citizenofIND Posted December 4, 2014 Report Posted December 4, 2014 https://www.youtube.com/watch?v=T8H13kF1Xoc ordinee eshaloo
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 pk ne propose chesindhu antha
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 pelli ayyaka life 10gippoyyindhi antha
citizenofIND Posted December 4, 2014 Author Report Posted December 4, 2014 weird divorce reason antha like movie
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 అవును కళ్యాణ్ నన్ను అలానే పిలుస్తారు: రేణూదేశాయ్ 07:33 PM తనకు పవన్ కళ్యాణ్ తో పరిచయమయ్యేప్పటికి కేవలం 19 ఏళ్లేనని, ప్రపంచం ఎలా ఉంటుందో కూడా సరిగా తెలియని వయసని రేణూదేశాయ్ తెలిపింది. అందుకే పవన్ కళ్యాణ్ తనను 'సుబ్బమ్మ' అని పిలిచేవారని రేణూదేశాయ్ వెల్లడించింది. అది కాల క్రమంలో 'సుబ్స్' అయిందని, ఇప్పుడది నెమ్మదిగా 'సు' అయిందని రేణూ తెలిపింది. కళ్యాణ్ రేణూ అని పిలుస్తూ ఉంటే కూడా పట్టించుకోకుండా ఏదో పనిలో నిమగ్నమైపోయేదాన్నని, 'సు' అని పిలవగానే ఏంటీ? అంటూ ఈ లోకంలోకి వచ్చేదాన్నని రేణూతెలిపింది. మారిషష్ లో ఎవరో 'సు' అని పిలిస్తే, తననే అనుకునే భ్రమలో ఒక్కసారి అవాక్కైపోయానని, తరువాత ఎవరో ఎవర్నో పిలుస్తున్నారని తెలుసుకుని కుదటపడ్డానని తెలిపింది.
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 కల్యాణ్, నేనూ ఒకే మాటమీద ఉంటాం...నాపైన కల్యాణ్ కి ఎన్ని కంప్లైంట్లో: రేణూదేశాయ్ 07:24 PM పిల్లల్ని పెంచడంలో పవన్ కల్యాణ్, తాను ఒకే మాటమీద ఉంటామని రేణూదేశాయ్ చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా వ్యక్తిగత జీవితంలో పలు కోణాల్ని ఆవిష్కరించిన రేణూ తమ పిల్లల్ని సాధారణంగా పెంచాలని నిర్ణయించామని తెలిపింది. పూణేలో చదువుతున్న అకీరా, ఆద్యను స్టార్ పిల్లలుగా కాకుండా మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పింది. తనపై తమ కుమార్తె ఆద్య ఎన్నో కంప్లైంట్లు కల్యాణ్ కి ఇస్తుందని రేణూ చెప్పింది. తనకి వాచ్ కావాలనుందని, అమ్మ కొనవ్వడం లేదని, ఇలా ఏదో ఒకటి వాళ్ల నాన్నకు చెబుతూనే ఉంటుందని రేణూ చెప్పింది. కళ్యాణ్ కూడా ఎందుకు నాన్నా అంటూ ఆద్యకు అర్థమయ్యేలా చెప్పి, వద్దని ఒప్పిస్తారు. అమ్మ చెప్పిందే కరెక్ట్ అని చెబుతారు. పిల్లల్ని పెంచడం విషయంలో తామిద్దరిదీ ఒకే మాటని రేణూదేశాయ్ వివరించింది.
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 ఇప్పటి వరకు నా పుట్టిన రోజు గిఫ్టుల్లో అత్యంత విలువైనది అదే: రేణూదేశాయ్ 07:14 PM తనకు పుట్టిన రోజు ఆడంబరంగా జరుపుకోవడం పెద్దగా ఇష్టం ఉండదని పవన్ కళ్యాన్ మాజీ భార్య, నటి, నిర్మాత రేణూదేశాయ్ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు వచ్చిన పుట్టిన రోజు బహుమతుల్లో ఏది విలువైనది అని అడిగిన ప్రశ్నకు ఆమె తన కుమారుడు అకీరా నందన్ ఇచ్చిన గిఫ్టే విలువైనదని తెలిపారు. నాలుగేళ్ల వయసులో అకీరా అప్పుడే నేర్చుకుంటున్న అక్షరాలతో క్రేయాన్స్ తో ఐ లవ్యూ మమ్మీ అని ఓ గ్రీటింగ్ కార్డు రాసి, గార్డెన్ లోకి వెళ్లి కొన్ని పూలు కోసుకొచ్చి హ్యాపీ బర్త్ డే చెప్పాడు. అదే అత్యంత విలువైన బర్త్ డే గిఫ్ట్ అని రేణూదేశాయ్ తన్మయంగా చెప్పుకొచ్చింది. ఆక్షణం కన్నీళ్లు వచ్చాయని, ఆనందంతో ఏడ్చానని చెప్పింది.
chandra916 Posted December 4, 2014 Report Posted December 4, 2014 divorced aa leka still PK thone vuntundha ??
