Jump to content

Recommended Posts

Posted
10262215_636121589770576_590586177115884
 
కన్నప్ప శివుడికి మాంసాన్ని అర్పించాడనీ, శబరి రాముడికి ఎంగిలి పండ్లను తినిపించిందనీ వారి భక్తితోమన భక్తిని పోల్చుకునే ముందు, భక్తుడిగా ప్రస్తుతం మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడం అవసరం. శ్రీరామకృష్ణులు భగవంతుని పట్ల భక్తునికి ఉన్న ప్రేమ మూడు విధాలు అని వివరించారు:
౧. సమర్థ ప్రేమ: భక్తుడు కేవలం భగవంతుడి ప్రీతిని మాత్రమే కాంక్షించే స్థితి.
౨. సమంజస ప్రేమ: భగవంతునికి ప్రీతికరమైనది చేస్తూ, భక్తుడు తన సుఖాన్ని కూడా కాంక్షించే స్థితి.
౩. సాధారణ ప్రేమ: భక్తుడు కేవలం తన సుఖాన్ని మాత్రమే కాంక్షించే స్థితి.
కన్నప్ప పరమశివుడికి మాంసాన్ని అర్పించాడు. నిజమే! కానీ శివుడికంటి నుండి రక్తం కారుతూండడం చూసిన కన్నప్ప, తన ఇష్టదైవం బాధను చూసి తన కన్ను పెకిలించి ఇచ్చాడన్న సంగతి కూడా మనం మరచిపోకూడదు. భగవంతుని ప్రీత్యర్థం దేనినైనా అర్పించగల ’సమర్థప్రేమ’ కన్నప్పది. అలాంటి ఉత్తమ కోవకు చెందిన భక్తుల ఆహారవ్యవహారాలను సామాన్య భక్తులు అనుసరించడం సముచితం కాదు. మనం కూడా ఆ స్థితికి చేరుకోవాలంటే ముందు మన మనస్సులోని విషయ వాంఛలను ప్రారద్రోలి, మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. భగవంతుడే తప్ప అన్యమేదీ అవసరం లేదన్న స్థితికి చేరుకోవాలి.
జన్మతః అలవడే ఆహారపుటలవాట్లను హఠాత్తుగా మార్చుకోవడం అంత సులభం కాదు. అందుకే మనం భుజించే ఆహారాన్ని ముందుగా భగవంతునికి అర్పించి, స్వీకరించాలన్నది సనాతన ధర్మం. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గరకు సురేంద్రనాథ్ మిత్రా అనే ఒక భక్తుడు వస్తూండేవాడు. అతడికి మద్యం త్రాగే అలవాతు ఉండేది. ఆ అలవాటునుండి బయటపడే మార్గాన్ని సూచించాల్సిందిగా శ్రీరామకృష్ణులను అర్థించాడు. ’నువ్వు మద్యం తీసుకునే ముందు, దాన్ని కాళీమాతకు నైవేద్యంగా అర్పించి పుచ్చుకో’ అని శ్రీరామకృష్ణులు సలహా ఇచ్చారు. అప్పటినుండి సురేంద్రనాథ్ మద్యాన్ని కాళీమాతకు అర్పించిన తర్వాతే త్రాగేవాడు. మద్యాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మనస్సు పరిశుద్ధమై అతనిలో భక్తి భావం అధికమైంది. భగవంతుణ్ణి పూజిస్తున్నప్పుడు కన్నీళ్ళు కారుస్తూ భావపరవశుడయ్యేవాడు. కొంతకాలానికి మద్యం త్రాగే అలవాటు అప్రయత్నంగానే పోయింది.
భగవంతునికి అర్పించిన నైవేద్యం పవిత్రమవుతుంది. అలా పవిత్రమైన ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల విషయ వాంఛలు పోయి, మనస్సు పరిశుద్ధమవుతుంది. అప్పుడు మనలో క్రమేణా భగవంతుని పట్ల ’సమర్థప్రేమ’ అలవడుతుంది.
సాధనకు సత్త్వగుణ ప్రధానమైన మనస్సు అవసరం. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ "ఆయుస్స్త్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః" (భగవద్గీత-17.8) 'ఆయుర్దాయాన్నీ, చిత్తస్థైర్యాన్నీ, బలాన్నీ, ఆరోగ్యాన్నీ, మనస్సుకు ఆహ్లాదాన్నీ, ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాల’ని సూచించారు.
కేవలం ఆహారపుటలవాట్లకే ప్రాధాన్యమిస్తూ, మనస్సు మాత్రం విషయచిమ్తలపై ఉంటే అలాంటి ఆహారపు నియమాల వల్ల ఎలాంటి ప్రయోజనమూ చేకూరదు. అందుకే శ్రీరామకృష్ణులు ’హవిష్యాన్నం మాత్రమే తింటూ విషయ చింతనలను చేసేవాడి కన్నా, మాంసం తింటున్నప్పటికీ భగవచ్చిమ్తన చేసేవాడు ధన్యుడు’ అని తెలిపారు.
మనం శారీరక పుష్టికి ఎంత ప్రాధాన్యమిస్తామో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని మానసిక పుష్టికి ఇవ్వాలి. కాబట్టి శరీరానికి ఆకులు, కాయలు ఆహారంగా ఇస్తూ, మనస్సుకు మాత్రం చెడు భావాల్ని పెంచే సాహిత్యాన్నీ, సహవాసాల్నీ అందిస్తే ఆధ్యాత్మికంగా ఎలాంటి ఉన్నతినీ సాధించలేం.
మనం చేస్తున్ పూజా పునస్కారాలూ, స్తోత్ర పారాయణాలు, జపధ్యానాల వల్ల మనలో విషయాసక్తి తగ్గి, భగవంతుని పట్ల అనురక్తి పెరుగుతుందా? కష్టనష్టాల్లో భగవంతుడే సంరక్షకుడనే భావం స్థిరంా ఉందా? మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుందా? అన్నది మనం గమనించాల్సిన ముఖ్యాంశం. మనలో ఇలాంటి పరివర్తన కలిగిన నాడు సాధన మార్గంలో అభివృద్ధి చెందుతున్నామని అర్థం.
Posted

