Jump to content

Recommended Posts

Posted
 
చిలుకూరుకు కోట్ల రూపాయలు బాకీపడిన తిరుమల: సౌందర్ రాజన్     03:43 PM
చిలుకూరు బాలాజీ ఆలయానికి రూ.1000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు టీటీడీ, ఇతర ఆలయాల నుంచి రావలసి ఉంది. ఈ విషయాన్ని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర్ రాజన్ తెలంగాణ ప్రభుత్వానికి తెలిపారు. నేటి ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసిన ఆయన విషయాన్ని వివరించారు. ఇతర ఆలయాల నుంచి రావలసిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అందుకు రాజీవ్ శర్మ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

 

×
×
  • Create New...