Jump to content

Recommended Posts

Posted

10523917_671775036205231_436997457699932

 

మనిషి మృత్యువు తరువాత ఎక్కడికి పొవును?
మనిషి మృత్యువు తరువాత తన కర్మననుసరిమ్చి పరలోకమునకు పోవును. ఏ మానవుడైతే విద్యాలయములు, అన్నసత్రములు, దేవాలయములు నిర్మించి దీనజనులకు సేవ చేయునో అతడు చంద్రలోకములో సుఖముగ ఉండును. మరియు ఏ మానవుడైతే వాజపేయ సోమయాగాది హవనములు చేయునో అతడు స్వర్గలోకములో సుఖము పొందును. ఈ రెండు విధములైన మానవులు పరలోకములో కొంతకాలము సుఖముగా ఉండి మరల భూలోకమున జన్మింతురు. కానీ ఎవరైతే సగుణ బ్రహ్మ ఉపాసన చేయుదురో వారు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మజ్ఞానమును పొంది అచ్చటనే ముక్తి పొందెదరు. ఇంతేకాకుండ పాపకర్మలనాచరించిన జనులు మరణానంతరము యమలోకమునందు పాపఫలములనుభవించి తిరిగి భూలోకముననే జన్మింతురు.

Posted

10599632_674144555968279_116294043426083

ఈశ్వరుడు నామరూపరహితుడైనను, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకై అనేక అవతారములు పొందును. కలియుగమున మనుషులయొక్క మనస్సు అతి దుర్బలమైనది. కావున వారు నిర్గుణ బ్రహ్మను ధ్యానించలేరు. అందువలననే తమ ధ్యానమును ఈశ్వరునిపై ఉంచవలెనన్న కోరికతో మనుష్యుడు ఈశ్వరుని సగుణ స్వరూపునిగ స్వీకరించెను. జలము విభిన్న రూపములో కనబడినను వాస్తవములో దాని రూపము ఒక్కటే. ఈ విధముగనే పరమాత్మ అనేక రూపములలో కనబడినను అతను ఒక్కడే. ఐస్ క్రీములో కూడా జలము వుంటుంది. జలము కేవలం త్రాగడానికే ఉపయోగపడుతుంది. కానీ ఐస్ క్రీమ్ అనేక విధములుగా ఉపయోగపడుతుంది. పిల్లలు దీనిని తినడానికి చాలా ఇష్టపడతారు. దీనికి ధర ూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ జలమునకు మూల్యము ఉండదు. ఈ విధముగనే నిర్గుణ పరమాత్మ జలరూపముతో సమానుడు. సగుణ పరమాత్మ ఐస్ క్రీమ్ తో సమానుడు. ఇక కలియుగములో కనపడుచున్న విభిన్న దేవతా రూపములు మిగతా యుగములలో కూడా లేకుండెడివి.

Posted

10610892_676814399034628_894058653540109

 

ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని గోళ్లుగా పెరుగుతాయి. కనుక వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పబడిన తిథులలో, వారాలలో సమయాలలో మాత్రమే తొలగించాలి. స్నానానికి పూర్వమే తొలగించాలి. గోళ్ళతో యే వస్తువును త్రుంచకూడదు. ఇంటిలోకాకుండా ఇంటిబయట తొలగించుకోవాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే వెంట్రుక. అలాగే గోళ్ళు కూడా. కనుక గోళ్ళు ఇంట్లో తీయడం దరిద్రం అని ఎందుకు అన్నారంటే దానిని తొక్కినా, అన్నంలో కలిసినా సమస్యలొస్తాయి. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుత్తును, గోళ్లను ఆశ్రయించి ఉంటాయి. కనుక వీటిని తొలగించడానికి ఇంత నేర్పరితనం కావాలి. గోళ్ళను పెంచుకోకూడదు. దీనికి ఒక కథ ఉంది వేదంలో. పాపాలన్నీ సూర్యుడి దగ్గరికి పోయాయి. మీరు నాదగ్గర ఉండకూడదు తిరిగిపోండి అన్నాడాయన. ఎక్కడికి పోవాలి? అని ఆ పాపాలు సూర్యుడిని అడిగితే గోళ్ళను ఆశ్రయించండి అన్నాడట. దీనిని