10273797_636905813025487_582451687040895

 

శ్రీకృష్ణుడు పాండవులకు అండగా ఉన్నప్పటికీ వారు అడవులపాలై అష్టకష్టాలను ఎందుకు అనుభవించారు?

ధర్మమే చివరికి గెలుస్తుందని మన వేద పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ధీరులైన వారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకంజ వేయరు. జీవితంలో సుఖం కన్నా దుఃఖమే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. భగవంతుడు సర్వులకూ చెందిన వాడు. అయినా అందరూ ఆయనలో లేరు. మనిషి సుఖంగా ఎలా జీవించాలో ధార్మిక సాహిత్యం చెబుతుంది.
వ్యసనాలకు లోనైతే భగవంతుడు అండగా ఉన్నా కష్టాలు పడవలసిందేనని తెలుపుతుంది పాండవుల కథ. ధర్మరాజు అంతటివాడు కూడా జూదంవల్ల సర్వం కోల్పోయి, అడవులకు వెళ్ళవలసి వచ్చింది. ఇక మనమెంత? ఈ విషయం తెలుసుకొని వ్యసనాలను వదిలిపెట్టాలి. వ్యసనాలతో సంపదలూ, సర్వం కోల్పోతున్నా వివేకజ్ఞానం లేక కష్టాలు పడతారు జనులు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పాండవులు అడవుల పాలైనా, వారు ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. వారు ధర్మపరులు కనుక, చివరకు దైవ సహాయంతో అధర్మంపై గెలిచి, సుఖసంతోషాలను పొందారు. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్నదే ముఖ్యం.
కష్టాలు కోతులలాంటివి. వాటికి భయపడితే మనం సర్వనాశనమవుతాం. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవలసిందని స్వామి వివేకానంద చెప్తారు. ఈ గుణపాఠాన్ని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఆత్మ విశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని, పాండవుల లాగా విజయం సాధించాలి. వేద, పురాణ ఇతిహాసాల సారాంశాన్ని మన జీవితానికి అన్వయించుకొని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లేకపోతే నష్టపోయేది మనమే! "సత్యమేవ జయతే" - ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది. అసత్యం, అబద్ధం, అధర్మం, గెలవవు. ఎల్లప్పుడూ సత్యాన్ని అంటి పెట్టుకోవాల్సిందని శ్రీరామకృష్ణుల ఉవాచ. భగవద్ విశ్వాసంతో, శరణాగతితో మనం జీవితంలో విజయ సోపానాలను అధిరోహించాలి

