psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 బిడ్డలయొక్క సంబంధం ఋణానుబంధం. బిడ్డలు ఋణానుబంధం అన్నమాట ఎందుకొచ్చిందంటే ఋణము అంటే అప్పు. ఎవరిదగ్గరో యేదో పుచ్చుకున్నాం. అప్పు అన్నమాటకి, దానం అన్న మాటకి తేడా వుంది కదా! దానం పుచ్చుకుంటే తిరిగి ఇవ్వక్కరలేదు. ఎవరైనా పంచెల చాపు ఇచ్చి కట్టుకోమంటే మళ్ళీ నేను ఇవ్వక్కరలేదు. నేనే ద్రవ్యం అవసరమై మళ్ళీ ఇస్తాను అని తీసుకున్నప్పుడు అది దానం కాదు అప్పు. నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఋణానుబంధ రూపేణ అన్నమాటకి అర్థం గతజన్మలలో వుండిపోయిన అప్పు యేది వుందో అది పిల్లలుగా వచ్చే అవకాశముంది తస్మాత్ జాగ్రత్త! ఇది ఎందుకు చెప్తారంటే పరాకు చెప్పుట అని ఒక మాట వుంటుంది. తొందరపడి పిచ్చి వ్యామోహం పెట్టేసుకోకు సుమా! అని చెప్పడం. దానిని జాగ్రత్తగా తాత్త్వికంగా అర్థం చేసుకోవాలి. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకున్నాను. ఇవ్వగలిగిన శక్తి వుండీ ఇవ్వలేదో, ఇవ్వలేక ఇవ్వలేదో మొత్తానికి ఇవ్వడం మానేశాను. కానీ అవతలవాడు వాడు నాకు డబ్బివ్వాలి ఇవ్వలేరు ఇస్తాడో ఇవ్వడో అని మనసులో దానికి సంబంధించిన బెంగ కుంగు ఉంటాయి కదా! శరీరాన్ని విడిచెపెట్టేముందు కూడా నాకు వాడు అప్పు తీర్చలేదు అని అప్పుగురించి ఆలోచిస్తూ చచ్చిపోయాడు. అది తీర్చుకోవడానికి వాడు కొడుకుగా వస్తాడు. ఋణ పుత్రుడు అంటారు. అలా వచ్చినవాడు ఆ అప్పు అయిపోయే వరకు వుంటాడు. నిజ పుత్రుడు అని ఒకడుంటాడు. వాడు ఎప్పుడూ తండ్రి దగ్గర వుంటాడు. తండ్రితో గౌరవంగా వుంటాడు. తండ్రి చచ్చిపోయే ముందు కూడా ప్రక్కనుంటాడు. గయా శ్రాద్ధం పెడతాడు. ఒకడు పుట్టాడు ఎక్కడో పెరిగాడు ఏ హాస్టల్ లోనో పెట్టాడు. ఈయనకి బదిలీలు. ఎప్పుడో రెండేళ్ళకో మూడేళ్ళకో నాన్నగారి దగ్గరికి వస్తాడు. బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. కొన్నాళ్ళకి ఈయన పోయాడు. వస్తాడు. ఓపిక వుంటే అంత్యేష్టి కార్యక్రమాలు చేస్తాడు. లేకపోతే ఎవరికో అప్పజెప్పి వెళ్ళిపోతాడు కర్తవ్యం. ఏడాదికోసారి గుర్తు వస్తే పెడతాడో పెట్టడో. అప్పుడు ఆ ఋణం అంతే అంటారు. వాడు కొడుకుగా వచ్చాడు. కానీ ఎప్పుడూ ప్రక్కన వుండేటటువంటి వాడు కాదు. ఎప్పుడూ తండ్రికి సంతోషానికి కారణమయ్యే వాడు కాదు. వాడొకడున్నాడని సంతోషించడానికి కారణమైన వాడు. ఒక్కొక్క కొడుకు ఎందుకు వస్తాడంటే శత్రువు కొడుకుగా వస్తాడు. ఒకడు వీడిని యేమీ చేయలేకపోతాడు. ఎలాగైనా ఏడిపించాలని అనుకుంటూ చచ్చిపోయాడు. వాడు కొడుకుగా వస్తాడు. వాడు తండ్రి యతి అంటే వాడు ప్రతి అంటాడు. ఈ రంగు బట్ట కట్టుకో అంటే ఒక్కనాటికి కట్టుకోడు. అప్పుడు తండ్రి ఏమిటో వీడు ఒక్కమాట వినడు అని తండ్రి యేడిస్తే కారణం వీడు. శత్రు పుత్రుడు. సేవక పుత్రుడు. ఒక్కొక్కరికి చదువు రాదు. నాన్న గారు వచ్చి నుంచున్నారనుకోండి ఒక కుర్చీ పట్టుకువచ్చి వేస్తాడు. నాన్నగారు పడుకుంటే కాళ్ళు పడతాడు. అక్షరం