Jump to content

Recommended Posts

Posted

కేంద్ర క్యాబినెట్ లో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. చంద్రబాబు పనితీరును గమనిస్తున్న మోడీ క్యాబినెట్ లోని మంత్రులు ఇప్పుడు చంద్రబాబు పీఎం అయ్యుంటే బావుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. పీ.ఎం అంటే ఏంటో అనుకొనేరు.. ప్రైమ్ మినిస్టర్. ప్రధాన మంత్రి. అది కూడా మోడీ బదులుగానే! అధికార పీఠంలో కూర్చొని ఉన్న మోడీ బదులుగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యుంటే బావుండేదని కేంద్ర క్యాబినెట్ మంత్రులు చర్చించుకొంటున్నారట. మరి ఈ విషయాన్ని చెబుతున్నది ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అయిన ఒక ఎంపీ. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో గోదావరి జిల్లాల పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి గెలిచిన, సినీ రంగం నుంచి వచ్చిన ఒక ఎంపీ ఏపీ తెలుగుదేశం నేతలకు, పార్టీ కార్యకర్తలకు ఈ విషయాన్ని చెబుతున్నారని తెలుస్తోంది. బాబు విదేశీ పెట్టుబడులను సాధిస్తున్న తీరును చూసి కేంద్ర క్యాబినెట్ మంత్రులే ఆశ్చర్యపోతున్నారని ఈ ఎంపీ వివరిస్తున్నాడట. బాబు జపాన్ , సింగపూర్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడ పెట్టుబడిదారులను కదిలిస్తున్న తీరును చూసి కేంద్ర మంత్రులే కుళ్లిపోతున్నారని.. ఒకవేళ బాబు ప్రధానమంత్రిగా ఉండుంటే ఇంకా గొప్ప స్థాయిలో పెట్టుబడులు వచ్చేవని ఒకరికతో ఒకరు వ్యాఖ్యానించుకొంటున్నారని ఈ ఎంపీ చెబుతున్నాడట! కొసమెరుపు ఏమిటంటే... ఈ విషయం ఆర్ఎస్ఎస్ పెద్దలు, బీజేపీ ముఖ్యనేతల వరకూ వెళ్లిందట. దీంతో వాళ్లంతా కలిసి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిని కట్టడి చేయడానికి ప్లానేస్తున్నారని కూడా ఈ ఎంపీ చెబుతున్న విషయం! రానున్న రోజుల్లో ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేలా చూడాలని  ఆ ఎంపీ తెలుగుదేశం కార్యకర్తలకు తెలియజేశాడట. తద్వారా బాబు మహత్యం ఏస్థాయిలో ఉందో.. అది జాతీయ రాజకీయాలను కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలియజేయాలని...ఈ ఎంపీ గారు పార్టీ నేతలకు సూచిస్తున్నారు.  మొత్తానికి బాబుది మోడీకి మించిన స్థాయి.. బాబు చాతుర్యాన్నిచూసి కమలనాథులు కూడా తట్టుకోలేపోతున్నారనే ప్రచారానికి అధికారికంగా తెరలేపారు. మరి ఈ నయా గోబెల్స్ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో చూడాలి! 

Posted

CBN eppudooo PM candidateuuu... Appatlo inkevarno ekkincharu..!! 

Posted

CBN eppudooo PM candidateuuu... Appatlo inkevarno ekkincharu..!! 

 

yes agreed
 

×
×
  • Create New...