Posted

10374937_643150182401050_869902560016054

 

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదు అనేది ఒక మూఢనమ్మకంగా ఏర్పడిందే కానీ ప్రామాణిక గ్రంథాలలో యే దేవతామూర్తిని యేవిధంగా అర్చించాలి అనే విశేషాంశాన్ని పరిశీలిస్తే మటుకు పాదాలనే పూజించాలి అంటాయి ఆ గ్రంథాలన్నీ కూడా. విశేషించి పాదాలే పూజచేయడం శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించే సమయంలో మనం గమనిస్తూంటాం. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు కదా! అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో పృథివ్యాపస్తేజోవాయురాకాశములు అయిన పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడవపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి. "భగవంతు వలగొను పదములు పదములు" అంటారు పోతనామాత్యులు. కనుక శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో పాదములను ఆశ్రయించాలి. అమ్మవారికి మాత్రం పాదములకు పూజించరాదు అనే ఒక కొత్తగా కనుక్కున్నారు. నిజానికి పరమేశ్వరి - పరమేశ్వరుడు, లక్ష్మీదేవి - శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు అర్చించవచ్చును. కొల్హాపురంలో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతాడు. మనం తలవంచి నమస్కారం చేస్తాం. ఆ శఠారి (శఠం అంటే మనలో ఉండే మొండితనం - దానిని తొలగించేవి పరమాత్ముని యొక్క పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి. ఇది గమనించాలి. పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఆయనను మనం దర్శించగలిగే స్థితి ఎక్కడ? అంటే పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా సర్వాంములు నమస్కరించవలసిందే. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఒక్కసారి పరిశీలించినా చంచలాయై నమః - పాదౌపూజయామి, ఇలా సర్వాంగాలనూ పూజ చేస్తాం కదా! మరి పాదాలు పూజ చేయకుండా ఎలా? మొట్టమొదటి నామమే చంచలాయై నమః - పాదౌపూజయామి. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పాదములను తప్పకుండా పూజించవచ్చు.

Posted

10325284_643995885649813_530913795526405

 