ముక్క మాత్రం రాదు. గతజన్మలో సేవకుడు కొన్ని దశాబ్దాలు సేవ చేసి వాడు చనిపోతూ ఈయననే తలుచుకుంటాడు. కొడుకుగా వచ్చి సేవ చేస్తాడు. అంతకన్నా దేనికీ పనికిరాడు. అందుకని ఋణానుబంధ రూపేణ - ఇవన్నీ యే జన్మలో ఋణాలో ఇప్పుడిలా వచ్చాయి. కాబట్టి అవన్నీ నిజమే అని భ్రాంతి పెట్టేసుకోకు. ఎప్పటి ఋణమో వచ్చింది. మళ్ళీ ఎందుకు పెంచుకుంటావు? ఈశ్వర ప్రసాదంగా భావన చెయ్యి. కొంతమంది చివర ప్రసాదు అని పెట్టుకుంటారు. వీడు మాకు ఋణానుబంధం కాదు ఈశ్వరుడి ప్రసాదం. ఈ భావన మార్చుకోగలిగితే నువ్వూ తరించి వాడూ తరిస్తాడు. వ్యామోహాలు దూరమౌతాయి. నీతో అనుబంధం వున్న వాళ్ళంతా నువ్వు అనుకున్న వాళ్ళు కాదు. గత ఋణాల రూపాలని గుర్తుపెట్టుకో. అలా వచ్చిన వాళ్ళు పశువు, పత్ని, కొడుకు....
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 పువ్వులను పరమాత్మకు సమర్పించే సమయంలో తొడిమ పరమాత్మవైపుకు పై భాగం ఊర్థ్వం (ఆకాశంవైపుకి) చూసే విధంగా వుండాలి. పువ్వు మనకు కనపడేటట్లు, కాడ దేవునికి తగిలే విధంగా కాకుండా నిలువుగా పుష్పాలు వుంచాలి అని అంటుంది ఆచరణ సంస్కార దీపిక అనే గ్రంథం. సంప్రదాయంలో కూడా పుష్పాలను ఈ విధంగా ఏర్పాటు చేయాలి. స్వామికి పూల వాసన అద్దాలి అనే వుద్దేశ్యంతో కాడలు మనవైపు, పువ్వు స్వామివైపు దోషం లేదు. నిజానికి స్వామిని అలంకరించే సమయంలో పువ్వులన్నీ నామావళి ఏమీ చెప్పకుండా అలంకరించి పూజ ఆరంభం చేయక మునుపే నిర్మాల్యం తొలగించి తుడిచి, చక్కగా బొట్టుపెట్టి, పువ్వుల మాలచే అలంకరించి గంధపుష్పాదులు అలంకరింపజేసి దీపాలు వెలిగించి అటుపిమ్మట ధ్యానం అని మొదలు పెట్టిన తరువాత స్వామిని స్పృశించకూడదు. ఆయన పాదాలమీదనే పువ్వులను సమర్పించాలి. ఇతర అలంకరణ అంతా ధ్యానానికి ముందే. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం అంటే మన ప్రాణ శక్తిని ఆ విగ్రహంలోకి ఆరోపింపచేస్తున్నాం. పాదములను ఆశ్రయించాలి తప్ప స్వామిని తాకరాదు. బ్రహ్మ కడిగిన పాదము అనే భక్తి భావనతో పువ్వులు పెట్టాలి. ఎన్ని నామాలు చెప్పాము అని కాదు. ఎంత భక్తి శ్రద్ధతో చెప్పాము అనేది ముఖ్యం. శ్రీమాత్రే నమః అనే ఒక్క నామం చాలు వేలాది నామాలు చెప్పిన ప్రభావాన్నిస్తుంది. శంకరాచార్యుల వారిని వారి తల్లి కొబ్బరికాయలు లెక్కపెట్టవయ్యా అని ఏరుకి వెళ్ళి తిరిగి వచ్చింది. భగవత్పాదుల వారు కొబ్బరికాయలు సంచిలో వేస్తున్నారు. ఎన్ని వేశావు? అని అడిగితే ఒక్కటి అన్నారు. సంచి నిండా వున్నాయి. ఇన్ని వేశావు. ఒక్కటి అంటావేంటి? అని అడిగితే అన్నిటిలోనూ వున్నది కొబ్బరే కదమ్మా ఒకటి ఒకటి ఒకటి అన్నాను అన్నారు. ఈ కథ ద్వారా మనకు యేం చెప్తున్నారు అంటే ఎన్ని నామాలు అన్నీ ఒక్కటే, ఎన్ని దేవతామూర్తులు - అందరూ ఒక్కటే. ప్రశ్నకు సమాధానం మాత్రం పువ్వు ఊర్థ్వం, కాడ అధోభాగం వుంచి పెట్టాలి. తొడిమ తీసి పెట్టడం అనేది మరింత పవిత్రమైన భావన. అర్చనలో మాత్రం పాదములమీదే సమర్పించాలి. ఇంటికి అతిథి వస్తే, కొలీగ్ వస్తే కాఫీ టిఫిన్ ఇచ్చి మర్యాద చేస్తాం. వచ్చినవాడు సాక్షాత్తు పరమాత్మ ఆ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వుండాలి. పూజ అంటే భావన, భక్తి. దేవుడిపై మనం పెంచుకోవలసింది భయం, భక్తి కంటె ప్రేమ విశ్వాసాలు. ఎంతగా మనం పరమాత్మపై ప్రేమను పెంచుకుంటే అంతగా మనలో ఆనందము, మమైక్య భావన అనే స్థాయిలో మనం పూజ చేయాలి.
