Jump to content

Vhp Complains Against Gopala Gopala


Recommended Posts

Posted

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషనల్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రంపై విశ్వహిందూ పరిషత్ వారు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసారు. ఈ సినిమా పోస్టర్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేసారు. ఈ సినిమాను నిషేదించాలంటూ సెన్సార్ బోర్డుతో విహెచ్ పి సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఈ సినిమాపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి విహెచ్‌పి కార్యకర్తలు సిద్దమయ్యారు.

 

Taking serious note of denigration of Hindu deities and religious symbols, Vishwa Hindu Parishad(VHP) today demanded complete ban on screening of Film Gopala Gopala

Posted

mundu velli PK mvie ni pikamanali dhammu unte 

2019 daka alanti challenges cheyaddhu ba akkada VHP RSS Bajarangdal abbo chala unnay

Hyd nunchi no. vachindha

Posted

'పీకే' చిత్రంపై వివాదం ఇంకా కొనసాగుతుంటే... మరోవైపు వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న 'గోపాలా గోపాలా' చిత్రంపై వీహెచ్పీ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వీహెచ్పీ కార్యకర్తలు బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేపట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
 

Posted

సినిమా రంగాన్ని ఉపయోగించుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఒక పథకం ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర. సినిమాటోగ్రఫీ చట్టంలోని లొసుగులను, సెన్సార్ బోర్డులో తిష్టవేసిన అవినీతిని ఆసరాగా చేసుకుని, స్వేచ్ఛ పేరుతో, వినోదం పేరుతో హిందువుల దేవ దేవతలను, భారతీయ విలువలను దెబ్బతీసే విధంగా సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలను వెంటనే నిషేదించాలని, వాటి ప్రదర్శనకు అనుమతులు ఇవ్వకూడదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది.

దీనిపై వారు మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రం ప్రోమో ఇటీవల టీవీ చానల్స్ లో ప్రసారం అయింది. శ్రీకృష్ణుని వేషధారణతో అసభ్యంగా నాట్యాలు చేస్తూ, వినోదం కోసం దేవుళ్ల వేషధారణ వేయడంపై ఈ రోజు సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసాం. ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని, ఈ చిత్రం ప్రివ్యూ కూడా వెంటనే నిషేదించాలని డిమాండ్ చేస్తూ లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది' అని తెలిపారు.

ఫిర్యాదుపై స్పందించిన రీజనల్ అధికారి, ఈ చిత్ర ప్రమోకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, వెంటనే క్రమినల్ కేసులు నమోదు చేయడానికి పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేస్తానని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉంటే ఈ చిత్ర విడుదల ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని...భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు.

సినిమా రంగం హిందువుల మనోభావాలు గౌరవించేలా ప్రవర్తించాలి. లేకుంటే తగిన గుణపాఠం చెప్పాల్సివస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంటూ....భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, కార్యదర్శి రావినూతల శశిధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

×
×
  • Create New...