Jump to content

Recommended Posts

Posted

  నేడు వైఎస్ జగన్ జన్మదినం...పులివెందులలో ఘనంగా వేడుకలు    videoview.png 10:52 AM

వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో కార్యకర్తలు పలు కార్యక్రమాలను నిర్వహించారు. కడప ఎంపీ, జగన్ సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పులివెందులలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మండలంలోని లింగాలలో జగన్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అవినాశ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. మరోవైపు పులివెందుల మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ రుక్మిణీదేవీ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

×
×
  • Create New...