spidereddy Posted December 15, 2014 Report Posted December 15, 2014 nu manchiga spamming cheskuntunav,,:(
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 శంఖం శుభ సూచకం, శుభ శకునం. ఉదయం లేవగానే శంఖాన్ని చూడాలి అని కూడా శకున శాస్త్రం చెప్తోంది. మనం సాధారణంగా చూసే శంఖాలన్నీ కూడా ఉత్తరం వైపువి లభిస్తూ వుంటాయి. దక్షిణావృతం దొరికితే మరింత విశేషం. వేదికపై స్వామిని ముందుగా పరిశుభ్ర జలంతో కడిగి మెత్తని పొడిబట్టతో మృదువుగా అద్దాలి. దేవతా స్వరూపాలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు కుడివైపున దక్షిణావృత శంఖాన్ని తూర్పు అగ్రం వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. శంఖంలో నీరుని కలశంతో కానీ/గ్లాసుతోకానీ/ఉద్ధరిణెతో గానీ/ నింపాలి. శంఖాన్ని తీసుకొని చెంబులో ముంచి పెట్టకూడదు. శంఖంలో మొదలు భాగము అస్పృశ్యము, తాకరాదు. తరువాత దానితో అర్చన చేయాలి. శంఖంలో నీరు పోసే సమయంలో "శంఖపీఠే బ్రహ్మణే నమః" - శంఖ పీఠంలో బ్రహ్మదేవుడు వున్నాడు. ’శంఖాగ్రే సోమాయ నమః"; "మధ్యే గంగా సరస్వతేభ్యో నమః" ఇలా శంఖ పూజ చేయాలి. "ప్రణవేన శంఖం ద్వాదశవారం పూరయ్తిత్వా". మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో నీరు పోసే సమయంలో ప్రణవేన - ఓంకారంతో పన్నెండు మార్లు నింపాలి. అప్పుడు ఆ శంఖంలో ఉండే నీరు పవిత్రమవుతుంది. తీర్థమవుతుంది. దానిచేత ఆ పరమాత్మను అభిషేకం చేసి తిరిగి యథాస్థానంలో వుంచి తిరిగి నీళ్ళునింపాలి. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా పెట్టకూడదు. మొదటగా పీఠాన్ని, తరువాత శంఖాన్ని, ఆ పిమ్మట పరమాత్మను అర్చించాలి. పరమాత్మను వుంచే పాత్ర బయట పళ్ళానికి ఎడమ వైపున శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 రుద్రాభిషేకమునకు వాడే పదార్థాలలో లౌకిక ప్రయోజనం ఏమిటి? రుద్రాభిషేకం చేసినప్పుడు జ్ఞానం రావడం అనేటటువంటిది రక్షణ కలగడం అనేటటు వంటిది రెండు ప్రయోజనాలు వుంటాయి. లౌకికమైన కోరికలు తీర్చుకోవడం అనేది తప్పనిసరి. ఒక కుటుంబంలో ఒక గృహస్థుగా వున్నప్పుడు కొన్ని లౌకికమైన కోరికలు వుంటాయి. అవి వుండకూడదు అని శాస్త్రమూ చెప్పలేదు. భగవంతుడు కూడా భగవద్గీతలో యేమన్నాడంటే "ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ" - కోరికలున్న వాళ్ళు నన్నే పట్టుకుంటారురా అన్నాడు. కొన్ని కోర్కెల రూపంలో వుండి కోర్కెలవుతాయి. కొన్ని కోరిక కానీ కోరిక కాదు. అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనది అవుతుంది. నేను ఇంటి యజమానిగా వున్నాను. నా కొడుకు/కూతురు కష్టపడకుండా వుండాలని అపమృత్యువు చేత గ్రసింపబడకుండా దీర్ఘాయువై వుండి నా మూడో తరాన్ని చూడాలని కోరుకోవడం తప్పు కాదు కదా! అది ఇవ్వగలిగిన స్థానం పరమేశ్వరుడిది.