Jump to content

Recommended Posts

Posted

10848021_730760656973335_330995612307946

 

 

బొడ్డురాయి
కలరా, మసూచి మొదలగు సాంక్రామిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండునట్లు గ్రామవాసులు పూజించు నిలువున నాటిన పెద్దరాయి. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా గ్రామ మధ్యమున నెలకొల్పిన శిల. గ్రామమున అరిష్టము లేర్పడినప్పుడు, కొన్నిచోట్ల బ్రాహ్మణులు, మరికొన్ని చోట్ల కుమ్మరులు గ్రామప్రజల పక్షమున యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెట్టుదురు.
గ్రామదేవతలు

మనదేశంలో మాతృదేవతా స్వరూపాలైన గ్రామదేవతలు గ్రామాలలో స్థిరపడి, వారు నిర్వహించే విధులననుసరించి విభిన్న పేర్లతో చలామణి అవుతున్నారు. గ్రామదేవతల్లో స్త్రీ దేవతలే గాక పురుష దేవతలు కూడా వున్నారు. వీరితో పాటు వృక్ష , జంతు సంబంధమైన దేవతలు కూడ పూజింపబడుచున్నారు. అయితే జానపదులు స్ర్తీ దేవతకు ఇచ్చినంత ప్రాముఖ్యత పురుష గ్రామదేవతలకు యివ్వలేదు. గ్రామీణుల దృష్టిలో మాతృదేవత అందరికంటే అధికురాలు, గ్రామీణులచే శక్తి దేవతగా పూజింపబడుతున్న మతృ దేవత అంబిక, భద్రకాళి, చాముండి, కాళి, కామాక్షి, కన్యాకుమారి, మహేశ్వరి అనబడు పేర్లతో భారతదేశమంతటా పూజింపబడుతోంది.
నాదృష్టిలో గ్రామదేవతలు ముక్కోటి దేవతలలోవారే. ముక్కోటి అంటే ఒక పరిమిత సంఖ్య అని కాదు. అనంతమని అర్థం. గ్రామదేవతలు - శిష్ట దేవతలు అనికొందరు దేవతలను విభజిస్తారు. సామాన్యంగా గ్రామదేవతలు జన సామాన్యంపూజించేవి. ఇక్కడ వైదిక, ఆగమ, పౌరాణిక సంబంధమైన పూజలు, సంస్కృతమంత్రాలు ఉండవు.ఒకప్పుడు విరివిగా జంతుబలులు ఉండేవి. ఒకొకఊరిలో ఒకొక కులం వారు పూజారులుగా ఉంటారు. కాని గ్రామంలో అందరూ ఆదరిస్తారు. పూర్వం మశూచి, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు "అమ్మవారు పోసింది" అనేవారు.వేపమండలు రోగి గదివద్ద కట్టేవారు. ఆ సమయాల్లో అమ్మవారికి ముడుపులు కట్టేవారు.

Posted

10850060_731172650265469_645573743138827

మీరు చెప్పిన గ్రంథాలన్నీ పరమ ప్రమాణాలు. వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు సమస్తం కూడా ధర్మమును, న్యాయమును మనం ఆచరించదగిన విధానాన్ని చెప్పినయ్. అయితే శ్రుతిం పశ్యన్తి మునయః స్మరన్తి చ తథా స్మృతిం” అని. శ్రుతులను కన్నులతో చూచి ఆ అర్థములను చక్కగా అవలోకనం చేసి అది సమస్త జీవులకు కష్టం కనుక తెలుసుకోవడం వాటికి సరళంగా, వివరణగా, విచారణగా విశ్లేషించి స్మృతులను స్మరించారు మహర్షులు. మనన శీలురైన మహర్షులు వాటిని చూచి స్మరిస్తారు. అది చూచి స్మరించారు కనుక అదే ఇది. మనువు చెప్పిందే భేషజం, మందు అన్నారు. శ్రుతులు కూడా దీనిని చక్కగా బలపరిచినయ్. కనుక శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే. ఇవి వేరు వేరు విషయాలు చెప్పవు. అన్నీ కలిపి ధర్మాన్ని చెప్తాయి. అందులో ప్రవృత్తి, నివృత్తి. స్థాన భేదం, అధికార భేదం, సమయ భేదం. దానిని బట్టి చెప్తున్నటువంటి మాటలు గానీ వాటికి, వాటికి ఏవిధమైనటువంటి విరోధమూ ఉండదు.

