Jump to content

Recommended Posts

Posted

10377532_670029469713121_872380111297963

 

ఇతర మతములలో గ్రంధములను ఒక్కొక్క గ్రంధమును ఒక్కొక్క మహాపురుషుడే రచించెను. ఆ ధర్మ గ్రంధములలో భగవంతునియొక్క నిర్గుణ స్వరూపము చెప్పబడినది. కానీ హిందూ ధర్మ గ్రంథములు ఏ ఒక్క మహాపురుషుని రనలు కావు. అనాది కాలమునుండి వేద పరంపర ద్వారా వచ్చుచున్నది. ఇందులో ఏ ఒక్క వ్యక్తియొక్క బుద్ధితో పనిలేదు. కాబట్టి దీనిలో తొట్రుపాటు ఉండదు. కానీ అదే ఒక మహాపురుషుని బుద్ధిపై ఆధారపడినపుడు పొరపాటునకు అవకాశము కలదు. ఇతర మతములలో నిర్గుణ స్వరూపమును మాత్రమే వివరించియున్నాు. అట్లయిన ఎవరికి మందిరము? ఎవరని ధ్యానించవలెను? ఎట్లు చేయవలెను? ఎవరికి పూజ మొదలగునవి చేయవలెను. వాటికి సమాధానముండదు. అందుకని హిందూధర్మము సగుణ నిర్గుణ స్వరూపములు రెంటిని సాధనములుగా స్వీకరించినది. కావున ఇచ్చట లక్ష్యమైనట్టి నిర్గుణమును లక్షణమైన సగుణము తెలుపుతున్నది. మధుర పదార్ధమైన కలకండ యొక్క ఉనికి, సత్తద్వారా గ్రాహ్యము కాని దాని రుచి, ఆస్వాదము వలననే అనుభవమగును. ఈ విధముగనే సగుణ స్వరూపమును కనులతో చూచుచు ధ్యాన పూజాదికములు చేయుచు మనోమందిరమునందు విగ్రహమును ప్రతిష్ఠించుకొని నిర్గుణమైన భగవంతుని స్వరూపమును ఆనందించవలెను. మిగితా మతస్తులు దేవునియొక్క నిర్గుణ స్వరూపమును సర్వవ్యాపకముగ చెప్పుచున్నారు. కానీ భగవంతునికి నిజమైన స్థానమును తెలుపలేదు. హిందూధర్మములో సర్వవ్యాపియైన భగవంతునికి సర్వత్ర స్థానము కలదని చెప్పుదురు. ఒకే బంగారమును వివిధములైన ఆభరణములుగా మార్చవచ్చు. దాని వలన వాటి రూపములో మార్పుండును, గాని బంగారము మార్పు చెందదు. ఇదేవిధముగ నిర్గుణ స్వరూపమైన భగవంతుడు వివిధములైన సగుణాకారములను పొందును. కాని తత్త్వము మారదు.

Posted
10402095_670420446340690_692976029401821
 
హిందూ ధర్మము ఎవరిచేతను ఆరంభింపబడలేదు. ఇది అనాదికాలమునుండి వచ్చుచున్నది.
ఒకనదియొడ్డున ఒక ఆశ్రమము ఉన్నది. ఆ ఆశ్రమమునకు చేరుటకు రెండు మూడు మార్గములున్నవి. వాటిలో ఒకటి ముఖ్యమైన మార్గము రెండవది మధ్యరకము. మూడవది కాలినడకలో పోవుదారి. ఈ మూడవ దారికంటే మొదటి రెండు మార్గములు ఇరుకుగా ఉండడం వలన, మరియు చేరుటకై సమయము ఎక్కువ అవటము వలన అప్పుడప్పుడు కొన్న దుర్ఘటనలు జరిగే ప్రమాదము ఉన్నది. కానీ కాలినడకతో పోయే మార్గము సులభమైనది. ఎటువంటి దుర్ఘటనలు జరగనిది. హిందూ ధర్మము కూడా ఇటువంటిదే. ఈ హిందూ ధర్మమార్గమును అనుసరించినచో ఎటువంటి దుర్ఘటనలు జరుగవు. పైన చెప్పిన మిగతా రెండు మార్గములు ఇరుకుగా వుండుట వలన అప్పుడప్పుడు తొందరగా చెడిపోవును. వానిని బాగుచేయుట అధిక సమయముతో కూడిన పని. కాని కాలినడకతో పోయే మార్గము చెడిపోదు. దానికి వ్యయము అవసరము లేదు. అది నడకవలన ఇమ్కను బాగుపడును. ఈ విధముగా హిమ్దూ ధర్మము కూడా వ్యయముతో కూడినది కాదు. ఎంతవరకు ఆచార వ్యవహారములుండునో అంతే ప్రచారముండును. కావున ఈ ధర్మము ఎవరిచేత ఆరంభించబడలేదు. ఇది అనాదినుండి వచ్చుచున్నది.
×
×
  • Create New...