ఆయననే కదా ఆశ్రయించాలి. అది ఆశ్రయించడానికి యే అనువాకంతో/యే పదార్థంతో అభిషేకం చేస్తే లౌకికమైన కోర్కెలు తీరుస్తుందో చెప్పారు. ఆ పదార్థం ఒక్కటీ కాదు కోరిక తీర్చేది. ఆ పదార్థం లింగంమీద మంత్రంతో పడాలి. మంత్రం ప్రధానం. అభిషేకం చేయాలంటే మంత్రమూ వుండాలి (మంత్రం లేకుండా తీసుకెళ్ళి పోసేస్తాను అంటే కుదరదు), పదార్థం వుండాలి, లింగం వుండాలి. ఈ మూడూ కలిస్తే విస్ఫోటనం వుంటుంది అందులోనుంచి. లౌకికమైన కోరికలు తీరడానికి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి కారణమౌతుంది. దాహం వేసినప్పుడు ద్రవమే కదా అని పాకం/నెయ్యి త్రాగితే దాహం తీరుతుందా? మంచినీళ్ళు త్రాగాలి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క కోరికని/ఆర్తిని/తాపాన్ని తీరుస్తుంది. అంతటా నిండివున్న మంగళకరమైన శివలింగంలోనుంచి ఒక్కొక్క మంగళకరమైన అనుగ్రహశక్తి బయటికి రావాలి అంటే ఒక్కొక్క పదార్థంతో, మంత్రంతో అన్వయం చేయాలి. పాలు - ఆవుపాలతో అభిషేకము సమస్త సౌఖ్యములకూ కారణము. జ్ఞానం నుంచి సర్వసౌఖ్యాలు ఇస్తుంది. పెరుగు - ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం లోపించి ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఆవుపాలు తోడుపెట్టిన పెరుగుతో అభిషేకం చేసి దానిని ప్రసాదంగా పుచ్చుకుంటే అది అనారోగ్యం కలగడానికి హేతువైన పాపాన్ని తొలగించి ఆరోగ్యమనే మంగళప్రద శక్తినిస్తుంది. నెయ్యి - ఐశ్వర్యం కావాలంటే, కొడుకికి వుద్యోగం వచ్చి స్థిరపడాలి అన్నా ఆవునేతిని ఉపయోగించి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకుంటే యేది ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి అడ్డు వస్తోందో ఆ అడ్డు తొలగిపోతుంది. తేనె - తేజస్సు పొందాలి అనుకుంటే తేనెతో అభిషేకం చేయాలి. తేనెలో రెండు రకాలు - తేనె పట్టునుండి వచ్చే తేనె; పుట్ట తేనె. తేనెపట్టునుంచి వచ్చిన తేనెతో పరమశివుడికి అభిషేకం చేస్తే వాళ్ళకి తేజస్సు కలుగుతుంది. గోధుమ త్రాచు/నాగుపాము పుట్టలోకి దూరి శరీరాన్ని వేగంగా విదిలిస్తే చీమలు భయపడి బయటికి వెళ్ళిపోతాయి. విషపుగాలి ఊదుతుంది. చీమలన్నీ వెళ్ళిపోతాయి. చాలాకాలం సాధన చేసి శరీరాన్ని తిప్పుతుంది. లోపల మట్టి అంతా ఊడి మెత్తగా తయారవుతుంది. అక్కడ ఒకరకమైన జాతి తేనెటీగలు లోపల ఒక పట్టు పెడతాయి. పాము లోపలికి వెళ్ళినప్పుడు తేనెటీగలన్నీ బయటికి వెళ్ళేటట్లు కొడుతుంది. చీమలు బయటికి రాకుండా తేనెటీగలు బయటికి వచ్చినా, త్రాచుపాము లోపలికి వెళ్తుంటే తేనెటీగలు బయటికి వచ్చినా, లేదా పాము వెళ్ళిపోయాక తేనెటీగ లోపలికి వెళ్తున్నా అందులో తేనెపట్టు వుందని అర్థం. అప్పుడు