edo_oka_ragam Posted January 9, 2015 Report Posted January 9, 2015 కమలకరరావు-కడుపునొప్పి పెద్దలు "ఆరొగ్యమే మహభాగ్యం" అన్నారు. "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగదరా నీ తల్లి భూమి భారతిని" అని రాయప్రొలు సుబ్బారావు గారు చెప్తే, కమలాకరుడు మాత్రం "ఏ దేశమేగినా ఆరోగ్యమే మహభాగ్యం" ఆ పై రెండు సామెతలను Remix చేశాడన్నమాట. మన చేతులలో లేని వాటి గురించి మనమేమీ చేయలేమనుకున్నా, కనీసం ఉన్నవాటి గురించి జర భద్రం అని ఈ కథలో కమలాకరుడు మనతో మొర పెట్టుకుంటున్నాడు. అదేమిటో విందాం రండి మరి. నేటి భారతంలో మందుల చీటితో సంబంధం లేని మందుల షాపులు, జబ్బులతో సంబంధం లేని వైద్యులు(అంటే మరణించిన వాళ్ళకు కూడా వైద్య సహాయలు ఎక్కువయ్యాయని సదరు ప్రజల అపోహలు-అవునని మనం అన్న కాదంటారనే అపోహలన్నాను మరి).అందరికీ "జబ్బు డబ్బు" అదేనండీ డబ్బు జబ్బు పట్టుకుంది. వెరసి మొత్తం ఒక పెద్ద వ్యాపారం. (ఆ వ్యవహారం మనకెందుకులెస్తురూ. కాస్త చూసి చూడనట్లు పోవడం స్వంతంత్ర భారతంలో అందరికీ అలవాటయిన వ్యవహారమే కదా). కాకుంటే మన అదృష్టమో, దురదృష్టమో మనకి ఈ వైద్య సదుపాయలు, సహాయాలు డబ్బు ధారపోతని బట్టి కాస్తంత వేగం పుంజుకుంటుంది. ఇంతకీ కమలాకరుడి బాధ చెప్పకుండా, ఈ సోది అంతా ఎందుకు అంటారా? వచ్చేస్తున్నా.. అక్కడికే వచ్చేస్తున్నా..ఆగండోయ్.. పారిపొకండి.. రచయతల మీద కాస్త కరుణ వర్షం కురిపించండి సుమా. నేనంత వీజిగా Topic లోకి దూరిపోలేనండోయ్. మీకు తెలుసు కదా నా ఈక్-నెస్. కమలాకరుడు జర్మనీ దేశంలో అడుగుపెట్టాడు.కారణాలు కథకి అవసరం కాదు కనుక మీకనవసరం అన్నాడు. వచ్చిన 3 నెలలు బాగానే ఉన్నాడు. 4వ నెల నుండి మొదలయ్యాయి మెల్లగా కష్టాలు. చిన్నగా నిద్ర పట్టకపొవడం, వేళ తప్పిన తిండి అలవాట్ల వల్ల బాగా కడుపు నొప్పి మొదలయింది. అది Gastric pain అనే సూచనల వల్ల సొంత వైద్యం మొదలు పెట్టాడు. నేటి భారతం నుండి తెప్పించుకున్న OMIZ-D మందులు కొంత కాలం వాడినా ప్రయోజనం కనిపించలేదు. ఆలస్యం విషం అని భావించి హుటహుటిన ఒక వైద్యుడిని సంప్రదించాడు. అతను చాల రొజుల నుండి ఉందా !! అని దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని పెద్ద ఆసుపత్రికి ఒక చీటి రాసి ఇచ్చాడు. దాని మీద investigation అని జర్మను భాషలో లిఖించబడినది. అది చూసి మన కమలాకరుడికి కాస్త కంగారు పుట్టి వణుకుతూ ఆ పెద్ద ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ అత్యవసర విభాగంలోని నర్సమ్మకి ఆ చీటి చూపిస్తే ఆమె కంగారు లేకుండా కడు శాంతమూర్తియై వేచియుండండి. మా వైద్యులు కొద్ది సేపట్లో (అంటే చాల సేపటికి అని మనకు ముందు ముందు కాని అర్ధం కాదు) మీకు వైద్య సహాయం చేయగలరు అంటూ జర్మన్ భాషలో చెప్తే, మన వాడికి అది కాస్తా తిట్లులా అనిపించి కష్టపడి కళ్ళు పెద్దవి చేసుకుని మరియు చెవులు రిక్కించి వింటే , పాపం ఆ భాష తీరు అంత కదా.నర్సమ్మకి నా మీద పగలేమీ లేవులే అని నిర్ధారించుకుని ఆ నర్సమ్మ చూపించిన విశ్రాంతి గదిలో వేచియున్నాడు. తాను ఉన్న గదిలో చాల మంది పిల్లలు, తల్లులు, వృద్దులు వయోపరిమితితో సంబంధం లేని సమస్యలతో ఉన్నవారు వేచి వేచి ఉన్నారు. ఒక గంట అయింది, రెండు గంటలయింది. ఒక పక్క కడుపునొప్పి, మరో పక్క ఆకలి. వెరసి, నరకపుటంచులలో శిక్షాస్మృతిని అనుభవిస్తున్న వాడిలా, బహు వేడిగా ఉన్నాడు. కాని వైద్యుడు రాడే! ఎంత సేపటికీ. ఇక లాభం లేదని తెలిసిన తారకమత్రం – “వైద్యో నారయణో హరి” యని మనసులో స్మరించుటు వేచియుండగా.. ఒక 12 గంటల తర్వాత వచ్చారు సదరు వైద్యుల వారు. మరి ఈయనేదో హరిలా "సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్" అనుకుంటే ఈయనేమో నువ్వేమి నాకు ఎమర్జన్సీ రోగివి కాదని కమలకరుడితో జెప్పగా, బహు దుఃఖం పొంగుకు రాగా, ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడేనొయ్ హీరో అని ముళ్ళపుడి వారి మాటలు మదిలో మెదలి చిరునవ్వుని మెరిపించాడు ఎండిన పెదాలపై. సమస్యలన్నీ(అంటే ఉన్నది ఒకటే సమస్య అనుకోండి) ఆంగ్ల భాషలో ఏకరువు పెట్టగా చాల శ్రద్దగా విన్న డాక్టరు గారు, ఇప్పుడే ఇక్కడ మిమ్మల్ని జేర్చుకుని మాకు అనుమానం ఉన్న జబ్బులకి సంబంధించిన పరీక్షలు చేసెదెము.