Posted

10152649_628421120540623_706976584472532

పరమశివుడే వీరభద్రునిగా, కాలభైరవునిగా అనేక రూపములతో ఆరాధింపబడతాడు. దక్షయజ్ఞం విధ్వంసం మొదలైన వాటికి వీరభద్రుడుగా వచ్చాడు. కాలభైరవుడిగా కాశీలో యమధర్మస్థానం కాలభైరవుడు. పంచక్రోశరూపమైన కాశీలో కేదారఖండం పడింది. మహాపుణ్యభూమి. ఈ ఐదుక్రోసుల కాశీలో యమధర్మరాజుకానీ, ఆయన establishment కానీ రాకూడదు. వాళ్ళకు ఆ హక్కు లేదు. యముడు border చుట్టూ తిరుగుతాడు కానీ లోపలికి రాడు. ఇక్కడ హక్కంతా కాలభైరవుడిదే. అందుకే కాలభైరవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దండంతో బాదతారు వీపుమీద. నీకు రక్షణ ఇచ్చినట్లు కాలభైరవుడు. కాలభైరవుడు శివస్వరూపం. ఆయనకు ప్రత్యామ్నాయంగా మనం సర్వభూతములయందు పరమాత్మను చూస్తాం. అదీ గొప్పతనం. మన సంప్రదాయంలో అన్ని భూతములలో భగవంతుడున్నాడు. విష్ణుమూర్తి వరాహంగా కనపడ్డాడు. శంకరుడు కాలభైరవరూపంలో శునకంగా కనపడతాడు. సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంగా కనపడతాడు. అటువంటి కాలభైరవుడు కాశీ క్షేత్రానికి అధిపతి. శివస్వరూపమే ఇంకోరూపంగా కాలభైరవుడిగా ఉన్నాడు. ఢిల్లీలో పురాన్ ఖిల్లా వెనక గోడకి దగ్గరగా కాలభైరవుడు ఉన్నాడు. ఆ కాలభైరవుని భీముడు తీసుకువచ్చాడు. రాజసూయయాగం పాండవులు చేసేటప్పుడు నిర్విఘ్నంగా జరగాలంటే ఏమిటి ఉపాయం? అంటే కాలభైరవుని ఆశ్రయించు. విఘ్నాలు రావు అన్నారు. ఆయనను సేవిస్తే నేను వస్తున్నా పో అన్నారు. మనప్రాంతంలో తెలంగాణాలో నిజామాబాద్ దగ్గర కాలభైరవక్షేత్రం ఉన్నది. చాలామంది భక్తులు వెళతారు కనుక ఎక్కడ ఉన్న కాలభైరవుడైనా కాలభైరవుడే, మూలస్థానం కాశీలో

Posted

10256123_628829453833123_683322378330933

 

ఈశ్వరునికి ప్రతీక ఈ లింగం. భూమికి ప్రతీక ఈ లింగం. మనలో ఉండే ప్రాణశక్తికి ప్రతీక ఈ లింగం. అయితే అందరూ పూజామందిరంలో పెట్టుకొని అర్చించవచ్చునా అంటే కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎవరైనా ఆఫీసర్ ఇంటికి వస్తే ఎంతో మర్యాదలు చేస్తాం. అలాంటిది దేవదేవుడే ఇంటికి వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి? శివలింగం పెట్టుకున్నాం అంటే సాక్షాత్తు శివుడే ఇంట్లో ఉన్నాడు అన్నటువంటి జ్ఞానం కలిగి ఉండాలి కదా! అంటే దేహంలో ఆత్మలో పరమేశ్వరుడున్నాడు అన్న యెరుక గలవాళ్ళు యోగులు. చాలా పవిత్ర భావనలతో జీవించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆహారపు అలవాట్లనుంచి మొదలుపెట్టుకుంటే వ్యవహారం, నడవడిక సర్వమూ కూడా ప్రతీకాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉంటుంది. అలా కాకుండా వ్యవహారం వ్యవహారమే దేవుడు దేవుడే అంటే ఎలాగ?
ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అంటే అనేక నియమాలు పాటించాలి. ఈనాటి కాలంలో మాసిక నియమంలో ఉండేటటువంటి స్త్రీలు స్వేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఋతుకాల సంబంధిత నియమాదులు అంతగా పాటింపబడడం కాస్త తక్కువైన కాలం ఇది. అలాగే అర్చన సమయంలో కూడా కాలనియమాన్ని అనుసరించి సంపూర్ణ కాలం కేటాయించగలుగుతున్నామా? నైవేద్యాదులు పాటించగలుగుతున్నామా? పరీక్షలు వ్రాయాలంటే అటెండెన్స్ ఉండాలి, ఫీజ్ కట్టాలి అనే కాలంలో ఉపనయనం చేసుకుంటే గానీ వేదాధ్యయనం ఎందుకు అని ప్రశ్నించే ఈరోజులలో శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అంటే మన ఇంటికి 230వాల్టుల కరెంటు ఉంటే చాలు. శివలింగం అంటే వీధిలో ఉండే జంక్షన్ అనే చెప్పుకోవాలి. జంక్షన్ లో పెట్టే లైట్ ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎంత వెలుతురు? ఎంత నియమం? ఇవన్నీ పాటించాలి కనుక లింగం ఇంట్లో పెట్టుకోవచ్చును కానీ అమితమైన అనంతమైన నియమాలను పాటించవలసి ఉంటుంది. మనకి పటం చాలు, ఆలయం చాలు అర్చకులు చాలు కాదండీ అంటే నియమాలన్నీ తెలుసుకొని పాటించాలి.

