Jump to content

Recommended Posts

Posted
1208772_676517479043959_306458845_n.jpg?
 
మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయాల్లో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం కటాసరాజ ఆలయం. పాకిస్తాన్ లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల్లో కటాస్ రాజ్ ఆలయ... See More
పాకిస్తాన్‌లో చారిత్రక హిందూ ఆలయం... కటసరాజ దేవాలయం:-

మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయాల్లో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం కటాసరాజ ఆలయం. పాకిస్తాన్ లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల్లో కటాస్ రాజ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఎంతో విశాలంగా, అద్భుతంగా ఉంటుంది. అయినా ఈ ఆలయాన్ని పట్టించుకునే నాథుడే లేడు.పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఈ ఆలయం చక్వాల్‌ జిల్లాలోని కటాస్‌ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. 

దక్ష యజ్ఞసమయంలో, సతీదేవి ప్రయో ప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రా లాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్‌ తీర్థం గానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్‌)లోని పుష్కర రాజ్‌ తీర్థంగానూ మారాయి. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తాను అగ్నిని మధించే ఆరణిని ఒక చెట్టు కొమ్మలో దాచా ననీ, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కుకొని పోయినదని దానిని తెచ్చి ఇవ్వవల సినదిగా కోరగా ధర్మరాజు నలుగురు తమ్ము లతో లేడిని పట్టుకోవడానికి బయలుదేరుతా రు. కొంతసేపటికి ఆ లేడి మాయమవుతుంది. 

వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపగా... అతను ఎంత కూ రాకపోవడంతో సహదేవుని పంపుతారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరారు. చివరకు ధర్మరాజు బయలుదేరి మంచినీటి కొలను ప్రక్కనే పడివున్న నలుగు రు తమ్ములను చూసి దుఃఖంతో భీతిల్లుతా డు. అంతలో అదృష్యవాణి ఇలా పలుకుతుం ది. ‘‘ధర్మనందనా నేను యక్షుడను. ఈ సర స్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభా వంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో’’ అన్నా డు యక్షుడు. దానికి సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పు కుంటూ ఉంటారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్‌ వద్దనే జరిగింది.

చరిత్ర...

ఇక్కడ 100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశ్యం. కటా సక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాల యంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదే శీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండే వారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. 1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబ్‌కు వెళ్లిపోయారు.

 

Posted

mari sahasam movie lo chupinche tmple dhi kaadha ??

Posted

mari sahasam movie lo chupinche tmple dhi kaadha ??

 

adi hinglaaj matha temple..adi kuda pakistan lone undi

×
×
  • Create New...