psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఈనాడు ధ్యానం చాలా ప్రాచుర్యం పొందిన అశం. ధ్యానం ఎలా చేయాలండీ? ధ్యానం నేరుపుతారా? ఇవి చాలామంది గురువులు ఎదుర్కొంటున్న ప్రశ్నలు. దీనికి కారణం "ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఒక వారం రోజుల్లో ధ్యానం నేర్పుతాం, అంత సమయం ఇవ్వలేని వారికి మూడే మూడు రోజుల్లో ధ్యానం నేర్పుతాం" అని చెప్పడమే! ధ్యానం ఎలా చేయాలో తెలుసుకునే ముందు, ధ్యానం ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న మనలో ఉదయించాలి. మాటలు రాని పసిపిల్లవాడు ఏడ్చినప్పుడు తల్లి బుజ్జగిస్తూ మొట్టమొదట పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాతే ఏంచేయాలి? ఎలా చేయాలి అన్న ఆలోచన. ఒక అధ్యాపకుడు తన విద్యార్థులకు సైన్ులో ఒక ప్రయోగం నేర్పించారు. పరీక్షలో దాని గురించి "అది ఏమిటి? ఎలా జరుగుతుంది?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఒక విద్యార్థి "ఏమిటంటే ఎలా చెప్పను? ఎలా అంటే ఏమి చెప్పను?" అని వ్రాశాడు. ఎందుకా ప్రయోగం చేయాలి అన్న జ్ఞానం లేకపోవడం వల్లనే ఆ విద్యార్థి ఏమిటి? ఎలా? అన్న అంశాలను మరచిపోయాడు. ఒక పెద్ద మనిషిని ధ్యానం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు ధ్యానం చేస్తే రక్తపోటు తగ్గుతుందని డాక్టరుగారు చెప్పారని బదులిచ్చాడు. కాబట్టి ఎందుకు అన్న ప్రశ్న మన అంతరంగంలో ఉదయించాలి. అది మన సొంత ఆలోచనవ్వాలి. పతంజలి మహర్షి యోగానికి అంగాలు ఎనిమిది అని పేర్కొన్నారు. అవి ’యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధారన, ధ్యాన, సమాధి’. యమ: అహింస, సత్యవాక్పాలన, దొంగతనం చెయ్యకపోవడం, బ్రహ్మచర్యం, ఎవరినీ యాచించకపోవడం నియమ: బాహ్యాంభ్యంతర శుద్ధి, దొరికన దానితో తృప్తి, తపస్సు, వేదాధ్యయనం, భగవద్ధ్యానం. ఆసన: కాసేపు ఒకచోట నిలకడగా కూర్చోగలగడం ప్రాణాయామ: శ్వాసను లయబద్ధం చేయడం. లయబద్ధంగా ఉండే శ్వాస మనస్సును ప్రశాంత పరుస్తుంది. ప్రత్యాహార: బాహ్య ప్రపంచంలోని వస్తువులు - పదార్థాలనుండి ఇంద్రియ అవయవాలను మరల్చి అంతర్ముఖం కావించడం. ధారణ: ఒక వస్తువుపై మనస్సును స్థిరంగా వుంచడం. ధ్యానం: ఏకాగ్రం చేసిన వస్తువుపై అవిచ్ఛిన్న ధారగా చేసే భావనా ప్రవాహమే ధ్యానం. యమ నియమాలు మొదటి సోపానాలు. వీటిని మనం ఆచరిస్తున్నామా అని గమనించాలి. సత్యవాక్పాలన పాటిస్తున్నామా, దొరికిన దానితో సంతృప్తికరజీవనం గడుపుతున్నామా అని ఆలోచించుకోవాలి. మందిరంలో భజన జరుగుతున్నప్పుడు కొంతమంది భక్తులు బయట ’ఇష్టాగోష్టి’ జరుపుతారు. కాసేపు కూడా కుదురుగా కూర్చోలేనప్పుడు ఆసనసిద్ధి ఎలా లభిస్తుంది" ఈ విధంగా ఆరుమెట్లు ఎక్కకుండా ఒక్కసారి ధ్యానం చేయబోవడం ఎంతవరకు సమంజసం? అది సాధ్యమవుతుందా? ఆలోచించండి.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఇరవై ఏళ్ళుగా సాధన చేస్తున్నాను. కానీ మనోవాసనలను జయింపలేకున్నాను? ప్రతి మనిషికీ ఆరు జన్మల వాసనలు మనస్లో నిల్వ వుంటాయి. క్రిందటి 7వ జన్మలోని వాసనలు ప్రారబ్ధంగా మారి ఈ జన్మలో అనుభవిస్తాడు. లేక పూర్వ వాసనలలో ఫలాన్నివ్వడానికి సిద్ధంగా ఉన్న సంస్కారాల వల్ల ఈ జన్మ కలుగుతుంది. ఇదంతా పురాణాల ఆధారంతో చెప్పింది. దీనినే "ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్" అని గీతలో (2-55) అన్నారు. కనుక వివేక, వైరాగ్య ఏకాగ్రతలు కలగడానికి మనసులో ఉన్న అన్ని వాసనలూ క్షయం అవాలి. ఉదాహరణకు ఒక పెద్ద బండరాయిని సుత్తితో బ్రద్దలు కొట్టే