Posted

1546215_629713183744750_5328380499167722

 

గోవధ మహాపాపం. తెలియక చేస్తారు. మహాపాపాన్ని సంపాదించుకుంటారు. గోవధ చాలా భయంకరం. అది జరిగే చోట కూడా వేదప్రామాణ్యం తెలిసిన వాడు ఉండకూడదు. శ్రీ జగద్గురువులు శృంగేరీ భారతీ తీర్థ స్వామీజీ కొన్ని సంవత్సరాలు హైదారాబాదుకు రాలేదు. ఈ గోవధ జరగడం గురించి వినలేక ఉన్నానని. మహానుభావులు ఆ ప్రాంతం వైపుకు కూడా రారు. అది అప్రశస్తం. అది మన హిందూ భారతీయ సనాతన సంప్రదాయానికి పూర్తి విరుద్ధం.
జంతుబలి ఆపడం మంచిదే. జీవహింస మంచిది కాదు. సనాతనంగా జరుగుతూనే ఉన్నది. వేటాడడం కోసం రాజులు వెళ్ళినట్లు యే కథలో చూసినా ఉంటుంది. ఇప్పటికీ జమీందారీ కుటుంబాలలో వేటకోసం తుపాకులు ఉంటూంటాయి. దేవతా పూజకోసం చంపకూడదు. ఒక సూత్రం ఉన్నది. “యదన్నః పురుషోభవతి తదన్నాస్తస్య దేవతాః” – నువ్వు యేది తింటూ ఉంటావో అది దేవతకు పెట్టాలి. నువ్వు పులిహోర, దద్ద్యోజనం తింటూ ఆమెకి చారు మెతుకులు పెట్టకూడదు. ఆ దృష్టితో సప్తశతి మొదలైన వాటిలో గానీ, దేవీ ఉపాసనా క్రమంలోగానీ, జంతువులు బలులు సనాతనంగా ఉన్నాయి. అయితే కేవలం ఆమెయొక్క ఆరాధనకోసం వాడి దానిని వినియోగించుకుంటారు. అది తినేవాళ్ళు అలా ఆరాధిస్తారు. అలా పనికి వస్తుంది కానీ వాళ్ళు తినకపోతే అమ్మవారికి అవి పెట్టక్కరలేదు. అమ్మవారి బలి దగ్గర జంతుబలి అన్నారు కానీ మార్కెట్లో వచ్చే టన్నులకొద్దీ గంపలు ఎలా వస్తున్నది? అదెవరూ నిషేధించడంలేదు. అక్కడే ఉంది తమాషా. శాస్త్రీయంగా చెప్పబడ్డ చోట బలిగా చేసేది వాళ్ళ సంప్రదాయంలో ఉన్నది; వాళ్ళు తినేటటువంటిది; అయిన దానిని జంతుబలి చేయడం ఉన్నది వెనకటి నుంచి. అది అనేక శాస్త్రాలలో ఉన్నది, ఉపాసనా కాండలలో ఉన్నది. అమ్మవారి కోసం జీవహింస చేయకూడదు. మనం తినకూడనిది, పెట్టకూడదు. హాయిగా గారెలు, పులిహోర, దద్ద్యోజనం వంటివి, యే అన్నం నువ్వు తింటున్నావో అది దేవుడికి పెట్టడం న్యాయం. అంతేగానీ దేవుడికోసం నైవేద్యం వేరుగా, మనం తినేది వేరుగా చేయకూడదు.

Posted

baboiii..nuvvu ne postlu..maanava maathrulaki ardam kaavu babayya..:(

Posted

10154044_630083040374431_893120782638902

 

