Jump to content

Recommended Posts

Posted

రుణమాఫీపై ఎన్నో ఆశలు... ఎన్నో అనుమానాలు.. ఇంకెన్నో అభ్యంతరాలు. హామీలు, డిమాండ్లు.. అధికార పక్షానిదొక మాట, విపక్షానిదొక మాట. రుణమాఫీ చేసి తీరుతామని చంద్రబాబు... షరతులేవీ లేకుండా అందరికీ, ప్రతిపైసా మాఫీ చేయాలని కాంగ్రెస్ , వైసీపీలు సవాళ్లు, సమాధానాలు, విమర్శలు, వివరణలు. ఇంతకాలం రుణమాఫీపై సాగిన ఈ ప్రహసనానికి చంద్రబాబు ముగింపు పలికారు. కుటుంబానికి రూ.లక్షన్నర గరిష్ఠ పరిమితితో రుణమాఫీ వర్తింపజేసి వేల మంది రైతుల కుటుంబాల్లో ఆనందం నింపారు. అయితే, అదేసమయంలో ఆధార్ కార్డులు స్థానికంగా పొందని రైతులు మాత్రం ఈ మాఫీని పొందలేకపోయారు. వారంతా ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు.

ప్రధానంగా హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చేస్తూ పంట రుణాలు తీసుకున్నవారు మాఫీ జాబితాలోకి రాలేదు. వారంతా అనర్భులని ప్రభుత్వం భావించింది. వ్యవసాయం లేని కాలంలో, ఉన్న ఊళ్లో పనులు దొరకని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ లోని అన్ని జిల్లాల నుంచి వేలాదిమంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వస్తుంటారు. అలా వచ్చిన వారు చాలామంది హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు పొందారు. ఇప్పుడు వారంతా రుణమాఫీకి దూరమవుతున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పుడు ఇక్కడ ఆధార్ కార్డులున్నవారికి మాఫీ వర్తింపజేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటివారిలో కొందరికి రూ.50 వేల లోపు రుణాలే ఉన్నా పూర్తిగా మాఫీ కాలేదు.

ఇలాంటి సమస్యలన్నిటిపైనా చంద్రబాబు ప్రభుత్వం దృష్టిపెట్టి అర్హులకు న్యాయం చేస్తే రుణమాఫీ హామీకి సార్థకత లభిస్తుంది. చిత్తశుద్ధితో అమలు చేసిన హామీలో ప్రతిపక్షాలు వంకలు పెట్టే అవకాశమూ ఉండదు. చిన్నకారు రైతులకు న్యాయం చేసినట్లూ అవుతుందని, రాజకీయంగానూ పూర్తి మైలేజి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. - See more at: http://telugu.gulte.com/tnews/7565/Aadhar-card-link-to-Loan-waiver-in-AP#sthash.i7CqX1Nh.dpuf

×
×
  • Create New...