వ్యక్తి నలభై దెబ్బలు కొట్టిన తరువాత రాయి పగులుతుంది. నలభయ్యో దెబ్బకే రాయి పగిలిందని చెప్పలేం. ముప్ఫైతొమ్మిది దెబ్బలు సహకరించి నలభయ్యో దెబ్బ ద్వారా ఫలితం కలిగిందని చెప్పవచ్చు. అలాగే సాధకుడు చేస్తున్న సాధన ఫలితం బాహ్యంగా కనిపించకపోయినా అంతరంగంలో ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతూనే వుంటుంది. శుద్ధ మనస్సు కలవానికి స్వప్నంలో కూడా నిరంతరం ఇష్టచింతనయే కలుగుతుంది. చెడు స్వప్నాలు రావు. అందరిలోనూ పరమాత్మను చూస్తూ, నిష్కామ కర్మ చేసేవారికి సర్వత్రా ఇష్ట దర్శనం జాగ్రదావస్థలో కలుగుతుంది. అంతవరకూ సాధన చేస్తూండాలి.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఉపవాసం ఎలా చేయాలి? ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మితాహారాన్ని భుజించడం - ఈ రెండూ ఉపవాస దీక్షకు చాలా అవసరం. ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం మీదనో కాక స్వతంత్రంగా ఉపవాసం ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు, శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడతాయి. ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి. సాంసారిక, రాజకీయాది బాహ్య వ్యాపారాలన్నిటినీ వీలైనంత మేరకు మనసా, వాచా, కర్మణా త్యజించాలి. కేవలం ఆధ్యాత్మిక చింతనతో పొద్దు పుచ్చాలి. ఉపవాస వ్రతాన్ని అనుసరిస్తున్న రోజున వీలైతే మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే, కనీసం మితంగా మాట్లాడాలి. ముఖ్యంగా మనోవైకల్యాలు రాకుండా నిగ్రహించుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం. మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయడంలాంటివి అనుసరించాలి. సర్వసాధారణంగా ఉపవాసమంటే, వండినఆహారపదార్థాలను తినకూడదు. పాలు, పండ్ల లాంటి వండని ఆహారపదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చి గంగైనా ముట్టకుండా, ఉపవాసం ఉంటారు. తట్టుకోగల శక్తి ఉంటే అలా ఏమీ తినకుండా, తాగకుండా కూడా ఉపవసించవచ్చు. అయితే, వృద్ధులు, శారీరకంగా బలహీనులు, రోగులు, చిన్న పిల్లలు ఉపవాసం చేయాల్సిన పనిలేదు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 నిద్రలో పీడకలలు వస్తే అవి దేనికి సంకేతం? పీడకలలు వస్తే మనసు భయపడింది అని అర్థం. శివాభిషేకం, భస్మధారణ సులభమైన మార్గాలు అంటుంది శాస్త్రం, ధర్మం. నిద్రపోయే సమయంలో రామస్కందం హనూమంతం వైనతేయం వృకోదరం! శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నః తస్య నశ్యతి!! అని స్మరించుకొని నిద్రపోతే ఎటువంటి పీడకలలు రావు. సాయంత్రం 6-9 మొదటియామము - గృహకార్యములు చక్కబెట్టుకునే సమయం, భోజన సమయం. 9-3 వరకు నిద్రించే కాలం. రెండవ యామము 9-12; మూడవయామము 12-తెల్లవారుఝాము 3 వరకు; నాల్గవ యామము 3-6. రెండవయామములో ఏమైనా పీడ కలలు వస్తే అవి వెంటనే సద్యోఫలాన్ని చూపిస్తాయి. అందువల్ల మానసికంగా కలిగే క్లేశము తప్పించుకోవడం కోసం పై శ్లోకం చదువుకోవాలి. పీడకలలు ఎవరికీ చెప్పకూడదు. తెల్లవారు ఝామున లేచి స్నానం చేసుకొని దేవతరాధన చేసుకొని భస్మం ధరించాలి. దానివల్ల అశుభ ఫలాలు రాబోతున్నవి అనుకుంటే వాటియొక్క పరిణామ తీవ్రతలు తగ్గుతాయి.