కలుగులోకి పొగ వచ్చే పదార్థాన్ని చొప్పించినప్పుడు ప్రక్క కలుగులోంచి పాము వెళ్ళిపోతుంది. తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు పుట్ట త్రవ్వి తేనె తీసి తాటాకులో పోసి పిండుతారు. అప్పుడు వచ్చేదానిని పుట్ట తేనె అంటారు. అది నాలుక మీద పడితే అమృతం పడినట్లే వుంటుంది అంటారు. ఆ పుట్ట తేనె తెచ్చి అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తరజన్మలో. వాగ్గేయకారుడౌతాడు. అన్నమాచార్యుల వారిలా, ఒక శ్యామాశాస్త్రి గారిలా అవగలిగిన సంగీత విద్య ఎక్కడినుంచీ వస్తుంది అంటే పుట్టతేనెతో అభిషేకం చేస్తే. కానీ అది లభ్యమవుతుందనుకోవడం చాలా కష్టం. పంచదార - పంచదారతో అభిషేకం చేస్తే దరిద్రం పోతుంది. దరిద్రం పోవడం వేరు, ఐశ్వర్యం కలగడం వేరు. దరిద్రం అంటే అన్నీ వుంటాయి కానీ అనుభవించడానికి వుండదు. ఇదంతా పోగొట్టి మనసులో అనుకున్నట్లు అనుభవించే శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. దరిద్రనాశనం బాహ్యంలో లేకపోవడం దగ్గరినుంచి ఉన్నది అనుభవించేంతవరకు. ఇది శివానుగ్రహం చేతనే సాధ్యం. మారేడు దళం - మారేడు దళం యొక్క ఈనె క్రిందకి వెళ్ళేటట్లు పెద్దగా ఉన్న ఆకుని పైకి పెట్టి కొంచెం అంచు అభిషేకం చేసే పాత్రకేసి నొక్కాలి. పాత్రను ఒడుపుగా వంచితా మారేడు దళం చివరినుంచి (శీర్షం నుంచి) ధార పడుతుంది. ఆ ధార శివలింగం మీద పడేటట్లుగా అభిషేకం చేస్తే సర్వసౌఖ్యములకూ కారణమౌతుంది. పసుపు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే మంగళములకు కారణమౌతుంది. మామిడిపండు రసంతో అభిషేకం చేస్తే రోగం పోవడానికి కారణమౌతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలగడానికి కారణమౌతుంది. ఎంత వయస్సు వచ్చినా ఇంకా అర్థరహితమైన జీవితం. పిచ్చి కోరికలు. బ్రతికున్నంతకాలం కోరికలే? గురువుగారి దగ్గరికి వెళ్ళినా. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కోరికలే. బ్రతుకంతా కోరికలు వుండడం కాదు. ఏదో ఒకనాడు చెప్పులు విప్పాల్సిందే. వైరాగ్య సుఖాన్ని పొందాలి. ఈశ్వరుడియందు మనస్సు పెట్టాలి. అలా కాకుండా కోరికలతో వెంపర్లాడే స్థితి మనస్సులో వుంటే ఆ పరిస్థితి తొలగించమని నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయాలి. నవరత్నాలు నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే ఇల్లు కట్టుకోలేక పోయిన వాడికి ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుంది. బంగారం నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే భూమి కలిసొస్తుంది. కస్తూరి నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. బాహ్యంలో రాజ్యానికి చక్రవర్తి. ఏ కోరికా లేక కస్తూరితో అభిషేకం చేస్తే భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తివి అవుతావు. విభూతిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సమస్త పదార్థాలతో అభిషేకం చేసినట్లే అని శాస్త్రంలో