Jump to content

Recommended Posts

Posted

1231675_553452364731243_1953615711_n.png

 

 

బృహదీశ్వర ఆలయం లేక పెరువడయార్ కోవెల అనబడే ఈ శివుని ఆలయం తమిళ్ నాడులోని తంజావూరులొ ఉంది. ఈ ఆలయన్ని రాజ రాజ చోళ-1 1010ADలో కట్టించాడు. 

మొత్తం ఆలయాన్ని నిర్మించడానికి కేవలం గ్రానైటుని(Granite) మాత్రమే ఉపయోగించారు. బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 13,000 టన్నుల గ్రానైటుని ఉపయోగించారని చెప్తారు. 

ఆలయ స్తూపం యొక్క పొడవు 216 అడుగులు. ఇటువంటి కట్టడాలలో ప్రపంచంలో కల్లా ఇదే ఎత్తైనది.

ఆలయంలోకి అడుగుపెట్టగానే 16 అడుగులు పొడవు, 13 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని కేవలం ఒక్క రాయితోనే చెక్కారు. 

60 టన్నుల గ్రానైటు రాయితో కుంబం అనే కట్టడాన్ని చెక్కారు.

ఆలయంలోకి ప్రవేశించడానికి గోపురాలు అనబడే రెండు ప్రవేశ మార్గాలు తూర్పువైపున ఉంటాయి. 

ఆలయం బయట వందల కొద్ది శిల్పాలు ఉంటాయి. ఆలయం లోపల మాత్రం మూడు నేత్రాలు కలిగిన పెద్ద శివుని విగ్రహం ఉంటుంది. ఆలయ ఆవరణం మొత్తంలో దాదాపు 250 శివలింగాలు ఉంటాయి. 

ఆలయంలోపలి గర్భగుడి గోడలపైన శివుడు నాట్యమాడిన 108 భంగిమల యొక్క శిల్పాలు చెక్కబడి ఉంటాయి. 

ఆలయంలో స్తూపాల మండపం మరియు ఇతర మండపాలు ఉంటాయి. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 

బృహదీశ్వర ఆలయంలో అష్టదిక్పాలకుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇదే ఆ ఆలయ ప్రత్యేకత. 6 అడుగుల ఎత్తు కలిగిన వరుణ, అగ్ని, ఇంద్ర, వాయు, యమ, నిసానా, నిరిత్తి విగ్రహాలు వేరే ఆలయంలో ఉంటాయి. 

స్తూపం యొక్క నీడ ఆలయ నేలపై ముఖ్యం ఆలయం ఆవరణలో ఎప్పుడూ పడదని చెప్తారు. 

Posted

Indian temples are more marvellous than egyptians pyramidsAnushkaSharma.jpg P E R I O D

Posted

mari inka pics veyyalera

mainly Nandhi and other kumbam60 టన్నుల గ్రానైటు రాయితో కుంబం అనే కట్టడాన్ని చెక్కారు

 

 

Also is it possible for you to post 3 netra pic

 

I think nowadays so many ppl from AP and TG are studying there. Evarnina adigi pics veyinchandi

×
×
  • Create New...