Posted

10600585_677276735655061_617308082326575

తథాస్తు దేవతలు అంటారు. నిజమేనా? తెలియజేయగలరు

తథా - ఆ ప్రకారంగా; అస్తు - కావలసినదే. అనేవాళ్ళు ఉంటారు. ఎలా అంటారు ఈ మాట మీరు అంటే ముహూర్తం అనేదాన్ని విశ్వసిద్దాం ముందు. ముహూర్తబలం అంటారు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఉప్పు -నిప్పు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్లు ప్రేమ ఆప్యాయతలు తవ్వి పోసుకుంటారు. అది ఆధునికపరమైన వివాహసంబంధాలవైపు దారితీయవచ్చును. లేదా మిత్రత్వానికి దారితీయవచ్చును. ఇదంతా ఎలా వచ్చింది? ఆ చూసుకున్న నిమిషం వేళా విశేషం. అలాగే నిత్యమూ జపం చేసేటటువంటి వాళ్ళు పూజావిధానాలలో ఏదో ఒక లక్ష్యంతో నియమశుద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు. వాళ్ళు అన్నమాట నిజం అయి తీరుతుంది. దేవతలు అంటే పైన వాహనాలలో తిరుగుతూ ఎవరైనా ఏమైనా అంటాడా, తథాస్తు అందాం లాగా కాదు. సినిమాలు, సీరియళ్ళు చూసి ఇలాంటి భావనలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య. మనస్సులోనే ఉంటుంది దేవత. మన మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అదే తథాస్తు. పిల్లలే ఉన్నారు. నిర్లక్ష్యంగా మాట్లాడింది తండ్రితో. ఆ తండ్రి చాలా జపం చేసేవాడు, యోగ్యుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఇలాగైతే...అని ఏదైనా అన్నాడనుకోండి, జరిగి తీరుతుంది. తథాస్తు దేవతలు అంటే ఎక్కడో ఉండేవారు కాదు. ఆ వ్యక్తులలో ఉండే సంకల్ప శక్తి, దానికున్న బలం - దానిపేరే తథాస్తు. కాబట్టి ఏది మాట్లాడాలన్నా, ఎలా మాట్లాడాలన్నా అవ్యాచ్యములు మాట్లాడకూడదు. ఎదుటివ్యక్తికి కష్టం కలిగించే మాట్లాడకూడదు. అందరూ కూడా ఎదుటివాడికి కష్టం కలుగకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తథాస్తు దేవతలు ఉన్నారు అన్న భయంతోనైనా సవ్యంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తథాస్తు దేవతలు ఉంటారు. మన మనస్సులోనే ఉంటారు.

Posted
 
10516727_679224642126937_227819998287825
నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?
ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.
నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్తక్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ సత్యదూరాలు. ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు. ఇంటిలోనుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవదర్శనం చేసి ఇంటికి రావాలి. అంతేకానీ దేవతారాధన చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోకూడదు. లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్యదూరము. అది మంచి పద్ధతి కాదు. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది. అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా! ప్రయోజనమేమున్నది? కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు. ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి. అంతే. ఈ కార్యక్రమం మళ్ళీమళ్ళీ లేదు. ఆలయంనుంచి నేరుగా ఇంటికే రావాలి. ఎవరింటికీ వెళ్ళకూడదు, ఇంక యేపనీ చేయకూడదు.
Posted
10592744_679619428754125_830125529665837
 