కంగారు పడకురా బాలకా అని ధైర్యోపవచనాలు జర్మను భాషలో పలికారు.అలా 3 రోజులు నెమ్మదిగా రోజుకు తమకి కుదిరిన సమయంలో వచ్చి కొన్ని పరీక్షలు క్షుణ్ణంగా చేసి అది మరేమి భయపడవలసినది కాదు అని gastric trouble నిర్ధారణకి రాగా, రాగాలు పాడుకుంటూ, పూర్తిగా తగ్గని కడుపునొప్పితో..ఒక 4రొజుల తర్వాత ఇంటికి చేరుకున్నవాడై, ఆహారములో తగు జాగ్రత్తలు తీసుకుంటుండగా, ఇంకో 3 రోజుల తర్వాత సదరు ఆసుపత్రి వారి నుండి భారీ మొత్తములో బిల్లు వచ్చినది. అది చూసి గుండెని పట్టుకుని కుప్పకూలినంత పని అయినది. అది అక్షరాల 1,600.00 €=117,675.32 INR. ఇప్పటిదాక అయినది ఒక ఎత్తు. ఇప్పుడు ఆ private insurance వాడూ బిల్లు మీరు ముందు చెల్లించుకోవలయును. తదుపరి మేము చెల్లించయత్నించెదము అని మెలిక పెట్టినాడు. కావున ముందు కమలాకరుడు ఆ బిల్లుని మొత్తం అణా పైసలుతో సహా చెల్లించి సదరు ఆ కంపనీకు అన్ని దస్తా పేపర్ల documents పంపినవే మరో మూడు సార్లు పంపించి, చివరకు మూడు మాసముల పిమ్మట ఆ బిల్లు డబ్బులు బ్యాంకు లొ జమపరిచితిరి. అప్పుడు కమలకరుడి కన్నులలో ఆనంద భాష్పములు వరదలా పొంగగా, వాటిని బక్కెట్లలో నింపి ఆరొజు వాటితో జలకాలాడాడు. ఆరొజుకి కనీసం నీటి బిల్లు తగ్గుతుంది కదా అనే ఆశతో. మీరు నవ్విపొదురుగాక "ఇదేమి చోద్యం, కడుపునొప్పికి ఒక 1.17 లకారాలు ఖర్చు చేశారన్నమాట" అని దీర్ఘాలు తీసినా , కాని ఏమి చేస్తాం..అలా జరిగిందన్నమాట . అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడ ఇన్సురెన్సు లేనిదే వీసా ఇవ్వరు కనుక, ఖర్చుపెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేశాయి. అదే అదృష్టం బాగోకుంటే "అరటిపండు తిన్నా పన్ను విరిగితే"దానికి అయ్యే ఖర్చుకు స్వదేశంలో ఆస్తులు కరగ బెట్టి ఈ విదేశములో చెల్లింపవలసి వచ్చేదెమో కమలాకరుడికి పాపం. ఈదేసిన గోదారి - దాటేసిన కష్టాలు" తీయగా ఉంటాయి అని మన గురువుగారు చెప్పినట్లు ఇప్పుడు నీతి హాస్య కథలుగా తన అనుభవాల్ని పంచుకుంటున్నాడు ఈ మంచోడు కమలాకరుడు.
athapurbaba Posted January 9, 2015 Report Posted January 9, 2015 Entidhi asalu...nuvvu rasava leka edhanna magazine lodha...intha pedhaga undhi
athapurbaba Posted January 9, 2015 Report Posted January 9, 2015 Ohh avna...aithe ill read and tell u review my own work andi :)
athapurbaba Posted January 9, 2015 Report Posted January 9, 2015 Hehe bavundi boss nice work...i liked the way u narrated it
timmy Posted January 9, 2015 Report Posted January 9, 2015 ee roju first time choosthunna telugulo post . bagundhi thanks
athapurbaba Posted January 9, 2015 Report Posted January 9, 2015 Inkemaina raasara....unte post cheyandi..chadivi pedtha...manakasale ivanni chala interest ??
kakatiya Posted January 10, 2015 Report Posted January 10, 2015 Papam kamalakaram.. Germany lo kooda ilane doctors baga lagutaru anamata
micxas Posted January 10, 2015 Report Posted January 10, 2015 ?? em ledu, ruler ane id undi, adi meedena ani asking, never mind. sirikim cheppadu padyam vadatam nachaledu naku, konni ala ekkada padite akkada vadakudadau.. just my opinion.
micxas Posted January 10, 2015 Report Posted January 10, 2015 ఈదేసిన గోదారి - దాటేసిన కష్టాలు idhi matram superandi.. so true, well said.:)
Recommended Posts