ప్రయాగలో కోట సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి వారు నేలపైన పడుకొని ఉంటారు. విశాలమైన స్వరూపం. ఆ స్వామి పాదాలక్రింద రాక్షస స్వరూపంగా ఒక పెద్ద శిల నిర్మితమై ఉంటుంది. అ స్వామిని లేచి నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆలయం కూలిపోయిందిట. అందుకని స్వామిని అలాగే పరుండబెట్టి సింధూరంతో అలంకరించి ఈనాటికీ అర్చన చేస్తున్నారు. ఆంజనేయస్వామి పాదాలక్రింద శనైశ్వరుడు ఉన్నాడు అనే కథ జానపదులు వర్ణించినటువంటిది. శ్రీమద్రామాయణంలో సుందరకాండలోని వృత్తాంతాలలోని కథ ఇది. సీతాన్వేషణకు వెళ్ళే ఆంజనేయస్వామి వారు లంకానగరంలోనికి ప్రవేశించి లంకిణిని నిర్జించిన పిమ్మట అంతఃపురంలో ఉండే అనేక గదులలో సీతాదేవికోసమై అన్వేషణ చేస్తున్నాడు. అలా ఉండగా ఒక గది తలుపును మూసివేసినట్లుగా ఆంజనేయస్వామి వారు గమనించారు. ఈ గది తలుపులు మూసి వేశాడు కనుక సీతాదేవిని రావణాసురుడు ఇందులోనే బంధించి ఉంటాడు అనుకొని గది తలుపులు తెరిచి చూశాడట. తెరవగానే ఒక్కసారిగా ఆ గదిలోనుంచి ఎన్నో యేళ్ళుగా ఒక్కడై దిగులుతో బాధపడుతున్నటువంటి శనైశ్వరుడు ఒక్కసారిగా బయటికి వచ్చాడు. ఆంజనేయస్వామి వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామీ! మీవలన నాకు విముక్తి కలిగింది అని నమస్కరించాడు. ఆంజనేయస్వామి వారు ఎవరు నీవు? అని ప్రశ్నించగా "నేను శనైశ్వరుడను, నా దృష్టి ఈ లంకా నగరం పడకూడదని రావణుడు నన్ను ఈ గదిలో బంధించాడు. నీవల్ల నాకు విముక్తి కలిగింది." అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు. లంకానగరానికి పతనం ఆరంభమైన నిమిషంగా చెప్తారు దీనిని.
అందరినీ బాధించేటటువంటి వాడనైన నేను ఈ ఆంజనేయ స్వామి వారిని బాధించలేనా? అనుకున్నాడట. శనైశ్వరుని ఆంజనేయ స్వామి తన పాదముల క్రింద తొక్కి పెట్టి ఉంచాడు అని ఇంకొక కథ చెప్తూంటారు. ఏం చెప్పినా ఆంజనేయస్వామి వారికి నమస్కరించే సమయంలో ఆయన రుద్రాంశ సంభూతుడు. నమస్కరించినంత మాత్రాన ఆయన పాదముల క్రింద అణచబడి యున్నటువంటి శనైశ్వరుడు మనకేదో కీడు కలిగిస్తాడు అనుకోవడం అసత్యం, అవివేకం అని చెప్పుకోవాలి. మనకు ఎటువంటి కీడూ రాకుండా శనైశ్వరుడిని తన పాదాల క్రింద అణచిపెట్టేంత అమిత పరాక్రమవంతుడైన ఆ ఆంజనేయుడు మనం నమస్కరించగానే ఆయన పాదములనుంచి తప్పించుకొని వచ్చి మనల్ని ఆశ్రయిస్తాడా? పట్టుకుంటాడా? కాబట్టి అటువంటి సందేహమే అవసరం లేదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మిగిలిన వారంతా తప్పకుండా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే.

Posted

10389678_644926392223429_883019249605970

 

గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి?
గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.
కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిల్లోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందువారిని దాటుకుంతూ దైవదర్శనం చేసుకోరాదు. దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమప్రక్కగా, ఆవునేతి దీపమైతే కుడివైపు వెలిగించాలి.

Posted

10433781_645455042170564_603329794871785

 

