Jump to content

Cricketer Died Of Cardiac Arrest While Playing Cricket


Recommended Posts

Posted
ఆస్టేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి నుంచి పూర్తిగా తెరుకోక ముందే, దేశవాళీ టోర్నమెంట్‌లో ముంబైకి చెందిన క్రికెటర్ రత్నాకర్ మోరే ముంబై ఓవల్ మైదానంలో క్రికెడ్ ఆడుతూ మృతి చెందాడు.టాటా పవర్ నిర్వహిస్తున్న స్ధానిక టోర్నమెంట్ పోటీల్లో భాగంగా ఆడుతున్న 29 ఏళ్ల రత్నాకర్ మోరే గవర్నమెంట్ లా కాలేజీ మైదానంలో మంగళవారం గుండెపోటుతో కుప్పకూలాడు. ఆయన్ను వెంటనే బాంబే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు.ఆయన భార్య ప్రస్తుతం 7 నెలల గర్భవతి. ఆమె ఆజాద్ మైదాన్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ పరిధిలోనే గవర్నమెంట్ లా కాలేజీ మైదానం ఉండటం, అక్కడే కేసు నమోదు కావడంతో స్టేషన్‌లో సైతం విషాదఛాయలు అలముకున్నాయి.రత్నాకర్ మోరే మృతితో టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్‌లు కూడా నిలిపివేశారు. టాటా పవర్ టోర్నమెంట్‌కి ముంబై క్రికెట్ ఆసోసియేషన్ నుంచి ఆమోదం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.
 
Posted

ippude nidra lechava koma lo nunchi....tadika!!!!!!!!

y ba

×
×
  • Create New...