Jump to content

Guys Ur Expectations Of Jharkand And J & K Elections :)


Recommended Posts

Posted
జమ్మూ కాశ్మీర్ లో పీడీపీకే అవకాశాలు      08:03 PM
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై సీ ఓటర్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, అధికారం చేపట్టాలంటే కనీసం 44 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఐదు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబా ముఫ్తీ సారధ్యంలోని పీడీపీ 32 నుంచి 38 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

తరువాతి స్థానంలో 27 నుంచి 33 స్థానాలు గెలుచుకుని బీజేపీ రెండో అతిపెద్దపార్టీగా సత్తాచాటనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తాజాగా అధికార పక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 4 నుంచి 10 స్థానాలతో సరిపెట్టుకోగా, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 8 నుంచి 14 స్థానాలను గెలుచుకోనుంది. కాగా, జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఈనెల 23న వెల్లడి కానున్నాయి

 

×
×
  • Create New...