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 మా ఇద్దరిలో ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారో చెప్పుకోండి చూద్దాం: రేణూదేశాయ్ 07:43 PM మా ప్రేమ కథ చాలా అందమైనదని రేణూదేశాయ్ చెప్పింది. తనకు 18 ఏళ్ల వయసప్పుడు తొలి సారి 'బద్రి' సినిమా షూటింగ్ కోసం హైదరాబాదు వచ్చానని, తరువాత పవన్ కళ్యాణ్ ను తొలి చూపులోనే ప్రేమించానని రేణూ తెలిపింది. అయితే తమ ఇద్దరిలో ప్రపోజ్ చేసింది మాత్రం కళ్యాణేనని వెల్లడించింది. 19 ఏళ్ల వయసులో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనే పెళ్లి చేసుకున్నామని రేణూ స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం చాలా అందంగా గడిచిందని తెలిపింది. పెళ్లి అంటే ప్రతిరోజూ అడ్వెంచర్ లా గడవాలని అభిప్రాయపడింది. అంతే కానీ రోజూ చూసే మొగుడే కదా అనేలా ఉండకూడదని రేణూ తెలిపింది. అలా అయితే జీవితం నిస్సారమైపోతుందని రేణూ వివరించింది. తన ప్రేమ, పెళ్లి అన్నీ ఫెయిరీ టేల్ లా జరిగాయని రేణూ దేశాయ్ చెప్పింది.
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 కళ్యాణ్ నుంచి నేను 40 కోట్లు తీసుకున్నానన్నది అబద్దం: రేణూదేశాయ్ 07:52 PM పవన్ కళ్యాణ్ నుంచి విడాకుల కోసం 40 కోట్ల రూపాయలు తీసుకున్నానన్నది పచ్చి అబద్దమని రేణూదేశాయ్ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరించారు. తనను ఈ విషయంలో చాలా మంది ఆడిపోసుకున్నారని, అందరికీ వాస్తవం తెలుసుకునే రోజు వస్తుందని తాను భావించానని రేణూ తెలిపింది. అప్పట్లో దీనిని క్లియర్ చేయండంటూ పలువురు సన్నిహితులు సూచించినప్పటికీ తాను ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అని భావించి మౌనంగా ఉన్నానని రేణూ తెలిపింది. అలాగే డబ్బు సంపాదన విషయంలో కళ్యాణ్ ను ఆపుతున్నాననే అపోహ ఉంది. అయితే, తాను పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి విషయానికి వెంటఉన్నానని తెలిపింది. తాను పవన్ ఏదంటే అదే చేశానని రేణూదేశాయ్ వివరించింది.
timmy Posted December 4, 2014 Report Posted December 4, 2014 ఎంతో మంది అభిమానులు నన్ను వెనక్కి వెళ్లిపొమ్మంటున్నారు...కానీ ఎలా?: రేణూదేశాయ్ 08:15 PM ఎంతో మంది అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా మీరు మళ్లీ వెనక్కి వెళ్లిపోమ్మంటున్నారని రేణూదేశాయ్ తెలిపింది. తన వైవిహిక జీవితాన్ని ఎవరూ నిర్ణయించలేరని, తాను వెళ్లినా ఏమని వెళ్లగలనని ప్రశ్నించింది. ఇది తనకు చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రశ్న అని రేణూ చెప్పింది. తనకు మాత్రమే వెళ్లాలని ఉంటే సరిపోదు కదా? అని ఆమె ప్రశ్నించింది. అంతే కాకుండా వారికి కూడా వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి కదా? అని చెప్పింది. తనది గడచిపోయిన అధ్యాయమని రేణూదేశాయ్ వివరించింది. తాను వాస్తవం నుంచి జీవితాన్ని నేర్చుకుంటున్నానని రేణూదేశాయ్ వెల్లడించింది.
Recommended Posts