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 మన ధర్మమును, కర్మను అనుసరించి సుఖము కలుగజేయు ఈశ్వరుడు దుఃఖము ఎందుకు కలుగజేయును? మానవుని యొక్క ధర్మాధర్మ ప్రవర్తన ననుసరించి ఈశ్వరుడు ఫలితమును యిచ్చును. కాని తనకు తాను స్వతంత్రముగ ఎప్పుడునూ ఫలితమును ఇవ్వడు. విద్యుత్తు (కరెంటు) మన ఇంటి యందంతయూ ఉండును కాని మనకు ఎచ్చట వెలుతురు అవసరమో అచ్చట స్విచ్ ను ఉపయోగించుకొందుము. ఈ విధముగనే ఈశ్వరుడు సర్వసాక్షి రూపమున అంతట ఉండును. కాని మన కర్మను అనుసరించి మాత్రమే ఫలితాన్ని కలుగజేయును. మరియు మనకు ఒక మిత్రుడు ఉత్తరము వ్రాసినచో దానిని మనకు Postman చేరవేస్తాడు. కానీ ఆ ఉత్తరములో సుఖదుఃఖ విషయములకు అతనికి ఏమాత్రము సంబంధము వుండదు. కేవలము అతడు సాక్షి మాత్రమే. కావున ఇక్కడ మనచే ఆచరింపబడిన ధర్మాధర్మములకు సాక్షీభూతుడైన ఈశ్వరుడు వాటిని అనుసరించి మనకు ఫలమును కలుగజేయునే కాని స్వయముగ తనకు తాను ఎటువంటి సుఖదుఃఖములను కలుగజేయడు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 భగవంతుని అవతారము ఎప్పుడెప్పడు జరిగినది? ఈనాడు కొంతమంది తామే దేవుళ్ళమని చెప్పుకొనుచున్నారు. దీనిని శాస్త్రములు చెప్పుచున్నవా? చాలామంది ఇంద్రజాలమో లేదా ఏదో చమత్కార ప్రయోగము చేసి తమకు తాము భగవంతులమని చెప్పుకొనుచున్నారు. ఈ విషయములను శాస్త్రము సమ్మతించినదా? కృతయుగమునందు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ వామనావతారములు; త్రేతాయుగమునందు రామ మరియు పరశురామ అవతారములు; ద్వాపరయుగములో బలరామకృష్ణుల అవతారములు ఉండినవి. మరియు ఈ కలియుగములో కల్కి అవతారము సంభవించును. ఇది కాకుండా ఈ యుగములో వేరే యే భగవదవతారము ఉండదు. శాస్త్రములననుసరించి చూచినచో పది యవతారములే ముఖ్యమైనవి. ఈనాడు ప్రజలలో సిద్ధులు, జ్ఞానులు, తపస్సంపన్నులు, విరాగులు మొదలగు మహానుభావులనేకులు కలరు. వీరు కేవలము ఇతరులను ఆశీర్వదించగలరే కానీ భగవంతుని వలె దుష్టశిక్షణ శిష్టరక్షణ ధర్మసంస్థాపన చేయలేరు. భగవంతుడు కూడ ఇంద్రజాలము మరియు చమత్కారము చేయువాడే. ఈశ్వరుడు యొక్క శక్తి చేత ఉత్పన్నుడైన మానవుడు కూడ ఇంద్రజాలము, చమత్కారము చేయగలడు. పూర్వము కొంతమంది రాక్షసులు కూడ తపస్సు చేసి ఇంద్రజాల ప్రయోగము చేసెడి వారు. కావున ఈ విధముగ మంత్రతంత్రములతో ఇంద్రజాలము చేే వారిని సిద్ధిపురుషులని చెప్పవచ్చునే గాని ఈశ్వరులు అని అనరాదు.
spidereddy Posted December 15, 2014 Report Posted December 15, 2014 papam piscop maaya ...........whosdadnolisten ayipoyadu......... true that
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఇంట్లో పెద్దలకు, దేవాలయంలో దేవునికి ఏవిధంగా నమస్కారం చెయ్యాలి? ఇంట్లో పెద్దవాళ్ళకి ఒకసారి మన పేరు మొదలైన వివరాలు చెప్పి నమస్కరించాలి. పెద్దవారు కూడా నమస్కారం చేసిన పిన్నలను ఆశీర్వదించవలసి వున్నది. శివాలయంలో నందీశ్వరునికి బయటనే నమస్కారం చేయాలి. స్త్రీలు మూడుసార్లు పంచాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగం అంటే లలాటం, రెండు కళ్ళు, రెండు భుజాలు, రెండు మోకాళ్ళు, రెండు పాదలు, భుజాలనుండి నడిము వరకు గల భాగాలు. ఈ శరీర భాగాలనీ భూమిని తాకునట్లుగ వంగి నస్కారం చేయాలి. పంచాంగం అంటే లలాటం, రెండు మోకాళ్ళు, రెండు పాదాలు, ఇవి గాక మిగిలిన శరీరభాగాలు ఏవీ భూమిని తాకకూడదు. దేవుని వద్ద నమస్కారం చేస్తున్నప్పుడు మన పేరు వివరాలు చెప్పనవసరం లేద్. మనం చేసిన తప్పులు మన్నించమని కోరుతూ నమస్కరించాలి. సన్యాసులకు స్త్రీలు, పురుషులు అందరు నాలుగుసార్లు నమస్కారం చేయాలి. మన పేరు, వివరాలు చెప్పనవసరం లేదు. ఓం నమో నారాయణాయ అని చెప్పి నమస్కరించాలి. సన్యాసులు కూడా నమస్కారం స్వీకరిస్తూ నారాయణ అని చెప్పి ఆశీర్వదించవలసి ఉన్నది.
Recommended Posts