Jump to content

Traffic Changes Due To Metro Project In Hyderabad


Recommended Posts

Posted
హైదరాబాద్ లో ఇవీ మెట్రో ఇక్కట్లు      08:31 PM
మెట్రో రైల్ అలైన్ మెంట్ మార్పు, నిర్మాణ పనుల కారణంగా హైదరాబాదు వాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు వచ్చిపడ్డాయి. మెట్రోరైల్ నిర్మాణం కోసం హైదరాబాదులోని పలు మార్గాల్లో రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తాజా మార్పులతో పలు ప్రాంతాలకు దూరం పెరిగింది. దిల్ సుఖ్నగర్ నుంచి కోఠి వెళ్లే వాహనాలను మూసారాం బాగ్ వద్ద మళ్లించిన ట్రాఫిక్ పోలీసులు, ఎంజీబీఎస్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనాలను చాదర్ఘాట్ సమీపంలో దారి మళ్లించారు.

ఈనెల 13వ తేదీ నుంచి రెండు నెలల పాటు చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట వరకు తిరిగే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మెట్రోరైలు పనులను ఆ ప్రాంతంలో ముమ్మరంగా చేపట్టాల్సిన కారణంగా ఈ మార్పుచేర్పులు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

 

×
×
  • Create New...