edo_oka_ragam Posted January 11, 2015 Report Posted January 11, 2015 విలాసాల వినోద్-వింత కష్టాలు, విన్నపాలు వినవలే :) "అనుకున్నదొక్కటి,అయినది ఒక్కటి..బొల్తా కొట్టాడులే ఈ బుల్లోడు". ఏంటీ? కథ మొదలు పెట్టి పాటలు రాస్తుంది? అనుకున్నారా.. ఈ కథ అంత చదివాక మీరు అదే పాట ,ఎటూ గుర్తు తెచ్చుకుంటారనీ ముందే చెప్పేశాను పాఠక మహాశయులకు. చిన్నప్పటి నుండీ చదువు అంటే గొంగళి పురుగుతో సమానంగా భావించినా, ఎదో సమాజంలో బ్రతుకుతున్నాము,చదువుకోకపొతే ఏమవుతావో అని వాళ్ళు, వీళ్ళు చెప్పడం వల్ల డుంకీలు కొట్టుకుంటూ అత్తెసరు మార్కులతోఅందరిలాగానే ఇంజనీరింగ్ పట్టభద్రుడై కొంచెం కష్టపడి ఆ షేకుల దేశాలలో ఒక మంచి ప్రాంతంలో ఉద్యొగంతెచ్చేసుకున్నాడు. అసలు పాఠశాలలనే వినోదశాలలుగా భావించిన మన వినోద్ కి ఇక్కడ వారం అంతా మూడు Parties, ఆరు pubsఅంటూ అంత్యంత విలాసంగా ఆరు సంవత్సరాలు అర నిమిషంలా గడిచిపోయాయి. అప్పుడే అనుకోకుండా, పెళ్ళిరూపంలో అన్ని కష్టాలనీ ఒకే సంవత్సరంలో చూసేస్తాడని ఏనాడు ఉహించుకోలేదువినోదుడు. కాబోయే పెళ్ళానికి జర్మనీలో ఉద్యోగం అనగానే "యాహూ "అనుకుంటూ.. ముందు, వెనకఆలోచించకుండా ఆకాశంలో ఉన్న మేఘం 9 (Cloud9)లో విహరించసాగాడు. అప్పటికే, తను ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఉన్న ఐరొపా దేశీయులని చూసి, అతిగా ఊహించేసుకుని.. అక్కడ నాకువినోదాలకి, విలాసాలకి కొదవేమి? నా పేరుని సార్ధకం చేసుకునే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదుఅనుకున్నాడు. జర్మనీ దేశంలో అడుగుపెట్టిన వెంటనే తనకి "ఎర్ర తివాచీ వేసి మరీ, ఆహ్వనం ఇచ్చి మరీ ఉద్యొగస్తుడినిచేస్తారు ఆ దేశీయులు" అని గంపెడాశలతో ..ఉన్న ఉద్యోగాన్ని ఎడమకాలుతో తన్నేసి, పెళ్ళి చేసుకుని జర్మనీ దేశంలోపడ్డాడు. వచ్చే ముందే భార్యమణి చెవిలో జోరీగై మొర పెట్టుకుంది "స్వామీ! ఇక్కడ మనకు వింత భాషతో ఒక క్లిష్టసమస్య ఉంటుంది. మీరు కొంచెం నేర్చుకుని ఈ దేశంలో అడుగుపెడితే బాగుంటుంది కదా అని".కానీ, ఈ వినోదుడికితనకు వచ్చిన రెండు నెలలలోపే ఉద్యోగం దొరికేస్తుంది. తన ప్రతిభా, పాఠవాల గురించి ఈ కొత్త పెళ్ళాంకి ఏమితెలుస్తుంది ?తనకు ఆంగ్ల భాషలో కడు ప్రావీణ్యము కలదు కదా! అని ప్రగల్భాలకు పోయి ఆ భాషతో నాకేల అని అంతఆశక్తి చూపించక, తన అశక్తతను, అయిష్టాన్ని ప్రదర్శించాడు. వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే ఈ జర్మను దేశములో జనులెవ్వరు జర్మను భాషలో తప్ప, అన్య భాషలుమట్లాడరని గ్రహించాడు. కానీ, గుండె ధిటవు చేసుకుని తనకు తెలిసిన ఆంగ్ల భాషలోనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.అంతర్జాలకంలో(Internet) భూతద్దం వేసి మరీ గాలించినా ఒక్క ఉద్యోగం కుడా దొరక్కపొయేసరికి, తాను ఈజర్మను జలుబు నుండి తప్పించుకోవడానికి మరో దారి దొరకక, ఈ భాష నేర్చేసుకోడానికి మానసికంగాఉద్యుక్తుడైనాడు. "కట కటా! ఈ కష్టములు నాకేల" అని ఏనాడు మొక్కని దేవుడిని మొక్కినా, ఉపయోగం లేకపొయే. జర్మను భాష కన్నా ముందు ,వాళ్ళావిడ...ఐరొపా ఖండంలోని గొప్ప ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇక్కడ జీవితం ఇంతబాగుంటుందని ఒక భ్రమలోకి తీసుకెళ్ళింది. ఆ ఉత్సాహం ముణ్ణాళ్ళ ముచ్చటే అయింది. అసలే చదువంటే పరమచిరాకు. అందులోనూ భాష నేర్చుకోవడం, భాషా సినిమా చూసినంత సులువు కాదని తెలిసినా కుడా ఈ సినిమా నుండినేను తప్పించుకోడం మాత్రం సాధ్యము కాదు గనుక ఒక జర్మను పాఠశాలలో విద్యార్ధుడిగా చేరాడు. "దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన " అన్నట్లు, అక్కడ ఒక ముసలి పంతులమ్మ Torture ని Torch light వేసి మరీచూపిస్తూ, హిట్లరు కి అమ్మలా, పెన్ననుకున్నవా ?ఇది గన్ను ..