timmy Posted December 9, 2014 Report Posted December 9, 2014 రానా చేతివేళ్లు కాలిపోయాయి 07:56 PM టాలీవుడ్ హీమాన్ దగ్గుబాటి రానా గాయపడ్డారు. రానా ఎడమ చేతికున్న నాలుగు వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఈ మేరకు రానా ఫోటోలను ట్వీట్ చేశారు. కాగా, ప్రమాదానికి కారణాలు మాత్రం ఆయన చెప్పలేదు. దయచేసి ప్రమాద కారణాలను మాత్రం అడగకండి అంటూ రానా ట్వీట్ చేశారు. అయితే ప్రమాద వివరాలపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 'బాహుబలి' షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారని కొందరంటుండగా, బాలీవుడ్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డారని మరికొందరు ఊహించుకుంటున్నారు. అసలు గాయం ఎక్కడైంది? ఎలా అంయింది? అనే లోగుట్టు రానాకు మాత్రమే ఎరుక. కాగా, ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
timmy Posted December 9, 2014 Author Report Posted December 9, 2014 http://instagram.com/p/wWIGj2wh4G/
Recommended Posts