మర్యాద చూపించింది. ఈ పదార్థం చేశారు, ఈ పదార్థంతో చేయలేదు అన్న లోటు చెప్పరు. అన్నింటితో చేసేసినట్లే. ప్రతిరోజూ ఇంట్లో చందనం తీసి దానిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. చందనంతో రోజూ అభిషేకం చేస్తే కొడుకు వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క లౌకికమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరికలు ఒక వయస్సులో అవసరం. ఆ కోరికలు తీర్చుకోవడానికి రుద్రాధ్యాయం ఈ పదార్థాలను చెప్పింది. రుద్రకామ్యార్చన అంటారు. కోరికలనుండి కోరికలు కాని కోరికల వరకు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే పరమేశ్వరుడు. అది అభిషేక ప్రక్రియ చేత లభిస్తుంది. అందుకు రుద్రం, రుద్రాధ్యాయం, రుద్రాభిషేకం అంత గొప్పవి. ఇవన్నీ లౌకిక ప్రయోజనములు, ఆంతరమునందు విశేష ప్రయోజనములు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 అసంఖ్యాకులైన భగవద్భక్తులు దేవుణ్ణి చూశారు. శ్రీరామకృష్ణుల వద్దకు నరేంద్ర వచ్చి అడిగిన ప్రశ్న ఇదే. దానికి దేవుణ్ణి చూశాననీ, కావాలంటే నీకూ చూపిస్తాననీ శ్రీరామకృష్ణులు అన్నారు. చూపించారు కూడా! స్వామి శివానందజీ మహారాజ్ శ్రీరామకృష్ణుల శిష్యుడు. ఒక యువకుడు ఆయనను కూడా ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు శివానందీ తాను దేవుణ్ణి చూశానని చెప్పారు. ఆ దేవుడు ఎవరంటే శ్రీరామకృష్ణ భగవానులే దేవుడన్నారు. ఇది ముమ్మాటికీ నిజం. దేవుడు మానవునిగా జన్మించి మనతో ఈ భూమిపైన నడయాడతాడు. ఈ అవతార పురుషుల మహోత్కృష్టమైన కార్యాలు సామాన్యులకూ, మూఢులకూ, నాస్తికులకూ, అసురీ రాక్షస స్వభావం గలవారికీ అసలు అర్థం కావు. పైగా అపార్థం చేసుకొని, వారిని హింసించడానికి ప్రయత్నిస్తారు. విధి వ్రాతను విధాతే మార్చగలడు. మధురనాథ్ బిశ్వాస్ అనే జమీందారు సైతం శ్రీరామకృష్ణులను ఇదే ప్రశ్న వేస్తే, శ్రీభగవానునికి అంతా సాధ్యమే" అన్నారు గురుదేవుు. ఎర్రమందారాలు పూసే చెట్టుకు ఒకే కొమ్మకు ఎరుపు, తెలుపు మందారాలు పూయడాన్ని శ్రీరామకృష్ణులు మధురనాథ్ కు చూపిమ్చారు. ప్రారబ్ధవశాన వ్యాధి శరీరానికి వస్తుంది. దాన్ని ఆపలేక పోవచ్చు. అయితే వ్యాధి తీవ్రతను అదుపు చేయవచ్చు. వ్యాధిని భరించే మనశ్శక్తిని భగవత్ పూజ, జపధ్యానాలతో సాధించవచ్చు. సృష్టి స్థితి ప్రళయాలు భగవత్ కార్యాలు. ఈ ప్రపంచంలో నిత్యం అసంఖ్యాకులు పుడుతున్నారు. లక్కలేనంతమంది జీవులు మరణిస్తున్నారు. ఇలాంటి అవివేకమైన ఆలోచనలు మాని, భగవద్భక్తి, స్వయంశక్తితో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. చాలామందికి నాస్తిక భావాలు సహజంగా వస్తాయి. వయస్సు పెరిగిన తరువాత, జవ జీవాలు ఉడిగిన తరువాత ఆ మహాపురుషుల సహచర్యంతో అసహజమైన ఆలోచనలు ఆుతాయి. భగవత్ భక్తి ప్రాప్తిస్తుంది.
k2s Posted December 15, 2014 Report Posted December 15, 2014 papam piscop maaya ...........whosdadnolisten ayipoyadu.........