నివేదనము అన్నమాట పర్యాయపదమే నైవేద్యము. సాధారణంగా నైవేద్యం అనేది చేయకుండా ఉండము. పంచోపచారములు ఇంట్లో తప్పకుండా జరగాలి. గంధపుష్పధూపదీప నైవేద్యములు. ఈ అయిదు జరగకపోతే అది కృతఘ్నతతో కూడిన గృహంగా గుర్తిస్తారు. గంధం ఈశ్వరుడికి అలంకరించాలి. పువ్వు వేయాలి లేకపోతే అక్షతలైనా వేయాలి. ధూపం (అగరుబత్తి)వేయాలి. దీపం పెట్టాలి. నైవేద్యం పెట్టాలి. ఆయనే మనల్ని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్ధితో పూజ చేయాలి. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. మన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. సత్త్వగుణంతో చేస్తున్నారు కాబట్టి సాత్త్విక పదార్థాలు నైవేద్యం చేస్తారు. మధురపదార్థములు, పండ్లు వంటివి నైవేద్యం పెడతారు. నివేదన అను మాట కేవలం పూజలో ఒక భాగముగా మాత్రమే కాదు. అది జీవితమే నివేదనగా మారిపోవాలి. ఎలా? ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావనకాదు. భగవంతుడు విగ్రహంగా ఉన్నాడని గుర్తించాలి. వాడు పిల్లవాడు కాదు. నా మనవడు పిల్లవాడిగా ఉన్నాడు. ఈ పిల్లవాడు నా మనవడు. అప్పుడు కదూ ప్రేమ. విగ్రహం కాదు పరమేశ్వరుడు ఆ రూపంలో అక్కడ కూర్చున్నాడు. నివేదన అంటే నా కష్టం, నా సుఖం, నాభావాలు అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి. అందుకే నివేదన రెండు క్రింద వెళ్ళిపోతుంది జీవితంలో ౧. నాకు తోడ్పడమని అడుగుతూంటాడు. ఈశ్వరా! నేను సాత్వికంగా ప్రవర్తించాలనుకుంటున్నాను. భక్తితో ఉండాలని ఉంది. ఎప్పుడూ ఎవరి జోలికీ వెళ్ళకూడదు. గురువుగారు చెప్పిన మాటలు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని కోరిక ఉంది. కానీ మనసు అటూ ఇటూ లాగేస్తోంది. స్వార్థంవైపుకి లాగేస్తోంది. కాబట్టి నా మనస్సు నిలకడగా నిలబడేటట్లు ధార్మికంగా బ్రతికేటట్లు నన్ను అనుగ్రహించండి. తన కష్టసుఖాలు ఇలా ఈశ్వరుడితో చెప్పుకోవడం నివేదన. అలా చెప్పుకోవడం వచ్చిందనుకోండి అనుబంధం ఒకటి యేర్పడుతుంది మీకు."భావనామాత్ర సంతుష్టాయై నమోనమః". లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి మా ఇంట్లో ఉన్నారు. పరీక్షల ముందు ఈశ్వరుడు, ర్యాంకు వచ్చినప్పుడు బావమరిది..ఏమి భక్తి? నివేదన అనగా ఆయన ముందు గుర్తు వచ్చుట. కష్టమునందు, సుఖమునందూ కూడా. అన్నీ ఆయనతో పంచుకోవడం అలవాటైపోయింది. అప్పుడు భక్తి పూజగదికి పరిమితం కాదు. విశ్వవ్యాప్తం అయింది. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఒకవేళ అనుకున్న పని జరుగకపోయినా బెంగపెట్టుకోడు. ఈశ్వరా ఎందుకలా చేశావో? అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట. జరగకుండా చేశావు ధన్యుడిని. ఒక ఉదాహరణ చెప్తాను. తెలిసిన వారందరూ ఒక పెళ్ళికి వెళ్ళారు. ఒకాయనమాత్రం ఏమండీ నాకు చాలా తెలుసున్నాయన. కానీ పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను. పొద్దున్నే వెళ్ళి యేదో అభినందించేసి వచ్చాను. ఏం చేస్తాను? అకస్మాత్ ప్రయాణం వచ్చింది. అని బెంగపెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరూ భోజనం చేశారు. ఎలా జరిగిందో ఆహారంలో విషం కలిసింది. అందరినీ హాస్పిటలైజ్ చేసేశారు కన్యాదాతలు, మగ పెళ్ళివారితో కలిపి. ఈయన రైలెక్కిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు. ఆ అన్నం తినకముందు బాధపడ్డాడు పెళ్ళికి ఉండడం లేదు అని. ఈ విషయం ఫోన్లో విని ఈశ్వరుడు ఎంతటి అదృష్టమిచ్చాడండీ నాకు. ఇది అప్పుడే జరిగి ఉంటే అక్కడే పడిపోయి ఉంటే ఎంత ముఖ్యమైన పనిమీద వెళ్ళాలి? ఏమైపోను నా జీవితం అన్నాడు. అది జరగనప్పుడు తెలియలేదు ఎందుకు జరగలేదో. కానీ జరగకుండా ఉన్నది ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారం చేస్తావు. అన్ని వేళలా తెలియాలని యేమీ నియమం లేదు. అందుకే "ప్రధమో వైద్యో భిషక్’- ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు. మనం జబ్బు ఒక్కటే చెప్తాం. డాక్టర్ గారు మందిస్తారు. మాట్లాడకుండా వేసుకోవాలి. కాదని ఎదురు ప్రశ్నిస్తే ఇక్కడినుంచిఫో అంటాడు. భగవంతుడు కూడా అంతే. ఆయనని నమ్ము నువ్వు ఉపద్రవాలలో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఏదో కష్టం వచ్చింది. వెనక ఏదో ఉంది ఈశ్వరుడి ఆలోచన. యేదో కారణం లేకుండా ఆయన యేదీ చేయడు. కాబట్టి అందులో కూడా నీపట్ల అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటికి వస్తుంది. అప్పుడు సంతోషిస్తావు. ొందరపడి ఈశ్వరుని నిందచేయకు. పట్టుకెళ్ళి యాపిల్ పండో, అరటిపండో పెట్టడంతో సరిపోదు. ఎప్పుడూ వాడు నా ప్రక్కనున్నాడు అనుకోవాలి. అందుకే సఖ్యభక్తి అని నవవిధ భక్తులలో ఒక భక్తి. నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు. జీవితంలో అన్ని విషయములయందు విస్తరించాలి. చిట్టచివరికి జీవితమే నివేదన. జీవితమంతా ఈశ్వరుడితో సమన్వయం. ఈశ్వర ప్రోక్తము, విహితము; ఈశ్వరుడు చెప్పనిది నిషిద్ధము. అదే నివేదన. కాబట్టి నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు. జీవితమునందు విస్తరించవలసినటువంటి విషయం.
×
×
  • Create New...