Jump to content

Recommended Posts

Posted

 జ్యోతిష్కులు కూడా అదే చెబుతున్నారు
 తర్వాత రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి
 రాజధాని రైతుల బాధలు వింటుంటే
నా గుండె తరుక్కుపోతోంది 
 మంగళగిరి, తాడేపల్లి రైతులతో జగన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ కాలం, తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశాలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం ఉందని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు. కానీ ఈ అధికారం ఉండేది రెండు సంవత్సరాలే. జ్యోతిష్కులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఒకవేళ దేవుడు అనుకూలిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు. ఏం చేసినా ఆ అధికారం పోయేలోపే. నేను హామీ ఇస్తున్నా.. ప్రతీ రైతుక్కూడా చెబుతున్నా.. మీకందరికీ అంగీకారమైతేనే భూములు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు కాదుగదా.. వాళ్ల నాయనా వచ్చినా కూడా తీసుకోలేడు’’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడేపల్లి, మంగళగిరి, నిడమర్రు మండలాలకు చెందిన రైతులతో సోమవారం ఆయన వైసీపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఉండవల్లి, కొరగల్లు, పెనుమాక నుంచి పెద్ద ఎత్తున వచ్చిన రైతుల బాధలు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. శాసనసభలో చట్టాలను చదివి వినిపించి, రైతులు ఒప్పుకొంటేనే రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ ప్రస్తుతం రైతులను భయపెట్టి కుట్రపూరితంగా భూములను లాక్కొంటున్నారన్నారు. టీడీపీ వర్గీయులే పంటలను తగలబెట్టి ఆ నెపాన్ని వైసీపీ నేతలపై మోపాలని చూస్తున్నారన్నారు. విలువైన భూములు ఇచ్చేందుకు అంగీకరించని తమ నేతలపై పోలీసులు కూడా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి తాము అనుకూలమేనని, కానీ భూములు తీసుకునే విధానమే నచ్చలేదన్నారు. రైతులందరికీ అంగీకారం అయితేనే.. భూములు తీసుకుంటారని లేకపోతే చంద్రబాబు నాయన వచ్చినా తీసుకోలేరని ఆయన సవాల్‌ విసిరారు. ‘‘మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడులాంటి నేనే సీఎంని అవుతా’’నని జగన్‌ వారికి చెప్పారు. ‘‘భూములు తీసుకునే వ్యవహారం భయానక వాతావరణంలో నడుస్తోంది. పోలీసులు అక్కడ కేవలం వైసీపీ నేతలే లక్ష్యంగా కేసులు నమోదు చేస్తున్నారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరు. ఇష్టంతో ఇస్తామంటే తీసుకోండి. వారికి ఇష్టం లేకుండా తీసుకుంటే ప్రతిఘటిస్తాం’’ అని చెప్పారు. రియల్‌ వ్యాపారం చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
విచారణ జరిపించండి

Posted

Mangalagiri n tadepalli etaggu jaffas ee undedhi

Lakku dhobbandi edava nasaa

Posted

Mangalagiri n tadepalli etaggu jaffas ee undedhi

Lakku dhobbandi edava nasaa

 

 

tollygifs_brahmi3.gif kadapa ninchi balagani ni dimputam 

×
×
  • Create New...