గృహస్థ జీవనం గడుపుతూనే భగవత్సాక్షాత్కారం పొందగలమా?
పొందవచ్చు. అందుకోసం హృదయంలో ఉన్న మాలిన్యాన్నంతా భక్తితో కడిగివేయాలి. భగవద్దర్శనానికై పరితపించాలి. మానవ హృదయం మలినంతో కూడిన సూదిలాంటిది. దీన్ని వ్యాకుల చిత్తంతో, భక్తి అనే కన్నీటితో శుభ్రంగా కడిగితే, అప్పుడు భగవంతుడనే సూదంటురాయితో ఆకర్షితమవుతుంది. సూదిని అంటిన బురదే - ద్వేషం, అత్యాశ, ఐహిక సుఖాలపై వ్యామోహం మొదలైనవి. సదా భగవద్ధ్యానం, సాధు సాంగత్యం, భగవంతునికై తపన మొదలైనవి హృదయాన్ని పరిపక్వం చేస్తాయి. పరిపక్వమైన హృదయం మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలుగుతుంది. ఈ ప్రక్రియ కష్టసాధ్యం మాత్రమే కాదు, సుదీర్థమైనది కూడా! అనేక జన్మలు ఈ సాధన చేయాల్సి వస్తుంది. గురు కటాక్షంతో సమయం కొంత తగ్గవచ్చు. జనకమహారాజులాంటి వారు సదా భగవద్ధ్యానంలో ఉంటూనే రాజ్యపాలన చేశారు. నాట్యగత్తెలు తలపై రకరకాల పాత్రలు ధరించి నాట్యం చేస్తారు. గ్రామాలలో మహిళలు నీటికుండలు తలపై పెట్టుకొని చేతులు తిప్పుకుంటూ, నవ్వుతూ, తుళ్ళుతూ, కబుర్లు చెప్పుకుంటూ మైళ్ళ కొద్దీ నడుస్తూ ఇళ్ళకు చేరుకుంటారు.

Posted

10257919_645833785466023_919280188830179

 

స్ఫటిక మాల అందరూ వేసుకోవచ్చా? యతులే వేసుకోవలా?
నిజమైన స్ఫటిక మాలలు వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయంటారు. స్ఫటికమాల అందరూ ధరించవచ్చు.
వైష్ణవులు తులసిమాలల్నీ, శైవులు రుద్రాక్ష, స్ఫటికమాలలను వేసుకుంటారు. ఎవరైనాఫలా పుస్తకంలో, స్మృతిలో స్ఫటికమాలలు ధరించకూడదని ఉందంే ఆ స్మృతి ఆ కాలంలోనే వర్తిస్తుంది.
పరాశర స్మృతి కలియుగంలో సన్యాసం అవసరం లేదు అంటుంది. కలియుగ అవతార పరిష్టులైన శ్రీరామకృష్ణ పరమహంస వేద ప్రమాణంగా స్వామి వివేకానందులను సన్యసించమని బోధించారు. స్మృతులకూ, శృతులకూ భేదం వస్తే శృతి ప్రమాణంగా స్వీకరిమ్చాలని స్వామి వివేకానంద ఉవాచ. ఆది శంకరాచార్యుల అభిమతమూ ఇదే.

Posted

10347160_646238478758887_816818985887563

 

ఈశ్వరత్వం ఒక్క భగవంతునికే వుంటుంది. ఆరు ఐశ్వర్యాలున్న వానినే భగవంతుడు అంటారు. భగలు ఆరు వున్నాయి. అవి - ’ఐశ్వర్యస్య, సమగ్రస్య, ధర్మస్య, యశశ్శ్రియః జ్ఞాననైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా’. అనంతమైన ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యం ఉన్నవాడే భగవంతుడు. ఆయనకే ఈ విశ్వాన్ని నియంత్రించే శక్తి వుంది.
ప్రతివ్యక్తిలోనూ దివ్యత్వం గర్భితంగా వుంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. అందుకు కర్మయోగం, భక్తియోగం, రాజయోగం, జ్ఞానయోగాలను అభ్యసించాలి. తన కంఠంపైనే వున్న నెక్లెస్ మరచిపోయి అంతా వెదికినట్లు తాను పంచకోశ విలక్షణమైన ఆత్మనని మరచిపోయి బయట వెదకడాన్ని ’కంఠజామీకరణ న్యాయం’ అంటారు. వివేక వైరాగ్యాలు వుండి, స్వర్గాదిలోకాలను తిరస్కరించి, శమాదిషట్ సంపత్తి తీవ్ర ముముక్షుత్వం ఉంటే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.అప్పుడే మానవుడు విశ్వనియంత్రణ శక్తిలేకపోయినా మాధవుడవుతాడు.

×
×
  • Create New...