Jump to content

Top 3 Worst Mvies Of 2013


Recommended Posts

Posted
download.jpg?w=538
 
క్రికెట్ కి టెండూల్కర్ టాప్ అయితే చెత్త సినిమా లకి మెహెర్ రమేష్ టాప్. ఆయన బరి  లో ఉంటె అందరు సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకోవాల్సిందే. ఆయన గారు ఈ సారి వెంకటేష్ ని ఆయుధం గ వాడుకుని మన మీద దాడి కి దిగారు షాడో సినిమా తో. ఈ సినిమా లో  వెంకటేష్ వేసిన వెర్రి గెటుప్ లు అన్ని ఒక ఎత్తు అయితే చిన్న పిల్ల వాడి గా చేసిన అరగంట ఇంకొక ఎత్తు. ” అయ్యా మా నరాలు లాగేసి ఎవడో నలిపెస్తాన్నట్టు ఉంది ఆపేయండి ” అని అరిసి మొత్తుకున్నా కూడా ఎవరు జాలి దయ చుపెట్టకుండా హింస పెట్టిన చిత్రం షాడో. ” షాడో ” అని పేరు పెట్టాం కదా అని క్లైమాక్స్ ఫైట్ ని కేవలం నీడలు చూపిస్తూ కనిచేయటం మెహెర్ రమేష్ గారి భావ దారిద్ర్యం కి పరాకాష్ట . ఇవన్ని చూసి కూడా ఎవడన్న బ్రతికుంటే బయటకెళ్ళి బాడ్ టాక్ చెప్తారు సినిమా కి అని అనుకున్నాడో ఏమో మెహెర్ రమేష్ ఈ రోలింగ్ టైటిల్స్ లో స్వయం గ తెర మీద కి వచ్చి మిగిలిన ఆ ఒకరిద్దరిని చంపేశాడు. అనుమానమే లేకుండా ఈ సవత్సరం వచ్చిన అత్యంత చెత్త సినిమా షాడో
Posted

gouravam-1839.jpg?w=300&h=250

 

అల్లు శిరీష్. ఆ పేరు లోనే vibrations ఉన్నాయి. ఆయన గారు ఇండస్ట్రీ కి రాక ముందే రకరకాల కారణాలతో ఆంధ్ర ప్రదేశ్ అంతటా ఫేమస్ అయిపోయారు. శని గ్రహం top form లో ఉండగా మంచి అమావాస్య ముహూర్తం చూస్కుని ఆయన గారు HERO అనిపించుకోవాలి అని ఫిక్స్ అయ్యరు. ఆ విధం గా శిరీష్ ని పరిచయం చేసే అగౌరవం “గౌరవం” కి దక్కింది. తెర మీద ఆయన చేసిన వింత లు విశేషాలు ఒకటి కాదు రెండు కాదు. వంద లు వేలు. అన్ని ఆ రెండు గంట ల గ్యాప్ లొనె. శిరీష్ దగ్గర ఒక చెప్పుకోదగ్గ నైపుణ్యం ఉంది. పాట కి ఫైట్ కి హీరోయిన్ పక్కన రొమాన్స్ కి ఒకటే expression. ఆయన గారి expression కి subtitles అవసరం ఎంతైనా ఉంది. “శిరీష్ బాబు నవ్వాడు… శిరీష్ బాబు కోపం గ చూస్తున్నాడు… శిరీష్ బాబు బాధ పడుతున్నాడు ” ఇలా కింద స్క్రోలింగ్ రావాలి ఈ విప్లవాత్మక నటుడు కి. ఏంటి రా చెత్త సినిమా గురించి రాయమని చెప్తే శిరీష్ జపం చేస్తావ్ అంటారేమో, సినిమా మొత్తం శిరీష్ ఈ ఉన్నాడు. కాదు కాదు ఆ సినిమా లో మనం ఇంకేమి చూడలేని విధం గా ఆయన కట్టి పడేసాడు. గౌరవం ఇంకెవరన్నా చేస్తే “ఈ సినిమా లో ఏముంది ఏమి లేదు” అనేవి చూడొచ్చు. శిరీష్ గొప్పతనం ఏంటంటే తన నటన తో సినిమా ని టాప్ 3 చెత్త సినిమాల్లోకి Single Hand గా లాక్కోచేసాడు.

Posted

images-3.jpg?w=300&h=150

 

కింగ్ నాగర్జున గారు ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టుడియో మీద తీసిన సినిమాలు కొన్ని బాగా ఆడకపోయినా చూడలెనంత చెత్తగా ఐతె ఉండేవి కాదు.ఇదే ఉద్దేశం తో “పర్లేదు లే వీరభద్రం లాంటి పులిహార డైరెక్టర్ అయినా ఏదో ఒకటి ఉంటది లే” అనుకుంట లోపలికి వెళ్ళాను.లోపలికి వెళ్ళగానే “ధడేల్ ధడేల్ దిష్కాం దిష్కాం” అనే శబ్దాలు.Fight scene అనే అనుకుంటారు ఎవరన్న ఆ శబ్దాలు వినగానె.కాని అవి పోరాటాలు కాదు సంభాషణ రచయిత మన మీద  జాలి దయ అనేవి ఏవి లేకుండా రాసిన ముష్టి ప్రాస డైలాగ్స్ (అదేనండీ Bhai Bullets) అని తెలుసుకునే లోపే చెప్పుకోలేని చోట మానిపోవటానికి చాల టైం పట్టే గాయాలు చాలా అయ్యాయి. ఓరి దేవుడో ఏంటి మాకు ఈ హింస bullets తో అనుకునే లోపు “ఇప్పుడే ఎం చూసావు ముందు ఉంది రా నీకు అసలా సంబరం ” అన్నట్టు పాటలు. ఇలా bullets ని భాయ్ చేసే dance ని తట్టుకుంటూ తిట్టుకుంటూ ఫస్ట్ హాఫ్ ఎంతో కష్టం గా చూస్తాం. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆయన కి ఒక చెల్లి తమ్ముడు అందరు దిగాబడతారు తెర మీదకి.వదిలెయ్యి Bhai ఇప్పటిదాకా కొట్టింది చాలు ఇంటికి పోతాము అంటే వినకుండా చెల్లి పెళ్లి అంటాడు దానికి ఒక ప్లానింగ్ అంటాడు. ఇవి చాలవు అన్నట్టు కొన్ని ట్విస్ట్ లు సాంగ్ లు సెంటిమెంట్ లు అదనం మనకి. ఆయన Bhai కాదు సినిమా కి వెళ్ళిన వాళ్ళని నారికే కసాయి.

Posted

gouravam movie baane untundhi .. hero gaade worst 

 

 

Shadow 2013 kadha Jackie :D

 

 

i wish rabhasa aagadu nd toofan in d list

typo

2013 list adi

Posted

Ee cinrmalu chusi inka 2015 ki kooda terukunnattu ledu

gouravam big screen meedha choosthey ..inka terukoaru ..

×
×
  • Create New...