timmy Posted December 9, 2014 Report Posted December 9, 2014 పవన్ కల్యాణ్ బాటలో బాలకృష్ణ 02:05 PM ఖమ్మం పట్టణంలో ట్యూమర్ తో బాధపడుతున్న శ్రీజ అనే బాలికను హీరో పవన్ కల్యాణ్ పరామర్శించడం తెలిసిందే. తనకు పవన్ కల్యాణ్ ను చూడాలనుందని శ్రీజ పేర్కొనగా, మెగా హీరో వెంటనే స్పందించాడు. ఖమ్మం వెళ్లి ఆ చిన్నారితో కొంతసేపు గడిపాడు. ఆమెకు కానుకలు కూడా ఇచ్చాడు. ఇప్పుడా చిన్నారి కోలుకుని డిశ్చార్జి అయింది. అదే తరహాలో, నందమూరి బాలకృష్ణ కూడా శ్రావణి (12) అనే బాలికను సంతోషపెట్టాడు. నరసరావుపేటకు చెందిన ఈ బాలిక క్యాన్సర్ తో బాధపడుతోంది. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవలే కోమా నుండి బయటికి వచ్చిందట. తనకు బాలకృష్ణను చూడాలని ఉందని తల్లిదండ్రులతో పేర్కొంది. ఈ విషయం బాలయ్యకు చేరడంతో ఆయన సానుకూలంగా స్పందించాడు. బాలికను పరామర్శించి, సంతోషంలో ముంచెత్తాడు. ప్రస్తుతం శ్రావణి కోలుకుంటోందని డాక్టర్లు చెప్పారు.
Tadika Posted December 9, 2014 Report Posted December 9, 2014 re re re re re re re re re re re repost
srikanthraparla Posted December 9, 2014 Report Posted December 9, 2014 Bala na mazaka dont compare lion with anything
Recommended Posts