psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 మనిషికి జ్ఞానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడు గీతలో చెప్పాడు “న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” అని. జ్ఞానానికంటే పవిత్రమైనది మరొకటి లేదు అని. కనుక మనిషికి అత్యావశ్యకమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురువువల్ల మాత్రమే పొందడానికి వీలు అవుతుంది. అందువల్లనే జ్ఞానోపదేశం చేసి శిష్యుణ్ణి సంసారాంబుధి నుండి తరింపజేయగలిగినటువంటి వాడు గనుక గురువుకు అత్యంత ప్రాధాన్యం శాస్త్రంలో చెప్పబడింది.గురువును ఆశ్రయించే విధానం ఏమిటి అంటే దానికి కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. “తద్విద్ధి ప్రణిపాతేణ పరిప్రశ్నేన సేవాయా! ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః” – గురువు సన్నిధిలో పునీతుడవై గురువుయొక్క సేవలొనర్చి, గురువుకు నమస్కరించి, గురువుగారి సన్నిధిలో నీయొక్క సందేహాన్ని వెలిబుచ్చి వారివల్ల నీ సందేహములను పరిష్కరించుకోవలసినది. ఆ గురువుయొక్క అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. దానివల్ల నీవు శ్రేయస్సు పొందుతావు అని భగవంతుడు చెప్పాడు. శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుంచి
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 ఈశ్వరుడు నామరూపరహితుడైనను దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకై అనేక అవతారములను పొందుతాడు. కలియుగమున మనుష్యుల యొక్క మనస్సు అతి దుర్బలమైనది. కావున వారు నిర్గుణ బ్రహ్మను ధ్యానించలేరు. అందువలననే తన ధ్యానమును ఈశ్వరునిపై ఉంచవలెనాన్న కోరికతో మనుష్యుడు ఈశ్వరుని సగుణ స్వరూపునిగ స్వీకరించాడు. జలము విభిన్నరూపములో కనబడినా వాస్తవంలో దాని రూపము ఒక్కటే. ఈ విధముగనే పరమాత్మ అనేక రూపములలో కనబడినా అతను ఒక్కడే. ఐస్ క్రీంలో కూడా జలము వుంటుంది. జలము కేవలం త్రాగడానికే ఉపయోగపడుతుంది. పిల్లలు దీనిని తినడానికి చాలా ఇష్టపడతారు. దీనికి ధరకూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ జలమునకు మూల్యం వుండదు. ఈవిధముగనే నిర్గుణ పరమాత్మ జలరూపంతో సమానుడు. సగుణ పరమాత్మ ఐస్ క్రీంటో సమానుడు. ఇక కలియుగములో కనబడుతున్న విభిన్న దేవతారూపాలు మిగతా యుగాలలో కూడా ఉండేవి కాదు.
psycopk Posted December 15, 2014 Author Report Posted December 15, 2014 దేవుడి పేరు చెప్పి రాయిమీదపాలు, పెరుగు, నెయ్యి, పటికబెల్లం, తేనె వంటి పదార్థాలను పోస్తున్నారు. ఇదేమైనా అర్థమున్న పనేనా? ఇలా చేసి సాధించే ఉపయోగమేమిటి? దీనిని అభిషేకం అంటారు. ఇది ఓ విశిష్టమైన ప్రక్రియ. హిందూధర్మంలో దేవుడి పేరు చెపి, ఆచరిస్తున్న ప్రతికార్యమూ మనిషి ఉన్నతికోసమే. అందులో భాగమే ఈ అభిషేక ప్రక్రియ కూడా. దేశీయమైన ఆవుపాలలో అద్భుతమైన శక్తి ఉంది. అలాగే, పెరుగులో, నెయ్యిలో, పుష్పాల సారంగా లభించిన మకరందమైన తేనెలో, భూసారాన్ని నింపుకున్న పటికబెల్లంలో ఇలా వీటన్నింటినీ నిర్ణీత పాళ్ళలో కలిపితే పంచామృతం తయారౌతుంది. దీనిని అమృతం అని ఊరికేనే అనలేదు. అందులో విశేష శక్తి దాగుంది. పరమాత్మ అమృత స్వరూపుడు. ఆయనకు ప్రత్యేకించి ఈ ఔషధీకృతమైన పంచామృతాలు అవసరం లేదు. ఈ ఔషధం మన హితం కోరి, ఏర్పాటు చేసుకున్నదే. స్ఫటికం కేవలం రాయి కాదు. అందులో ఎన్నో విలువలున్నాయి. స్ఫటిక స్పర్శతో పంచామృత శక్తి ద్విగుణీకృతమౌతుంది. ఇలా స్ఫటిక శక్తి, పంచామృతంలోని ఔషధ విలువలు, మంత్ర ఉచ్ఛారణ, దైవచింతన – ఇవన్నీ కలిపి శరీరంపై, మనసుపై, బుద్ధిపై ప్రభావం చూపుతాయి. ఇది శరీరంలో సప్త ధాతువులను పరిపుష్టి చేస్తుంది. మనసులోని కాలుష్యాన్ని నివారిస్తుంది. బుద్ధిలో జడత్వం తొలగుతుంది. ఇన్ని కార్యాలను నిర్వహించడంలో ‘తీర్థం’ విశేషమైన ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు పూర్వీకులు. దానినే శ్రద్ధతో ఆచరించి, తరించమంటోంది మన భారతీయత.
Recommended Posts