను టెక్నాలజీతో పని చేస్తా...!!
>> నెల్లూరు బావ : మధ్యలో కలగజేసుకొని, ఊరుకోబావా, మన విజన్, టెక్నలజీ, స్మార్ట్ సిటి ఇలాంటివన్నీ ఈ ఎర్రోళ్ళకేం తెలుస్తాయ్ ? అందరూ మనలా తెలివయిన వాళ్ళా ఏమిటి ?? అంటూ, ఇదిగో బాబూ, నీకేది ఇవ్వాలనిపిస్తే అది మాకు సర్వ్ చేసి, బిల్లును మా పార్టీ ఆఫీసు కి పంపు.

***** కాసేపటికి ఆ హోటల్ కుర్రాడు వచ్చి, ఓ పెద్ద ప్లేట్ నిండా పువ్వులు తెచ్చి నాయుడు బావల ముందు ఉంచాడు *****

>> నెల్లూరు బావ : ఇదిగో అబ్బాయ్, ఏమిటిది ?? పువ్వులు తెచ్చావెందుకు ??
>> హోటల్ కుర్రాడు : మీకే సార్.. చాలా అవసరమవుతాయ్.. జనాల చెవుల్లో పెట్టడానికి.. తీసుకెళ్ళండి.. అన్నీ ఫ్రీయే.. నాకేం డబ్బులొద్దులెండి.. అర్హులయిన వాళ్లకి బిల్లు మాఫీ పథకం పెట్టాం సార్..!!
>> చిత్తూరు బావ : బావా, వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. మన విజన్ అర్థం కావడం లేదు..
>> నెల్లూరు బావ : అవును బావా, ఈజనాలు అంతే, లేకపోతే మనకు ఓట్లేసి ఎందుకు గెలిపిస్తారూ ???

 

Posted

తూటాలు -ఆత్మ-ఉద్యోగం:

 

ఏమీ తెల్వని పోరగాన్ని, ఓయు కు వచ్చిన.....!!!
కొడకా మంచిగా సదువుకో, ఉద్యోగం రావాలే అని మాఅమ్మ చెవి కమ్మలమ్మి 4 వేలు జేబుల పెట్టింది..

అప్పటి వరకు నే సదివిన పుస్తకాలు,బట్టల సంచి తో ఓయుల దిగిన!!
కొత్త కొత్త గా, అంతా బాగుంది, కొత్త దోస్తులందరూ ..నా లాగ ఊళ్లకెల్లి వచ్చినోల్లె!!!
రెండో రోజు కాలేజీ కు వెళ్ళా...!! బంద్ బోర్డు పెట్టిన్రు..!!
తీరా ఆరా తీసే దాక తెల్వదు.. తెలంగాణా బంద్ అని.....
నిజంగా నిజం చెబుతున్న అప్పటి వరకు తెలంగాణా గొడవ నాకు తెల్వదు!!!
తెల్సుకోవాలని లైబ్రరీ మెట్లెక్కా ..... ఉద్యమానికి సంబంధించిన బుక్స్ అన్నీ తిరిగేసా!!!
నర నరాన ఉక్రోషం...!!! గింత అవమానం జరిగిందా అని లోలోపల కోపం...
పలితం వచ్చే దాక పోరాటం జరగాలి అని కోరుకున్న......
రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయ్ అన్న...మా సీనియర్ అన్న మాటలు విని రాళ్ళు పట్టుకున్నాం!!!
నినాదాలు చేసాం, భాష్ప వాయు గోలాల పొగను పీల్చాం...!!!
పోలీస్ లు వదిలిన షెల్ల్స్ డొక్కల తగిల్నయ్...!!! మరో సారి ఉల్లిగడ్డలు తెచ్చుకొని మరీ టియర్ గ్యాస్ కు ఎదురుగా నిలబడ్డం.. ఎందుకంటే మా పోరాటం లో నిబద్దత ఉందని.!!!
అరెస్టులు చేసారు, హాస్టల్లోకి వచ్చి కొట్టారు... భరించాం... నినదిన్చాం..!!
మా దోస్త్ తమ్ముడు ,ఆర్ట్స్ కాలేజీ ముందు ..చెట్టుకు.... ఉరేసుకున్నప్పుడు..మా చేతులతో శవాన్ని దించాం!!! వాడు రాసిన లెటర్ చదివి ఏడుస్తూనే జై తెలంగాణా అన్నాం...!!!!
అరేయ్ నా తమ్ముడు రా... అని ఏడుస్తూ అడిగిన మా దోస్త్ కు....సమాధానం చెప్పలేక సగం చచ్చాం...!!
వీరుల్లారా.. వీర వనితల్లారా అంటూ పాడుకుంటూ గుర్తుచేసుకున్నాం....!!
రబ్బరు బుల్లెట్లు, ముళ్ళ కంచెల మద్య మా పరీక్షలు ముగిసాయ్..
కాలం గిర్రున తిరిగింది .... సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది .... తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది...
జూన్ 2, ఆర్ట్స్ కాలేజీ వెలుగుల్లో అసైదూల ఆడుతున్న మా దోస్త్ తమ్ముడి ఆత్మను పలకరించాం!!
వాడి చివరి లెటర్ ను మరో సారి గట్టిగా చదివినం.. కాళ్ళ నుండి ధారలు కారుతున్నాయ్...
అక్షరాల్లో వాడి మోమును చూసి...!!!
కొత్త రాష్ట్ర సంబరాలు...ఆ ఆనంద క్షణాలు అలాగే సాగాయ్!!!
కొత్త రాష్ట్రం !!కొత్త ప్రభుత్వం !!! అది కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పార్టీ చేతిలో అధికారం !!
కమ్మలమ్మిన అమ్మ కళ్ళలో ఆనందం... అరేయ్ తెలంగాణా వచ్చిందంట ఉద్యోగం వచ్చినట్టేనా??అని
వచ్చినట్టే.... వచ్చినట్టే అని చెపుతూ ...చెపుతూ నెట్టుకొస్తున్నం....???
ఉద్యోగం సంగతి పక్కన పెడితే.. నోటిఫికేషన్ కు దిక్కు లేదు...
మన నుండి విడిపోయిన వాళ్ళు.. ఖాళీల లెక్క లేసి మరీ ఉద్యోగ ప్రకటన చేసారు....
మనోల్లేమో... ఓయు పిల్లలని అవహేళన చేస్తూ... ఐఏఎస్ ల కొరత ఉందని చెబుతూ
మా చెవిలో పువ్వు పెడుతున్నారు...!!!
కొత్త రాష్ట్రం మా బాగు కొరకే కదా???
మీరు సియం అయిర్రు, మంత్రులయ్యిర్రు,ఎంఎల్యేలయిర్రు!!!!
మా దోస్త్ తమ్ముడి పెద్ద దినం అయిపోయింది ,మా అమ్మ కమ్మలు తాకట్టు కొట్టోని సొంతమయ్యాయ్!!

 

paina joke endi nuvvesina ee raathalendi...aa gajanni felli cheskoni life iyyochu ga prate theddu lo aa langa ette gifs eyyakapote...
 

Posted

 

gsdshd-o.gif

 

 

nuvve etti nuvve ongoni chusings aa nee enki...

×
×
  • Create New...