అసలు విఘ్నేశ్వరుడికి ధ్యానంలో గానీ ఎక్కడా నామమూలేదు, అడ్డబొట్టు లేదు. ఈ రెండూ మనం కల్పించుకున్నవే. ఈ అడ్డబొట్టు, నిలువుబొట్టు మనయొక్క ఉపాసన, విశ్వాసం, శ్రద్ధను బట్టి మనం ధరించేది ఆయనకు కూడా పూస్తూ ఉంటాం. అంతేగానీ విఘ్నేశ్వరుడికి నిలువుబొట్టు వాడనీ, అడ్డబొట్టువాడనీ, ఎక్కడా అనుకోలేదు. ఏ బొట్టైనా పెట్టచ్చు ఆయనకి. ఎందుకంటే తండ్రి శివుడు, మేనమామ విష్ణువు. మేనమామగారి లాగా పెట్టుకున్నాడు అనుకుంటే నిలువుబొట్టు. తండ్రియొక్క సంప్రదాయం శివాంశ కనుక అడ్డబొట్టు తప్పులేదు. “శుక్లాంబరధరం విష్ణుం” అన్నారు అందుకనే. నల్లమామాయంచు నారాయణుని గొల్చు చిన్నికుర్రవాడు. మేనమామగా భావించారు విష్ణుమూర్తిని.
ఇందులో ఇంకొక రహస్యం. శంకరునికి ఇద్దరు కుమారులు. బాగా ఆలోచిస్తే తండ్రి కొడుకు ఒకడు, తల్లికొడుకు ఒకడు. కుమారస్వామి తండ్రికొడుకు. కేవలం శివవీర్యానికే పుట్టాడు. ఈ రెండో ఆయన అనేక కల్పాలలో అనేక గణపతి అవతారాలను విచారించినా శివుడికెక్కడా ఆయనకు సంబంధం ఉన్నట్లు కనపడలేదు. అమ్మవారి స్వరూపం. అమ్మవారికి నారాయణి అని పేరు. అందుకని తప్పులేదు. ఆంతర్యంగా చూస్తే శివవిష్ణువులకు సంబంధించిన ఏకైకమైన వస్తువు. సర్వసంప్రదాయాలలో విష్ణుమూర్తిని ఆరాధించాలి. దీనితో తృప్తి లేక కొంతమంది విష్వక్సేనుడిని పెట్టారు కానీ ఎక్కడా ఆయనకు పెద్దగా కథలు కనపడవు. కాబట్టి యే బొట్టు పెట్టినా తప్పులేదు.

  • Upvote 1
Posted

10154019_633133306736071_707784704226224

 

నిత్యపూజలో కూడా గణపతికే మొదటిపూజ చేయాలా?
వైష్ణవ ధర్మంలో కూడా విష్వక్సేనుల వారి ఆరాధన చేస్తే ఆయనకున్న పద్దెనిమిది శిరస్సులలో తొమ్మిదవ శిరస్సు గణపతి. వైష్ణవమైనా, శైవమైనా, మధ్వమైనా యే ధర్మమైనా, యే మార్గమైనా అన్నింటికీ మూలము గణపతి. "గణానాం పతిః - గణపతిః" ఈ దేహంలో ఉండేటటువంటి ఎనిమిది అష్టకములకు పురీఅష్టకములని పేరు. సంక్షిప్తంగా జ్ఞాపకం పెట్టుకుంటే మన దేహం పైన మనకు నియంత్రణను కలిగించేవాడు గణపతి. దేహంపైన నియంత్రణ లేకపోతే మనస్సు చంచలమౌతుంది. గణపతి అనుగ్రహం లేని స్థితి అది. మానసిక స్థితిగతులన్నింటినీ నియంత్రించేవాడు గణపతి కనుక ఆయనను స్తోత్రం చేస్తే కూర్చునే బుద్ధినిస్తాడు. శరీరం కూర్చోవడం కాదు మనస్సును కూర్చోబెట్టడం. చంచలమైన మనస్సును ఏదైనా ఒక విషయంపట్ల స్థిరంగా కూర్చోబెట్టగల నేర్పు గణపతికే ఉంది. కనుక యే దేవతారాధన చేసినా, నిత్య దేవతారాధనలో కూడా గణపతి పూజకంటే పూర్వం "శ్రీగురుభ్యోనమః" అనాలి. గణపతిని, పూజావిధానాలను మనచేత ఆచరింపజేస్తున్నటువంటి వారు గురుదేవులు గనుక శ్రీగురుభ్యోనమః అని ప్రారంభం చేసి శ్రీమహాగణాధిపతయే నమః అనగానే మన శరీరం మీద ఒక ఆధిపత్యం మనకు వచ్చేస్తుంది. ఆధునిక భాషలో Command లేదా శరీరాన్ని Tune చేసుకోవడం అంటారు.
నిత్యపూజలో కూడా గణపతికే మొదటి పూజ చేయాలి. గణపతి పూజ లఘువుగా చేసుకొని ఇష్టదేవతారాధన చేసుకోవచ్చు. గణపతికి కుంకుమ, గంధము, గరిక పెట్టి గణపతిని నైరుతి దిక్భాగంలోకి జరిపి ఆ పిమ్మట మిగతా పూజంతా చేస్తే మనకు కూర్చునేటటువంటి ఓపిక, లక్ష్యశుద్ధి, లక్షణశుద్ధి ఏర్పడతాయి. కనుక నిత్యపూజలోనైనా గణపతిని సూక్ష్మంగానైనా పూజ చేయాలి.

×
×
  • Create New...