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 భార్యాభర్తల సంబంధం ఏడు జన్మలు వుండేటటువంటి సంబంధం. ఏడు జన్మల గురించి. ఏడు (సప్త అంటాం సంస్కృతంలో)శబ్దానికి ఒక లక్షణం వుంది. ఏరికోరి ఏడడుగులు నడిచారనుకోండి వారిద్దరి మధ్య స్నేహం అంకురిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకే సప్తపది అంటారు. సప్తపది అంటే ఆయన చిటికెన వ్రేలు పట్టుకొని వివాహంలో ఆవిడ యేడడుగులు వేస్తుంది. అలా చేస్తే ఆవిడ పరమేశ్వరుడిచ్చిన గొప్ప స్నేహితురాలు. ఆమె ఎవరి బిడ్డో. ఆమెకీ ఇష్టాయిష్టాలున్నాయి. నేను భర్తని అని చెప్పి ఊరికే శాసనాలు చేయకూడదు. పరమేశ్వరుడిచ్చిన స్నేహితురాలిగా మృదువుగా చూడడం అలవాటు చేసుకోవాలి. అంత ప్రేమతో ఆవిడ కూడా సఖిగా వుంటుంది. ఆ ప్రేమయొక్క హద్దులు తెలుసుకొని అందంగా బ్రతకడం అలవాటు చేసుకోవడం ఏడడుగులు కలిసి నడవడం. అలాంటి మమకారం అలవాటై ఇద్దరూ ఒకరినొకరు తరింపజేసుకోవడానికి ఒకరితో ఒకరు చేయికలిపి నడిచారనుకోండి యజ్ఞయాగాది క్రతువులో, ఐశ్వర్యంలో, సంతానంలో, పుణ్యంలో, ఓదార్చుకోవడంలో, ఒకరికొకరు ఆలంబనగా వుండడంలో, చెయ్యి చెయ్యీ పట్టుకొని బ్రతికి ప్రస్థానం చేయడం అలవాటు అయింది. అలా అలవాటు అయితే ఆయన మీద ఆవిడకి, ఆవిడ మీద ఆయనకి ఆ అనుబంధం వుండిపోతుంది కాబట్టి ఏడు జన్మలలో వాళ్ళ దాంపత్యం అలాగే స్థిరంగా వుంటుంది. అంటే అది మంగళప్రదమైన వాక్కు. మీరు అంత ప్రేమగా బ్రతికెదరుగాక! మీ ప్రేమ ఏడు జన్మల వరకు విడివడకుండు గాక! అంటే శాశ్వతత్వమును పొందుగాక! ఆ పై వాళ్ళు కూడా పెళ్ళి చేసేటప్పుడు ఒరేయ్! మీ అమ్మానాన్నలా, నాయనమ్మ తాతలా బ్రతకండిరా అని ఏడు తరాలు చెప్పుకోవాలి. అంతేకానీ, కాకి ముక్కుకి దొండపండు, మీతాత మంచివాడే కానీ మీ నాయనమ్మేరా బాబు గయ్యాళి అనిపించుకోకూడదు. వాళ్ళిద్దరూ అలా బ్రతకాలి. నిజంగా ఆవిడ గయ్యాళి అయినా ఈయన దాన్ని బయటికి రానీయకూడదు. కాపాడుకోవాలి. అది భర్తృత్వం. అంతేకానీ భార్య వెలితితనం బయటికి వచ్చేసిందో భర్తృత్వం కాదు. ఏ లోపం వున్నా ఆయన వల్ల అది అడ్డుపడిపోయి జోలికి వెళ్ళడానికి భయపడుతున్నారనుకోండి అది భర్తృత్వం. ఆయనని పిల్లవాడికి దృష్టి తగులుతుందని అమ్మ పైట చాటున అన్నం పెట్టినట్లు భర్తను అంత ప్రేమతో కాచుకుందనుకోండి అది భార్య. మీరిద్దరూ ఇలా ఏడు జన్మలు బ్రతికెదరు గాక! ఏడు జన్మలే ఎందుకు చెప్పాలి? ఈ ఏడు జన్మలూ ఏమవ్వాలంటే అష్టాంగయోగంలో మీకు ఏడు జన్మలు ఏడు మెట్లు అయి ఎనిమిదవది సమాధి యగు గాక! ఇక మీరు పుట్టని స్థితి మీ ఇద్దరి దాంపత్యమునకు కారణమగుగాక! అందుకని ఎనిమిది/ఆరు చెప్పరు. ఏడు చెప్తారు. అందుకని ఏడు జన్మల సంబంధం అంటారు. తాత్త్వికంగా అలా అర్థం చేసుకొని అలా బ్రతికేటటువంటి స్థితిని మనం పొందాలి.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా? లేదా? ఈజన్మలో మోక్షం పొందాలంటే మార్గం ఏది? పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం. ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు "ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను" అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి "నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు." అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు - ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 తల్లిదండ్రులు అపరాధం చేస్తే ఏం చేయాలి? ఈమధ్య చాలామంది తరచుగా ఈ విషయం గురించి ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించరాదు. తల్లిదండ్రులంటే సామాన్యులనుకొన్నావా? వారు ప్రసన్నులు కాకపోతే జీవితంలో ఏదీ ఫలవంతం కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఇప్పుడు నీకూ పిల్లలున్నారు. ఈ స్థితిలో భార్యను తోడ్కొని బయటకు వచ్చేశావు! తల్లిదండ్రులను మోసం చేసి, భార్యాపిల్లలను పిలుచుకొని వచ్చి, ఏదో గొప్ప మహాత్ముడిలా భావిస్తున్నావు. మనకు ఎన్నో ఋణాలున్నాయి. - దేవ, ఋషి, మాతృ, పితృ, దారాఋణం. తల్లిదండ్రుల ఋణం తీర్చకుంటే ఏ పనీ నెరవేరదు. ’యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా’ అని చండీ స్తోత్రంలో వుంది. కాబట్టి తల్లితో జగన్మాతను దర్శించాలి. స్త్రీలందరూ దేవీ స్వరూపిణులే. కొందరు శ్లోకాలను వల్లిస్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ ప్రవర్తన తద్విరుద్ధం. రామ ప్రసన్నుడు ఆ హఠయోగికి నల్లమందు, పాలు ఏర్పాటు చేయడానికి చెడ తిరుగుతున్నాడు. సాధు సేవ చేయాలని మనుధర్మశాస్త్రం చెబుతోంది అంటాడు. ఇటు చూస్తే వృద్ధురాలైన అతడి తల్లికి తినడానికి తిండిలేదు. తల్లి సేవను విస్మరించి, సాధుసేవ చేస్తున్న అతణ్ణి చూసినప్పుడు ఎంతోకోపం వచ్చేది రామకృష్ణుల వారికి. కానీ మరో విషయం గమనించాలి. "భగవత్ ప్రేమోన్మాదం కలిగితే, ఇక తల్లి ఎవరు? తండ్రి ఎవరు? భార్య ఎవరు? అది ఎంతటి ప్రేమ అంటే ఆ ప్రేమలో అతడు పిచ్చివాడే అయిపోతాడు అతడికి ఏ కర్తవ్యమూ వుండదు. అతడు ఋణాలన్నిటి నుండి విముక్తుడవుతాడు. ప్రేమోన్మాదం ఎలాంటిదో తెలుసా? ఆ స్థితి ఏర్పడితే ప్రపంచాన్నే మరచిపోతాడు. అతి ప్రియమైన ఈ దేహాన్ని మరచిపోతాడు. చైతన్యులకు ఈ స్థితి కలిగింది. సముద్రమనే ఎరుక లేకుండా దానిలో దూకేశాడు, ఇసుకలో పదే పదే పొర్లాడాడు. ఆకలి లేదు, దప్పికలేదు, నిద్రలేదు, శరీర స్పృహే లేదు".
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 పరమాత్మ నామరూపాలకు అతీతుడంటారు కదా! భక్తులు ఆ విషయాన్ని ఎలా గ్రహించాలి? పరమాత్మ నామరూపాలకు అతీతుడే. ఆ విషయం గ్రహించవలసిన అవసరం భక్తులకు లేదు. భక్తునికి కావలసింది సాకార రూపంలోని భగవంతుడు. నామ రూపాలకు అతీతమైన పరమాత్మ సాక్షాత్కారానికి నిర్వికల్ప సమాధిలో జ్ఞాని ప్రయత్నిస్తాడు. "నేను పంచదార అవదలచుకోలేద్. చక్కెరను నేను రుచి చూడాలి. బ్రహ్మజ్ఞానానికో నమస్కారం" అంటారు శ్రీరామకృష్ణులు. నిర్వికల్ప సమాధిలో 3రోజులుండీ, నిరంతరం సమాధిస్థితిలో మనస్సును ఉంచీ, భక్తులను అనుగ్రహించడానికి చిత్తాన్ని వ్యావహారిక స్థితికి తీసుకురావడానికి చిరు కోరికలను సంకల్పించేవారు. భక్తులను అనుగ్రహించడానికి దైవం మానుష రూపంలో అవతరిస్తాడు.
Recommended Posts