అంటూ పిస్తొలు కాని పిస్తొలుని నుదుటి మీద పెట్టిమరీ చెమటలు తెప్పించేది.” పొగిడినా తిట్టినట్లుండే ఈ భాషని నేర్చుకోవడం నావల్ల కాదు. ఈ జర్మను భాష కన్నా,16సంవత్సారాల చదువునంత ఒకేసారి చదవడం మిన్న” అని ఇంటికొచ్చి భార్యమణితో మొరపెట్టుకుంటే.. ఆవిడ” భాషఅంటే అంతే ఉంటుంది. ఎక్కువ మొండికేస్తే, preparation లేకుండా చివరి level అయిన C1 రాయించేస్తాను” అని బెదిరించింది. ఇంత బాధల్లోనూ, అప్పుడప్పుడు..తరగతిగది లో జరిగే హాస్యపు సంభాషణలు, ఎడారిలో ఒక పది సెకండ్లు కురిసిన వర్షంలా తోచేది వినోదాన్ని కోల్పోయిన వినోదుడికి. ఆరు మాసాలు ఆరు యుగాలుగా తోచాయి. ఎట్టకేలకు ఆ B1 కాస్తా పూర్తి చేసి, జర్మనీలో బ్రతకడానికి కావలసినంతభాషను బుర్రలోకి ఎక్కించుకున్నాడు. కోల్పోయిన తన గత వైభవాన్ని, ప్రాభవాన్ని తలచుకుని శత్రువు చేతిలోఓడిపొయి ,అడవులకు పారిపోయిన రాజు వలే.. చాలనే దిగులు పడేవాడు. క్రమేణా ఆ దిగులు అలవాటైపొయింది. అదిదిగులులా అనిపించకపోగా ఎక్కడికెళ్ళినా, ఏమి చేసినా జర్మను భాషలో అలొచించసాగాడు. ఆ అవస్తను చూసిన తనభార్య మాత్రం" హమ్మయ్య! జర్మను పిచ్చి పట్టేసింది కదా, ఇంకెన్నోరొజులు పట్టదు, నా భర్తకి ఇక ఉద్యోగం వచ్చేసినట్లే"అని సంబరుపడుతుంది పాపం. అసలు బాధ వినోదుడికి ఇప్పుడే ప్రారంభం అయింది. ఇప్పటిదాక తాను సినిమా విడుదలకు ముందు చూపించే trailerనే చూశాడు. ఇప్పుడే సినిమా మొదలవుతుంది అని ఆ Vorstellungsgespräch (interview) సన్నహాలు మొదలు పెట్టిన తర్వాతనే తెలిసింది. అది భగీరథుడు గంగా దేవిని భూమికి తీసుకురావడానికి చేసిన తపస్సుతో సమానంగా తోచింది వినోద్ కి. దాంతో, యఙ్ఞయాగాదులు చేసే సొమయాజులులా.. గడ్డాలు, మీసాలు పెంచేసి నిత్యం జర్మనుభాషలో interview ప్రశ్నొత్తరాలను పారాయణం చేయసాగాడు. కష్టం అంటే తెలియని ఈ వినోదుడికి, జర్మను భాషలో అనేక కష్టాలు ఒకేసారి వచ్చి, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డపెసరట్టులా మాడిపొయాడు. కానీ, "ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పద"న్నట్లు ఇది తనకు తప్పదనుకుంటూ ,ఎప్పటికైనా తన భాషా ప్రావీణ్యంతో ఆ ఉద్యోగం సంపాదిస్తానని భీష్మ ప్రతిఙ్ఞ చేసి జర్మనీలో ఉన్న ఉద్యోగాలపై యుద్దంప్రకటించి అలుపెరుగని సైనికుడివలే పోరాడుతున్నాడు. మరి అలాంటి వినోద్ కి మనం best wishes తప్పక మనం చెప్పాల్సిందేనండోయ్ మరి. ఇప్పటికైనా మీకు బోధపడి ఉంటుందనుకుంటా.. ఈ టపాని, ఆ పాటతో ఎందుకు మొదలు పెట్టానో!!
sigsegv Posted January 11, 2015 Report Posted January 11, 2015 english pls .. naaku telugu chadavatam antha gaa raadu ..
kiladi bullodu Posted January 11, 2015 Report Posted January 11, 2015 German blondes are best and German beer is good
timmy Posted January 11, 2015 Report Posted January 11, 2015 German blondes are best and German beer is good
sigsegv Posted January 11, 2015 Report Posted January 11, 2015 German blondes are best and German beer is good and german papalai manam nachuthaam
dappusubhani Posted January 11, 2015 Report Posted January 11, 2015 German blondes are best and German beer is good Bhayya.. Nee pic pm Chei Bhayya.. danda vesi daily dandam pettukunta.. maata tappavu, madama tippavu baa nuvvu..
Bongu..Boshanam Posted January 11, 2015 Report Posted January 11, 2015 :) I'm goin to Germany next week bro... ur post scaaaaaaaaaaaaaaaaaaaaaaaring me.. lol..
Gowtham7777 Posted January 11, 2015 Report Posted January 11, 2015 gp... europeans valla basha ki iche villuvaki abinandhaniyam.
Recommended Posts